- కొన్ని ఎర్ర గులాబీ రేకల్ని పాలతో తడుపుకొంటూ ముద్దగా నూరుకోవాలి. దానికి చెంచా తేనె, కొంచెం మీగడ కలిపి రాత్రి పడుకునే ముందు పెదాలకు రాసుకోవాలి. ఉదయాన్నే చన్నీటితో కడిగి, బాదం నూనె రాసుకుంటే పెదాలు పొడిబారడం తగ్గుతుంది.
- వెన్న, తేనె సమానంగా తీసుకొని, వాటికి రెండు చుక్కల నిమ్మరసం కలుపుకొని పెదవులపై మృదువుగా మర్దన చేయాలి. ఇలా తరచూ చేస్తే ఫలితం ఉంటుంది.
- బీట్రూట్ గుజ్జులో కొంచెం కొత్తిమీర రసం, కొంచెం పాలమీగడ, చెంచా తేనె కలిపి పెదాలకు రాసుకోవాలి. పదినిమిషాల తరవాత చన్నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారంలో మూడునాలుగు సార్లు చేస్తే పెదాలు లేత గులాబీ రంగులోకి వస్తాయి.
- నిమ్మరసంలో కొద్దిగా తేనె, గ్లిజరిన్ కలుపుకొని రోజూ రాత్రిపూట రాసుకొంటే క్రమంగా నలుపు తగ్గుతుంది. వెన్నకు కాస్త తేనె కలుపుకొని రాసుకొన్నా ఫలితం ఉంటుంది.