హైబి.పి తగ్గాలంటే.. రొజూ ఒక వెల్లుల్లి రెబ్బను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మింగేసి ఒక గ్లాస్ నీళ్ళు తాగాలి. ఇలా చేస్తే హైబి,పి తొందరగా కంట్రోల్ అవుతుంది.
0 Comments
ఆర్థ్రయుటిక్ నొప్పుల నుండి ఉపశమనం కోసం.. ఒక టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ లో ఒక కప్పు నీటిని కలుపుకొని రోజుకి రెండు సార్లు చొప్పున నెల రోజులపాటు త్రాగాలి.
కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు.. ఒక వెల్లుల్లి రెబ్బను తీసుకొని చిన్నముక్కలుగా కోసుకొని మింగేసి ఒక గ్లాస్ నీళ్ళు త్రాగాలి. ఇలా ప్రతి రోజూ చెయ్యాలి.
పులిపుర్లు తొలగిపోవాలంటే..
ఒక యాస్ప్రిన్ టాబ్లెట్ తీసుకొని పొడి చెయ్యాలి. ఒక వెల్లుల్లి రెబ్బ తీసుకొని చితగొట్టాలి. ఈ రెంటినీ కలిపి పులిపిరి ఉన్నచోట అప్లయ్ చేసి బ్యాండేజ్ వెయ్యండి. ఇలా కొన్ని రోజుల పాటు ప్రతిరోజూ చేస్తుంటే త్వరలోనే పులిపిరి నల్లగా మారి క్రమంగా తొలగిపోతుంది. ఒక చెంచా పసుపు, ఒక చెంచా మినపప్పు కలిపి ఒక చెంచాలో వేసి కొవ్వోత్తిపై బాగా వేడి చేయండి. అప్పుడొచ్చే పొగని ముక్కుతో లోపలికి పీల్చండి. ఎక్కిళ్ళు తగ్గుతాయి.
అధికంగా తినడంవల్లో లేదా ఆలస్యంగా తినడంవల్లో కడుపు బరువుగా ఉంటే గ్లాస్ గోరువెచ్చని నీళ్ళలో పావుచెమ్చ సైంధవ లవణం, అరచెంచ మామూలు ఉప్పు, సగం నిమ్మకాయ రసం కలిపి తాగండి.
తరచూ కడుపు ఉబ్బరంగా ఉంటే 2 చిటికెల ఇంగువని నేతిలో వేయించి 4 చిటికెల ఉప్పు, 6 చిటికెల వాము కలిపి, గోరు వెచ్చని తీసుకుంటే తగ్గుతుంది.
జలుబుతో ముక్కు, ఛాతి పట్టేసినట్లుంటే..
రెండు కప్పుల నీటిలో తొక్క తీసి సన్నగా తురిమిన అల్లం వేసి పది నిమిషాల సేపు నాననివ్వాలి. అల్లం సారం నీటిలోకి ఊరిన తర్వాత వడపోసి అందులో కొద్దిగా మిరియాలపొడి కలిపి తాగాలి. వేడిగా లేదా వెంటనే తాగాలనిపిస్తే నీటిలో అల్లం వేసి ఒక నిమిషం వేడి చేయవచ్చు. సెగ గడ్డలతో బాధపడేవారు..
మునగాకును మెత్తగా నూరి, నువ్వుల నూనెతో కలిపి గడ్డల మీద పూయాలి. రొజూ ఇలా చేస్తా గడ్డలు తగ్గిపోతాయి. క్యాబేజీలోని పీచుకి కొలెస్ట్రాల్ ని అదుపుచేసే శక్తి ఉంటుంది. విటమిన్ 'c ' నీ పుష్కలంగా అందిస్తూ, శరీరం హానికారక ఫ్రీరాడికల్స్ బారిన పడకుండా కాపాడుతుంది.
|