బోన్లెస్ చికెన్ - 200 గ్రాములు,
అల్లం ముక్కలు - ఒక స్పూన్,
ఉల్లిపాయ ముక్కలు - రెండు టేబుల్ స్పూన్స్,
మెంతి ఆకు (తరిగి) - ఒక టేబుల్ స్పూన్,
కొత్తిమీర తరుగు - రెండు టేబుల్ స్పూన్స్,
పచ్చి మిర్చి తరుగు - ఒక టీస్పూన్,
లవంగాలు - రెండు (దంచి),
కారం, మసాలా - ఒక్కోటి అర స్పూన్,
ఉప్పు - తగినంత.
తయారుచేసే పద్ధతి :
ముందుగా చికెన్ ముక్కల్ని మిక్సీలో వేసి కైమాలా చేసుకోవాలి. తరువాత ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న అల్లం, ఉల్లి, పచ్చిమిర్చిల మిశ్రమాన్ని కైమాకు దట్టించి బాగా కలపాలి. ఈ ముద్దను చిన్న చిన్న ఉండలుగా చేసి ఆవిరిపై ఉడికించాలి. ఉడికిన తరువాత ఆ బాల్స్ పైన సూప్ వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి.