చిల్లీ చికెన్ తయారు చేయడానికి కావలసినవి:
చికెన్ - 250 గ్రాములు
ఉల్లిపాయ - 1
కారంపొడి - 1 టేబిల్ స్పూన్
అజినొమొటొ - చిటికెడు
పచ్చిమిర్చి - 2
పంచదార - 1/2 టేబిల్ స్పూన్
సోయా సాస్ - 1 టేబిల్ స్పూన్
చిల్లీ సాస్ - 1 టేబిల్ స్పూన్
టమాటా సాస్ - 2 టేబిల్ స్పూన్
తందూర్ కలర్ - చిటికెడు
మిరియాలపొడి - 1/2 టేబిల్ స్పూన్
ఉప్పు - తగినంత
నూనె - 3 టేబిల్ స్పూన్
చికెన్ - 250 గ్రాములు
ఉల్లిపాయ - 1
కారంపొడి - 1 టేబిల్ స్పూన్
అజినొమొటొ - చిటికెడు
పచ్చిమిర్చి - 2
పంచదార - 1/2 టేబిల్ స్పూన్
సోయా సాస్ - 1 టేబిల్ స్పూన్
చిల్లీ సాస్ - 1 టేబిల్ స్పూన్
టమాటా సాస్ - 2 టేబిల్ స్పూన్
తందూర్ కలర్ - చిటికెడు
మిరియాలపొడి - 1/2 టేబిల్ స్పూన్
ఉప్పు - తగినంత
నూనె - 3 టేబిల్ స్పూన్
- ఉల్లిపాయ తరిగి ముద్దలా గ్రైండ్ చేసుకోవాలి.
- కుక్కర్లో శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలు, ఉప్పు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, కారం పొడి వేసి కలిపి మూతపెట్టి రెండు విజిల్స్ రాగానే దింపేయాలి.
- చికెన్ కడిగిన నీళ్లు ఊరతాయి కాబట్టి మళ్లీ విడిగా నీరు పోయనవసరం లేదు.
- ప్యాన్లో నూనె వేడి చేసి ఉల్లి తరుగు వేసి దోరగా వేపాలి. ఇందులో అజినొమొటొ, సోయా సాస్, చిల్లీ సాస్, టమాటా సాస్, పంచదార వేసి కలపాలి.
- రెండు నిమిషాల తర్వాత కలర్, మిరియాలపొడి కూడా వేసి కలిపి చికెన్ ముక్కలు వేయాలి. ఉప్పు సరి చూసుకుని మొత్తం కలుపుతూ తడి పూర్తిగా పోయేవరకు వేయించాలి. తర్వాత ఉల్లిపొరకతో అలంకరించి సర్వ్ చేయాలి.