telugutaruni.weebly.com
  • Home
  • వంటకాలు (Cookeries)
    • ఫలహారాలు (Tiffins)
    • శాకాహారం (Veg)
    • బియ్యపు వంటలు (Rice items)
    • మాంసాహారం (Non-Veg)
    • పచ్చళ్ళు (chutneys)
    • వడియాలు
    • పండ్ల రసాలు (Juices)
    • స్వీట్స్ (Sweets)
    • చిరుతిళ్ళు (Snacks)
    • గ్రేవీ ఐటమ్స్
    • సూప్స్ (Soops)
    • కొత్త కొత్తగా
  • చిట్కాలు (Tips)
    • వంటింటి చిట్కాలు ( Kitchen Tips)
    • ఆరోగ్య చిట్కాలు (Health Tips)
    • సౌందర్య చిట్కాలు (Beauty Tips)
  • మహిళా లోకం
    • ఆదర్శ మహిళలు
    • శభాష్ మహిళా..
  • విహారయాత్ర

వంటింటి చిట్కాలు 

11/1/2013

0 Comments

 
  • ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలు ఒకే దగ్గర నిల్వచేస్తే తొందరగా ఖరాబవుతాయి. కాబట్టి రెండింటినీ దూరంగా ఉంచితే మంచిది!
  •  ఫ్లోర్ మీద పడ్డ కోడిగుడ్డు సొన పూర్తిగా పోవాలంటే... దానిపై వెంటనే ఉప్పు చల్లి, కొన్ని నిమిషాలపాటు ఆగి, పేపర్‌టవల్(టిష్యూ పేపర్)తో తుడిచేస్తే సరి!

0 Comments

పెరుగు గుణాలు... పలువిధాలు

10/25/2013

0 Comments

 
Picture
                  పెరుగు వల్ల చాలా ఉపయోగాలున్నాయి. పెరుగు కేవలం ఆరోగ్యకరమే కాదు సౌందర్య సాధనం కూడా. రోజూ ఆహారంలో తీసుకోవడం వలన పెరుగు మన శరీరవ్యవస్థను చల్లగా ఉంచటమేకాక, జీర్ణవ్యవస్థను మెరుగు పరచడంలో తోడ్పడుతుంది. పెరుగును ఏ రూపంలో ఆహారంగా తీసుకున్నా రుచిగానే ఉంటుంది. పెరుగును అలాగే తినడం ఇష్టం లేకపోతే వివిధ రకాలుగా ఆహార పదార్థాలలో వాడుకోవచ్చు. కొద్దిగా ఉప్పు కలిపిన పెరుగన్నం రుచి మనందరికీ తెలుసు. పెరుగును అన్నంలో తినడం నచ్చని వారు కూరల్లో, స్వీట్లలో, ఎలాగైనా వాడుకోవచ్చు. ఏదో రూపంలో పెరుగును ఆహారంలో తీసుకోవడం మంచిది. ఏవిధంగా తిన్నా దాని పోషకాలు, ఉపయోగాలు మనకు అందుతాయి. ఏవిధంగా పెరుగు మనకు ఉపయుక్తమో చూడండి.

  - పెరుగు పాలతో తయారైనప్పటికీ పాల కన్నా ఎక్కువ కాల్షియం కలిగి ఉండి ఎముకలకు, పళ్ళకు బలాన్నిస్తుంది. ఎముకలను పెళుసుబారకుండా కాపాడుతుంది.

  -  కొంతమందికి పాలంటే వాసన నచ్చక తాగరు. కానీ, పాల వలన కలిగే ఉపయోగాలు పొందాలనుకుంటే పెరుగు పాలకు చక్కని ప్రత్యామ్నాయం.

  -  అజీర్ణంతో బాధపడ్తున్నా లేక కడుపులో ఇతర సమస్యలున్నా పెరుగు తింటే జీర్ణవ్యవస్థ చక్కబడుతుంది.

-  రోజూ ఒక కప్పు పెరుగు తింటే, పెరుగులో ఉన్న లాక్టిక్‌ యాసిడ్‌ చర్మాన్ని మృదువుగా చేయడం మాత్రమే కాదు, కాంతివంతంగా కూడా చేస్తుంది. పెరుగును ముఖానికి పూతలా వేసుకుంటే చర్మంపై ముడుతలు, మచ్చలు మాయం.

-  పెరుగు జుట్టుకు మంచి కండిషనర్‌గా ఉపయోగపడుతుంది. వారానికి ఒకసారి పెరుగును మాడుకు, జుట్టుకు రాసి 30 నిముషాల పాటు ఉంచితే జుట్టు మృదువుగా అవుతుంది. చుండ్రును దరి చేరనివ్వదు.

- పెరుగులో ఉండే యాంటీ ఆక్సిడెంట్‌లు, ఇంకా వివిధ ఎంజైములు శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. ఏవైనా హానికారక కెమికల్స్‌ శరీరంలోకి పొరబాటున వెళితే పెరుగు వాడకం వలన చాలా త్వరితంగా ఉపశమనం పొందవచ్చు.

-  పెరుగులో ఎటువంటి కేలరీలు, కొవ్వు పదార్థాలు, చక్కెర లేకపోవడం వలన విరివిగా ఆహారంలో వివిధ రూపాలలో తీసుకోవచ్చు.ఆకలిగా ఉన్నప్పుడు జంక్‌ఫుడ్‌కు బదులు పెరుగును తీసుకోవడం అలవాటు చేసుకోవడం మంచిది. కొలెస్ట్రాల్‌ స్థాయిని తగ్గించడానికి కూడా పెరుగు ఉపయోగపడుతుంది.

- పెరుగు వినియోగం వలన మనం తీసుకునే ఇతర ఆహారపదార్థాల నుండి పోషకాలను, మినరల్స్‌ను గ్రహించే శక్తి పెంపొందుతుంది.

-  రోగ నిరోధకశక్తిని మెరుగు పరచడంతో పాటు రక్తపోటు ముప్పునూ తగ్గిస్తుంది.

0 Comments

పోషకాలు పోకుండా..

10/20/2013

0 Comments

 
  • కొన్ని కూరగాయలు ఎన్నో పోషకాలను అందిస్తాయి. కానీ వండే విధానాన్ని బట్టి కొన్నిసార్లు వాటిని కోల్పోవాల్సి వస్తుంది. అలా జరగకూడదంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
  • క్యారెట్‌ లాంటి వాటిని ఉడికించి ముక్కలు కోయడం కన్నా.. ముందు ముక్కలు తరిగి తరవాత వేయించాలి. అప్పుడు వాటి నుంచి కెరొటినాయిడ్లనే యాంటీఆక్సిడెంట్లు విడుదల అవుతాయి. అవి క్యాన్సర్‌ కణాలను నశింపచేస్తాయి.
  • ఆకు కూరల్ని వండేప్పుడు కొద్దిగా ఆలివ్‌నూనెను వేస్తే, అవి ఉడుకుతున్నప్పుడు అవసరమైన పోషకాలు పోవు.
  • వెల్లుల్లిని తరిగి వెంటనే పోపులో వేయడం, పదార్థంలో వాడటం కాకుండా... ఐదు నిమిషాలు అలాగే ఉంచండి. కాసేపు గాలికి ఉంచడం వల్ల వాటిల్లో క్యాన్సర్‌తో పోరాడే గుణాలు పెరుగుతాయి.
  • కొందరు బంగాళాదుంపల చెక్కు తీసేసి ఉడికిస్తుంటారు. అలా కాకుండా పొట్టుతో సహా ఉడికించడం వల్ల 'సి' విటమిన్‌ స్థాయి పెరుగుతుంది. అలాగే ఉడికించేప్పుడు ఆ గిన్నెపై మూత పెట్టాలి. దానివల్ల పోషకాలు తగ్గకుండా ఉంటాయి.
0 Comments

వాటర్ ఫిల్టర్ శుభ్రతకోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

10/10/2013

0 Comments

 
Picture
వాటర్‌ ఫిల్టర్‌ శుభ్రతకోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని తెలుసుకోవాలను కుంటున్నారా... అయితే ఈ కథనం చదవండి. మురికిగా వున్న నీటిని తాగడం వలన అనేక వ్యాధులు వస్తుంటాయి. అందుకోసం వాటర్‌ ఫిల్టర్ల ఉపయోగించడం ఉత్తమం. అలాగే వాటిని శుభ్రపరచడంలో జాగ్రత్త పడుతూ ఉండాలి.

  • వాటర్‌ ఫిల్డర్‌ కొత్త క్యాండిల్‌ బిగించిన తర్వాత పిల్టర్‌ అయిన నీళ్ళు మట్టివాసన వస్తాయి. అందుచేత కొత్తక్యాండిల్‌ను బిగించబోయేముందు ఆ క్యాండిల్స్‌ నీళ్ళలో మునిగేటట్లుగా ఒకటి రెండు రోజులు నీళ్ళలో నానబెట్టి ఆ తర్వాతనే ఉపయోగించాలి.
  • వారానికి రెండుమూడుసార్లు వాటర్‌ఫిల్టర్‌ క్యాండిల్స్‌ను శుభ్రం చేయాలి. లేకపోతే క్యాండిల్స్‌ మురికావడంతో పాటు క్యాండిల్స్‌ అమర్చిన డబ్బాలో అడుగున మట్టిచారలు పేరుకుని ఫిల్టర్‌ మురికి అవుతుంది.
  • క్యాండిల్స్‌ బాగా నల్లగా అయి అవి మురికిపట్టి వున్నప్పుడు సబ్బుపొడి కలిపిన వేడినీళ్ళలో వాటిని నానబెట్టి ఆ తర్వాత మెత్తని పీచుతో తోమితే క్యాండిల్స్‌ శుభ్రపడతాయి. క్యాండిల్స్‌ను శుభ్రపరచటానికి ప్రత్యేకమైన బ్రష్‌ను ఉపయోగించడం మంచిది.

0 Comments

క్యాండిల్‌ ఎక్కువ సమయం వెలగాలంటే...

10/5/2013

0 Comments

 
  • బి-కాంప్లెక్స్‌ క్యాఫ్యూల్స్‌ను ఓపెన్‌ చేసి ఫ్లవర్‌ వాజ్‌లో వేస్తే వాజ్‌లోని పువ్వులు ఎక్కువ కాలం తాజాగా కనిపిస్తాయి.
  • నోటి పుండ్లకు మంచి మందు కొబ్బరి బోండంలోని నీరు. ప్రతీ రోజూ ఉదయమే కొబ్బరి బొండం తాగితే 15 రోజుల్లో నోటి పుండ్లు పోతాయి.
  • మామిడికాయ పప్పు చేసేటప్పుడు మామిడి ముక్కలను చిన్న చిన్న ముక్కలుగా కోసి పప్పులో వేస్తే మరింత రుచిగా ఉంటుంది.
  • నిమ్మకాయల నుండి త్వరగా రసం తీయాలంటే చల్లని నీళ్లలో ఒక అరగంట పాటు నిమ్మకాయలు వేసి ఉంచితే కాయలు మెత్తబడి రసం సులువుగా వస్తుంది.
  • వెలుల్లి, అల్లం ముద్ద చేసేటప్పుడు మిక్సీలో చెంచాడు నూనె వేస్తే బరకగా కాకుండా మెత్తగా రుబ్బుకోవచ్చు. ఎక్కవ రోజులు నిల్వ ఉంటుంది.
  • క్యాండిల్‌ ఎక్కువ సమయం వెలగాలంటే... ఒక గ్లాసులో కొవ్వొత్తిని అంటించి గ్లాసు సగం వరకు నీటిని పోసి ఉంచాలి. ఇలా చేయడం వల్ల క్యాండిల్‌ ఎక్కువ సేపు వెలుగుతుంది. కరిగిన మైనం నీటిలోనే పడుతుంది కాబట్టి సులభంగా తొలిగించవచ్చు.
  • చీమలు పుట్ట ద్వారం వద్ద సబ్బు ముద్దనూరితే చీమలు పోతాయి. నల్ల చీమలు పుట్టకు కూడా ఇదే చిట్కాను పాటించండి.
  • టమాటోలను వంటలో ఉపయోగించే ముందు 6 నిముషాల వరకూ వేడి నీటిలో ఉంచండి. ఇలా చేయడం వల్ల కూర చాలా రుచిగా ఉంటుంది.
  • జిడ్డుగా ఉండే పాత్రలు శుభ్రం చేసే ముందు ఉప్పులో ముంచిన నిమ్మచెక్కతో పాత్రపై రబ్‌ చేయాలి. తర్వాత పేపర్‌తో పాత్రను తుడవాలి. ఇలా చేయడం వల్ల జిడ్డు పోతుంది. చాలా సులభంగా పాత్ర శుభ్రం అవుతుంది.
0 Comments

వంటింటి చిట్కాలు 

9/26/2013

0 Comments

 
  • అల్లం ముక్కని ఎండబెట్టి పొడి చేసుకోవాలి.ఇందులో చిటికెడు జీలకర్ర పొడి, పంచదార కలిపి తింటే దగ్గు తగ్గుతుంది.
  • వేపుడు పని ఎక్కువగా ఉంటే నూనెలో చిటికెడు ఉప్పు వేస్తే నూనె ఎక్కువగా పీల్చదు.
  • కూరకు పులుపు తక్కువైనట్లు అనిపిస్తే మార్కెట్లో దొరికే మామిడి పొడికి కొంచెం పెరుగు కలపండి. టొమాటో రుచి వస్తుంది.
  • కోడిగుడ్లు పెంకును జాగ్రత్తా పరిశీలించండి. మంచి షైనింగ్‌ ఉంటే కోడి గుడ్లు తాజావి. పెంకు కాస్తా రంగు మారిందంటే నిల్వ కోడిగుడ్లని అర్ధం చేసుకోవాలి.
  • పెద్ద ఉల్లి పాయ, ఉప్పు కలిపి నూరి దానికి పంటికి వేసి రుద్దితే పండ్లవెంట కారే రక్తం ఆగిపోతుంది.
  • గచ్చకాయ కాల్చిన మసి, పటిక,పోక చెక్క మసి- మూడింటిని కలిపి చిగుళ్ళకి రుద్దితే చిగుళ్ళ వాపు, చీము, నెత్తురు కారటం,నోటి దుర్వాసన తగ్తుతాయి.
  • క్యారెట్‌, టమాటో కలిపి జ్యూస్‌ చేసి, తేనే కలపాలి. ఈ మిశ్రమాన్ని నీళ్లలో కలుపుకుని తాగితే రక్త శుద్ధి అవుతుంది.
  • ప్రతీరోజు నీళ్లలో తులసి అకులు వేసుకుని తాగాలి. ఇలా చేస్తే గొంతు ఇనె్‌‌ఫన్‌ తగ్గుతుంది.
  • స్వచ్ఛమైన ఇంగువ నిమ్మ రసంతో నూరి దానిని పండ్లకి వేసి రుద్దితే పండ్లవెంట కారే రక్తం ఆగిపోతుంది.
  • మిక్సీ బ్లేడు పదునుగా ఉండాలంటే మిక్సీ జార్లలో కొద్దిగా ఉప్పు వేసి తిప్పాలి.
  • పనీర్‌ ఎక్కువ కాలం తాజాగా ఉండా లంటే దానినిక బ్లాటింగ్‌ పేపర్‌లో చుట్టి ఫ్రిజ్‌లో పెట్టాలి.
    జీలకర్ర, పంచదార కలిపి నమిలితే కడుపునొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.
  • గ్లాసు నీళ్ళలో పావు టీ స్పూన్‌ ఏలకుల పొడి కలుపుకుని తాగితే యూరినరీ ఇనె్‌‌ఫన్‌ బాధ నుంచి బయట పడవచ్చు.
0 Comments

మరక పోవాలంటే..........

9/23/2013

0 Comments

 
  • వెండి కుందులు జిడ్డుగా ఉంటే.. వాటికి బేకింగ్ సోడా పేస్టు రాసి గంటసేపు అలాగే ఉంచాలి. ఆ తర్వాత వేడి నీటితో శుభ్రం చేస్తే జిడ్డు తేలిగ్గా వదులుతుంది.
  • దుస్తుల మీద నూనె పడితే ఆ ప్రాంతంలో బియ్యంపిండి చల్లి ఉతికితే మరకలు సులువుగా వదులుతాయి.

0 Comments

కోడిగుడ్లను ఉడికించే నీళ్ళలో...

9/22/2013

0 Comments

 
  • పప్పు ఉడికిన తరువాతనే ఉప్పు వేయండి. మొదటే వేస్తే పప్పు ఉడకడానికి ఎక్కువ సమయం పడుతుంది.
  • పచ్చిమిరపకాయలను పిన్నీసుతో ఐదు రంద్రాలను చేసిన అనంతరం వేయిస్తే పగిలి గింజలు మీద పడవు.
  • బొబ్బట్లు విరిగిపోతుంటే మైదాపిండిలో కాస్త గోధుమ రవ్వ కలపాలి.
  • గులాబ్‌ జామున్స్‌ తయారుచేసేటప్పుడు కోవాలో అరకప్పు తాజా పనీర్‌ గనక కలిపితే రుచి రెట్టింపవుతుంది.
  • కాఫీ డికార్షన్‌ బాగా చిక్కగా స్ట్రాంగ్‌గా ఉండాలంటే డికార్షన్‌లో.. వేయించిన పంచడార కలపాలి.
  • కాఫీ డికార్షన్‌ వేడిగా ఉండాలంటే దానిలో కొద్దిగా పంచదార వేయండి.
    కుక్కర్‌ గాస్కెట్‌ ఉపయోగించిన వెంటనే ఐస్‌ వాటర్‌లో ముంచితే ఎక్కువ రోజులు మన్నుతుంది.
  • కేక్‌ చేసేటప్పుడు ఫ్రీజ్‌లోంచి తీసిన వెంటనే గుడ్లను ఉపయోగించరాదు. కొంచెం సేపు బయట ఉంచకపోతే కేక్‌ మెత్తదనం లోపిస్తుంది.
  • జామ్‌ తయారికి ఉపయోగించే పండ్లకు ఒక టీస్పూన్‌ గ్లిజరిన్‌ కలిపితే 100 గ్రాములు చక్కెర ఆదా అవుతుంది.
  • గ్రుడ్డు సోనకి ఒక టీస్పూన్‌ మైదా పిండి కలిపితే ఆమ్లెట్‌ పెద్దగా పొంగినట్లుగా వచ్చి చాలాసేపు అలాగే ఉంటుంది.
  • కోడిగుడ్డు సోనాకు చిటికెడు కుంకుమ పువ్వు కలిపి ఆమ్లెట్‌ వేసి చూడండి. రుచి, రంగుతో పాటు ఆరోగ్యానికి కూడా మంచిదే.
  • కోడిగుడ్లను ఉడిించే నీళ్ళలో కాస్త ఉప్పు వేసినా ఉడికించి వెంటనే గ్రుడ్లను చన్నీళ్ళలో వేసినా పెంకు సులభంగా ఊడివస్తుంది.
0 Comments

గుడ్డు పెంకులతో భలే చిట్కాలు!

9/13/2013

0 Comments

 
               కోడిగుడ్డు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతాకాదు. అలానే గుడ్డు పెంకులు కూడా కొన్ని అవసరాలకు పనికొస్తాయి. చీమలూ బొద్దింకలూ బాగా తిరిగే చోట గుడ్డు పెంకులను ఉంచితే, వాటి బెడద తగ్గుతుంది.

  • వర్షాకాలంలో కొత్త మొక్కలను పెంచుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటాం. ఇలాంటప్పుడు ఈ పెంకులను పొడిచేసి మట్టిలో కలుపుకుంటే, మొక్కల ఎదుగుదలకు మంచి పోషకంగా పనికొస్తుంది.
  • వీటిల్లో మట్టి నింపి ధనియాలూ, ఆవాల గింజలు వేస్తే చిన్న మొక్కలు వస్తాయి. వీటిని గుడ్లు పెట్టుకొనే అట్టలో పెట్టి బాల్కనీలో ఉంచితే చూడ్డానికి బాగుంటుంది.
  • ఇంట్లో పండ్లూ, కూరగాయలూ ఉంచినప్పుడు వాటి చుట్టూ పెంకుల పొడిని చల్లితే పురుగులూ, ఈగలూ రావు. గుమ్మం ముందున్న మొక్కలపై వీటిని చల్లితే చీడపీడలు పట్టవు.
  • వంటింటి గట్టుపై నూనె, పదార్థాలు తాలూకు మరకలు పడితే వెనిగర్‌లో పెంకుల పొడి కలిపి అక్కడ రాయాలి. కొద్దిసేపయ్యాక కొబ్బరి పీచుతో రుద్దితే మరకలు వదిలిపోతాయి.

0 Comments

కిచెన్ కార్నర్

9/5/2013

0 Comments

 
Picture
  • * సలాడ్‌ని ఉంచే గిన్నె లేదా ట్రేని చిల్లర్‌లో కాసేపు ఉంచి అందులో సలాడ్ ముక్కలు పెడితే సలాడ్ ఎక్కువసేపు తాజాగా ఉంటుంది.
  • *మష్రూమ్ (పుట్టగొడుగులు) లని ప్లాస్టిక్ బ్యాగ్‌లో కాకుండా పేపర్ బ్యాగుల్లో చుట్టిపెడితే ఎక్కువకాలం తాజాగా ఉంటాయి.
  • *మొక్కజొన్నపొత్తుని ఉడికించే నీళ్లలో చిటికెడు పంచదార వేసి ఉడికిస్తే రుచిగా ఉంటుంది.
  • *మాంసం ముక్కల్లో క్యారెట్ వేసి ఉడికిస్తే కొవ్వుని క్యారెట్ పీల్చుకుంటుంది. ఉడికిన క్యారెట్‌ను బయటకు తీసి మిగతా కాయగూరలతో కలిపి సూప్ కూడా చేసుకోవచ్చు.
  • *పిండిని పూరీల్లా చేశాక వాటిని ఫ్రిజ్‌లో పదినిమిషాలు ఉంచాలి. ఆ తరువాత వేగిస్తే పూరీలు తక్కువ నూనె పీల్చుకుంటాయి. కరకరలాడతాయి.
  • * రాజ్మా, మినపప్పుల్ని ఉప్పు వేయకుండా ఉడికించాలి.
  • *వేపుళ్లకు వాడిన నూనె నల్లగా అయితే అందులో ఒక టీస్పూన్ తెలుపు వెనిగర్ వేసి మూత పెట్టి సన్నటి మంట మీద వేడిచేయాలి. చిటపటమనడం ఆగిపోయాక వడపోస్తే ఆ నూనె మళ్లీ వాడేందుకు పనికొస్తుంది.
  • *ఉల్లిపాయ ముక్కల్ని నూనె వేయకుండా వేగిస్తే వాటి చెమ్మ పోతుంది. ఆ తరువాత కొద్దిగా నూనె వేసి వేగించుకుంటే తక్కువ నూనె పడుతుంది. ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి.


0 Comments
<<Previous

    Author

    నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ  మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో  ఒక  తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం. 

    Categories

    All
    ఆకు కూరలు
    రవ్వ
    నూనె
    ఉసిరి
    అల్లం
    వెండి సామాగ్రి
    బట్టలు
    మజ్జిగ
    పెరుగు గుణాలు... పలువిధాలు
    కిచెన్ కార్నర్
    గుడ్డు పెంకులతో భలే చిట్కాలు!
    అరటికాయ
    ఆమ్లెట్
    కొబ్బరి
    పోషకాలు పోకుండా..
    ప్లాస్క్
    నిమ్మకాయ
    క్యాబేజీ
    చిట్కాలు పాటిస్తే వంట సులువే..!
    క్యాండిల్‌ ఎక్కువ సమయం వెలగాలంటే...
    కోడిగుడ్లను ఉడికించే నీళ్ళలో...
    వాటర్ ఫిల్టర్ శుభ్రతకోసం ఎలాంటి జాగ్రత్త

    Archives

    November 2013
    October 2013
    September 2013
    August 2013
    May 2013

    RSS Feed

    Enter your email address:

    Delivered by FeedBurner


Powered by Create your own unique website with customizable templates.