telugutaruni.weebly.com
  • Home
  • వంటకాలు (Cookeries)
    • ఫలహారాలు (Tiffins)
    • శాకాహారం (Veg)
    • బియ్యపు వంటలు (Rice items)
    • మాంసాహారం (Non-Veg)
    • పచ్చళ్ళు (chutneys)
    • వడియాలు
    • పండ్ల రసాలు (Juices)
    • స్వీట్స్ (Sweets)
    • చిరుతిళ్ళు (Snacks)
    • గ్రేవీ ఐటమ్స్
    • సూప్స్ (Soops)
    • కొత్త కొత్తగా
  • చిట్కాలు (Tips)
    • వంటింటి చిట్కాలు ( Kitchen Tips)
    • ఆరోగ్య చిట్కాలు (Health Tips)
    • సౌందర్య చిట్కాలు (Beauty Tips)
  • మహిళా లోకం
    • ఆదర్శ మహిళలు
    • శభాష్ మహిళా..
  • విహారయాత్ర

పోషకాహారంతోనే శిశువు ఆరోగ్యం

5/30/2014

0 Comments

 
Picture
                  గర్భిణిగా ఉన్నప్పుడు ఇద్దరికి సరిపోయే ఆహారాన్ని తీసుకోవాలి కాబట్టి ఆకలి అధికంగానే ఉంటుంది. అయితే గర్భంలోని శిశువు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆహారపదార్థాలు తీసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. కొన్ని రకాల ఆహారపదార్థాల  ప్రభావం తల్లిమీదకంటే గర్భస్థ శిశువు మీదనే అధికంగా ఉంటుందంటున్నారు గైనకాలజిస్టులు. ఈ సమయంలో ఎలాంటి ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలో కొన్ని వివరాలు చెబుతున్నారు. అవి...


- సరిగా ఉడకని, సగం ఉడికిన మాంసాహారం మంచిదికాదు. ఇలాంటి ఆహారపదార్థంలో ఉండే క్రిములు తల్లిమీద కంటే కడుపులోని శిశువుమీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి.

- చేపలు, రొయ్యలులాంటి జలచర ఆహారానికీ దూరంగా ఉండాలి.

- సరిగా కడగని లేదా అసలు కడగని పండ్లు తినకూడదు. పచ్చికూరగాయలకూ దూరంగానే ఉండండి. లేకపోతే వీటిమీద ఉండే పురుగుల మందుల అవశేషాలు కడుపులోని లేతప్రాణం మీద విపరీత ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది.

- సరిగా కడగని, ఉడికించని ఆహార పదార్థాలమీద ఉండే పురుగుగుడ్లు ఇన్ఫెక్షన్లకు, రక్తలేమికి దారితీస్తాయి.

- అలాగే సరిగా మూతపెట్టని, నిలువ ఆహార పదార్థాలను తీసుకోకపోవడమే ఉత్తమం. పండ్లరసాలను కూడా వీలయినంత వరకు ఎప్పటికప్పుడు తాజాగా ఇంట్లో చేసుకుని తాగాలి. తయారుచేసిన తరువాత ఎంత తొందరగా వీలయితే అంత తొందరగా తాగడం ఉత్తమం.

- పండ్లు రసం తీసుకుని తాగడం కంటే పండుగానే తినడం వల్ల  దాంట్లో ఉండే ఫైబర్‌ జీర్ణక్రియ ఇతర జీవక్రియలు సక్రమంగా జరగడానికి దోహదపడుతుంది. 

- పాలుకానీ, జున్నుకానీ ఎక్కువసేపు మరి గించిన తరువాతే తీసుకోవాలి. సరిగా మరిగించని పాలు, జున్నుల్లో ఉండే బ్యాక్టీరియా వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.

- తాగేనీటి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. స్వచ్చ మైన నీటిని తీసుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి.

0 Comments



Leave a Reply.

    Author

    నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ  మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో  ఒక  తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం.

    Archives

    May 2014
    January 2014
    December 2013
    November 2013
    October 2013
    September 2013
    July 2013
    June 2013

    Categories

    All
    'నోబెల్' ఇంట్లో ఆమెకు గుర్తింపేదీ?
    టెన్ కమాండ్‌మెంట్స్
    మామిడి వనం.. మహిళకు వరం!
    అస్త్ర తంత్ర : కాన్ఫిడెన్సే మీ బాడీగార్డ్
    నెలసరి నొప్పి తగ్గేదెలా?
    కాబోయే తల్లులూ... మందుల విషయంలో జర భద్రం!
    పోషకాహార లోపం.. పడతులకు శాపం
    కోర్కెలు శూన్యం.. బతుకంతా దైన్యం
    మొదలైందా నెలసరి...ఈ ఆహారం సరి..!
    అల్లుకునే బంధాలకు బతుకమ్మ
    ఆడశిశువుకు ఆహ్వాన గీతిక..!
    పెనవేసుకొనే పేగు బంధం
    అత్తారింట్లో నవవధువు అలవాటుపడేదెలా?
    పోషకాహారంతోనే శిశువు ఆరోగ్యం
    పెళ్లిళ్లెందుకు పెటాకులు..?
    పెళ్లిళ్లెందుకు పెటాకులు..?
    తల్లులు విటమిన్ డి తీసుకొంటే.. పిల్లలు బాడ
    ఆసక్తి ఉంటే అతివకు ‘షేర్ మార్కెట్’ సులభమĺ

    RSS Feed


Powered by Create your own unique website with customizable templates.