- -పొడి బారిన పెదవులపై కొబ్బరి, బాదం నూనెల్ని సమపాళ్లలో కలిపి రాసుకోవాలి.
- - కొంచెం పెరుగు తీసుకుని అందులో ఓ రెండు కుంకుమపువ్వు రెబ్బలు కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు మూడుసార్లు రాసుకుంటే పెదవులకి మంచి రంగు వస్తుంది.
- -నల్లగా ఉన్న పెదాలకు నిమ్మరసం లేదా గ్లిజరిన్ రాస్తే పెదవులు ఎర్రగా తయారవుతాయి.
- - టాల్కమ్ పౌడర్ రాసుకుని లిప్‌స్టిక్ వేసుకుంటే ఎక్కువ సేపు నిలుస్తుంది.
- -వారానికి ఒకసారి టూత్ బ్రష్‌తో పెదవులపై రుద్దితే మృతచర్మం తొలగిపోతుంది.
- - గులాబీరేకుల రసాన్ని రోజూ రాత్రిపూట పెదవులకి రాసుకుంటే నలుపురంగు విరుగుతుంది.
- - ప్రతిరోజూ స్నానం చేసే ముందు మీగడ రాసుకుంటే పెదవులు మెరుస్తుంటాయి.
- -బీట్‌రూట్ రసాన్ని రోజు విడిచి రోజు రాసుకుంటే కూడా మంచి ఫలితం ఉంటుంది.
0 Comments
1. ముఖాన్ని రసాయనకాలు తయారుచేసిన సబ్బుతో రుద్దుకునేకంటే మెత్తని సెనగ పిండితో రుద్దుకోవడం వల్ల ముఖ చర్మం మృదువుగాను, కాంతిగానూ ఉంటుంది.
2. బీట్‌రూట్ రసాన్ని ముఖానికి రాసుకుని అరగంట తర్వాత ముఖాన్ని కడుక్కుంటే ముఖవర్చస్సు పెరుగుతుంది. 3. సెనగపిండిలో కీరా దోసకాయ రసాన్ని కానీ, కారెట్ రసాన్ని కానీ కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి పట్టించి ఓ గంట తర్వాత ముఖాన్ని పరిశుభ్రమయిన నీటితో కడిగితే ముఖ చర్మపు కాంతి పెరుగుతుంది. 4. గులాబీ రెక్కల పేస్టును ముఖానికి పట్టించి, అరగంట తర్వాత ముఖాన్ని కడిగితే ముఖం ఎంతో మృదువు గానూ, ఆకర్షణీయంగానూ కనిపిస్తుంది. 5. గ్లిజరిన్‌లో నిమ్మరసం, టమాటోరసం కలిపి ముఖానికి రాసుకుంటే ముఖ సౌందర్యం పెరుగుతుంది. 6. పాలల్లో దూదిని తడిపి, దూదిలో తేమ ఆరిపోయేంత వరకు ఆ దూదిని కళ్ళమీద ఉంచుకుంటే కళ్ళు కాంతితో మెరుస్తూంటాయి. 7. తాజా పండ్లు, పాలు ముఖచర్మపు సోయగాన్ని, ఆకర్షణనూ పెంచుతాయి. 8. ఎండిన కమలాఫలం తొక్కలను మెత్తని పొడిచేసి, ఆ పొడిలో పసుపు, సెనగపిండి కలిపి అందులో రోజ్‌వాటర్ పోసి మెత్తని పేస్ట్‌చేసి ముఖానికి ఆ పేస్ట్‌ను పట్టించాలి. కొంతసేపయిన తర్వాత ముఖం కడుక్కుంటే ముఖం లేతగానూ, అందంగానూ, మృదువుగానూ, కాంతిగానూ, ఆకర్షణీయంగానూ కనిపిస్తుంది. 9. జిడ్డు చర్మం ఉన్నవారు ముఖ సౌందర్యం విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ముఖానికి జిడ్డు లేకుండా ఉండటా నికి గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరచాలి. సబ్బుకు బదులు మెత్తని సున్నిపిండిని వాడాలి. బయట నుంచి రాగానే గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరచాలి. 10. కళ్ళు చికిలిస్తూ చూడటం, ముఖం చిట్లించడం, కోపంతో పళ్ళు కొరకడం లాంటివి ముఖ సౌందర్యానికి అవరోధం కలిగిస్తాయి. ముఖ చర్మానికి ముడతలు ఏర్పడుతాయి. అటువంటి చర్యలవల్ల, అటువంటి అలవాట్లను మానుకోవాలి.అందంగా ఆకర్షణీయంగా కనిపించ టానికి ముఖ సౌందర్యం ఎంతగానో తోడ్పడు తుందని తెలుసుకోవాలి. 11. బాదం నూనెలో శనగపిండి, నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేసి, ఆరిన తరువాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు మచ్చలు పోవడమే కాదు, ముఖం మృదువుగా కనిపిస్తుంది. కొందరి పెదవులు నల్లగా కాంతివిహీనంగా కనిపిస్తే, మరికొందరివి తరచూ పగిలిపోవడం పెద్ద సమస్య. ఇలాంటివేం లేకుండా అందమైన పెదాలు సొంతం అవ్వాలంటే ఇలా చేసి చూడండి.
కొబ్బరి నూనె, తేనె కలిపి పెదవులపై రాసి, మర్దన చేయాలి. రోజులో కొన్ని సార్లు చేస్తూ ఉంటే పెదవులు పొడిబారడం, పగుళ్ళ సమస్యలు తగ్గి మృదువుగా అవుతాయి.
పెదవులు నల్లగా ఉంటే..
కొద్దిగా వెన్న తీసుకొని రెండు గ్లిజరిన్ చుక్కలు వేసి కలిపి రాయాలి. ఇలా వారానికి మూడు లేక నాలుగు సార్లు రాస్తుంటే క్రమంగా నలుపు వదిలి పెదవులు ఆకర్షణీయంగా మారుతాయి. టీ బ్యాగ్ లను బాగా మరిగించిన నీళ్ళలో వేసి కాసేపయ్యాక పెదాల మీద ఉంచాలి. ఇలా చేస్తే పగుళ్ళు పోతాయి.
గోరువెచ్చని నెయ్యిలో దూదిని ఉండగా చేసి వేయాలి. కొద్ది సేపయ్యాక తీసి పెదాలపై ఇరవై నిమిషాలపాటు బాగా రాయాలి. దీనివల్ల తేమ అంది పెదాలు మృదువుగా మారతాయి.
చలి కాలంలో పెదాలు పగిలి ఇబ్బంది పడకుండా ఉండాలంటే కొద్దిగా క్యారెట్ రసం తీసుకొని దానికి తేనె కలిపి రాసుకుంటే సరిపోతుంది. కాసేపటి తర్వాత కడిగేసుకోవాలి. తేమ అంది ఆరోగ్యంగా పెదాలు కనిపిస్తాయి.
మాయిశ్చరైసర్ లో కొద్దిగా చక్కెర వేసి పెదవులకు రాసి మర్దన చేయాలి. మృతచర్మం పోయి పెదవులు అందంగా, గులబీరంగులో కన్పిస్తాయి.
|