కావలసిన పదార్థాలు :
గుడ్లు - 4
నూనె - 3 టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ - ఒకటి
గరం మసాలా - ముప్పావు టీస్పూన్
ధనియాల పొడి - అర టీస్పూన్
పచ్చిమిర్చి తురుము - టీస్పూన్
పసుపు - టీస్పూన్
అల్లం - అర అంగుళం ముక్క
ఉప్పు - తగినంత
టొమాటో గుజ్జు - 2 టేబుల్ స్పూన్లు
పన్నీర్ - పావుకిలో
కొత్తిమీర తురుము - 2 టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి రెబ్బలు - 4
కారం - 2 టీస్పూన్లు
తయారుచేసే పద్ధతి :
ముందుగా కోడిగుడ్లను ఉడికించి పక్కన పెట్టుకోవాలి. పన్నీర్ ను ముక్కలుగా కోసి బంగారు వర్ణంలోకి మారేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం, పచ్చిమిర్చి అన్నీ కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఒక బాణలిలో నూనె వేసి ఉల్లిమసాల వేసి గోధుమ వర్ణంలోకి మారేవరకు వేయించుకోవాలి. తర్వాత ఉప్పు, పసుపు, ధనియాల పొడి వేసి ఓ నిమిషం వేయించాలి. తర్వాత టమాటా గుజ్జు కూడా వేసి నూనె తేలేవరకు వేయించాలి. తర్వాత కప్పు నీళ్ళు పోసి ఆవిరి అయి పోయే వరకు ఉడికించుకోవాలి. తర్వాత పన్నీర్ ముక్కలు, ఉడికించిన కోడిగుడ్లు వేసి కలపాలి. ఇప్పుడు మరో కప్పు నీళ్ళు పోసి పది నిముషాలు ఉడికించుకోవాలి. చివరగా గరం మసాలా, కొత్తిమీర తురుము చల్లి దించాలి.
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం