కావలసినవి:
బాస్మతి బియ్యం - అర కిలో;
బిరియానీ ఆకు, నల్ల ఏలకులు, ఆకుపచ్చ ఏలకులు - 2 చొప్పున;
నువ్వులు - 2 టీ స్పూన్లు;
మిరియాలు, లవంగాలు - 6 చొప్పున;
దాల్చినచెక్క, జాపత్రి, జాజికాయ - కొద్దికొద్దిగా;
మెంతులు - టీ స్పూను;
ఉప్పు - 3 టీ స్పూన్లు;
మటన్ - కేజీ;
గరంమసాలా - టేబుల్ స్పూను;
అల్లంవెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు;
బొప్పాయి గుజ్జు - 3 టేబుల్ స్పూన్లు;
పుల్ల పెరుగు - 4 టేబుల్ స్పూన్లు;
నిమ్మరసం - టీ స్పూను;
కారం, ఉప్పు - తగినంత;
ఉల్లితరుగు, టొమాటో ప్యూరీ,
చల్లటి పాలు - పావు కప్పు చొప్పున;
నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు;
కుంకుమపువ్వు - కొద్దిగా;
నూనె - కొద్దిగా;
రోజ్ వాటర్ - రెండు చుక్కలు;
పచ్చిమిర్చి - 4;
ధనియాల పొడి, జీలకర్ర పొడి- టీ స్పూన్ చొప్పున;
పుదీనా, కొత్తిమీర - కొద్దిగా
తయారి:
అన్నం తయారి:
బాస్మతి బియ్యం - అర కిలో;
బిరియానీ ఆకు, నల్ల ఏలకులు, ఆకుపచ్చ ఏలకులు - 2 చొప్పున;
నువ్వులు - 2 టీ స్పూన్లు;
మిరియాలు, లవంగాలు - 6 చొప్పున;
దాల్చినచెక్క, జాపత్రి, జాజికాయ - కొద్దికొద్దిగా;
మెంతులు - టీ స్పూను;
ఉప్పు - 3 టీ స్పూన్లు;
మటన్ - కేజీ;
గరంమసాలా - టేబుల్ స్పూను;
అల్లంవెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు;
బొప్పాయి గుజ్జు - 3 టేబుల్ స్పూన్లు;
పుల్ల పెరుగు - 4 టేబుల్ స్పూన్లు;
నిమ్మరసం - టీ స్పూను;
కారం, ఉప్పు - తగినంత;
ఉల్లితరుగు, టొమాటో ప్యూరీ,
చల్లటి పాలు - పావు కప్పు చొప్పున;
నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు;
కుంకుమపువ్వు - కొద్దిగా;
నూనె - కొద్దిగా;
రోజ్ వాటర్ - రెండు చుక్కలు;
పచ్చిమిర్చి - 4;
ధనియాల పొడి, జీలకర్ర పొడి- టీ స్పూన్ చొప్పున;
పుదీనా, కొత్తిమీర - కొద్దిగా
తయారి:
- ఒక పాత్రలో మటన్, పెరుగు, అల్లంవెల్లుల్లి పేస్ట్, బొప్పాయి గుజ్జు, కారం, నిమ్మరసం, గరంమసాలా వేసి మూడు గంటలపాటు మారినేట్‌చేయాలి.
- బాణలిలో నూనె వేసి వేడయ్యాక, సగం ఉల్లితరుగు వేసి వేయించి ప్లేట్‌లోకి తీసుకోవాలి.
- పాన్‌లో నెయ్యి వేసి కరిగాక మిగిలిన ఉల్లితరుగు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి.
- అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి మరోమారు కలపాలి.
- మ్యారినేట్ చేసిన మటన్ జత చేసి బాగా మగ్గిన తర్వాత, టొమాటో ప్యూరీ వేసి కలపాలి.
- ధనియాలపొడి, జీలకర్రపొడి వేసి కలపాలి.
- మూడు కప్పుల నీరు పోసి మూత ఉంచి నాలుగు విజిల్స్ వచ్చే వరకూ ఉంచాలి. (అవసరానికి తగ్గట్టు నీరు ఎక్కువ వేసుకుని, మాడకుండా చూసుకోవాలి)
- పాన్ మూత తీసి ఉప్పు, గరంమసాలా, కొత్తిమీర వేసి పది నిముషాలు ఉడికించాలి.
అన్నం తయారి:
- బియ్యాన్ని 20 నిముషాలు నానబెట్టి కడిగి, నీరు ఒంపేయాలి.
- ఒక వస్త్రంలో ఏలకులు, దాల్చినచెక్క, లవంగాలు, జాపత్రి, జాజికాయ ముక్క, మిరియాలు వేసి మూట కట్టాలి.
- 750 మి.లీ. నీటిని మరిగించి, అందులో బియ్యం, బిరియానీ ఆకు, ఉప్పు, మూట కట్టిన వస్త్రం ఉంచి అన్నం మూడు వంతులు ఉడికాక, నీరు ఒంపేసి, మూట తీసేయాలి.
- ఒక కప్పులో పాలు, కుంకుమపువ్వు వేసి బాగా కలపాలి.
- ఒక పెద్ద పాత్ర తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కరిగాక పాత్రకు కిందకు దింపి, పాత్ర అంతా అంటేలా పాత్రను కదపాలి.
- ఉడికించిన బియ్యం, మటన్ ముక్కలు, కుంకుమపువ్వు పాలు, వేయించిన ఉల్లితరుగు, నెయ్యి వరుసగా ఒకదాని మీద ఒకటిగా లేయర్లుగా పరచాలి. మొత్తం మిశ్రమాన్ని ఈ విధంగా అమర్చాలి.
- పైన పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు, వేయించిన ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు, నిమ్మరసం, రోజ్ వాటర్ వేసి గట్టి మూత ఉంచి స్టౌ మీద ఉంచాలి. 20 నిముషాల తర్వాత దించేయాలి. వేడివేడిగా సర్వ్ చేయాలి.