కావలసినవి:
మటన్ కీమా - 250 గ్రా; కొత్తిమీర - అర కప్పు
అల్లం - చిన్నముక్క; వెల్లుల్లి రేకలు - 5
పచ్చిమిర్చి - 3; కారం - టీ స్పూను
ధనియాలపొడి - టీ స్పూను
ఉప్పు - తగినంత
తయారి:
మటన్ కీమా - 250 గ్రా; కొత్తిమీర - అర కప్పు
అల్లం - చిన్నముక్క; వెల్లుల్లి రేకలు - 5
పచ్చిమిర్చి - 3; కారం - టీ స్పూను
ధనియాలపొడి - టీ స్పూను
ఉప్పు - తగినంత
తయారి:
- కీమాను శుభ్రం చేసి బాగా కడిగి తడిపోయే వరకు ఆరనివ్వాలి.
- మిక్సీలో సగం కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొద్దిగా నీరు వేసి మెత్తగా పేస్ట్‌లా చేయాలి.
- కారం, ఉప్పు, కీమా, ధనియాలపొడి, వేసి మెత్తగా చేయాలి.
- మిశ్రమాన్ని బయటకు తీసి చిన్నచిన్న బాల్స్‌లా చేయాలి.
- ఒక పాత్రలో నీరు పోసి ఈ బాల్స్‌ని అందులో వేసి బాగా ఉడికించాలి. (ఇవి ఉడకడానికి సుమారు 10 నిముషాల పైనే పడుతుంది)
- నీటిని వడ పోసి బాల్స్‌ను పేపర్ టవల్ మీద ఉంచాలి.
- బాణలిలో నూనె పోసి కాగాక ఈ బాల్స్‌ని నూనెలో వేసి బాగా వేయించి తీసేయాలి.