- చల్లారిన ఒక కప్పు టీనీళ్లలో రెండు స్పూన్ల బియ్యప్పిండి, తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. బియ్యప్పిండి మంచి స్క్రబ్‌లా పనిచేస్తుంది. తేనె చర్మానికి తేమనిస్తుంది. ఈ రెండింటినీ కలిపి వాడడం వల్ల చర్మానికి కండిషనర్ దొరికినట్టే.
- ఒక టేబుల్‌స్పూన్ ఉడికించిన ఓట్స్‌ని మెత్తగా చేసి రాసుకుంటే చర్మం మంట తగ్గుతుంది. ఇందులోనే ఒక టేబుల్‌స్పూన్ నిమ్మరసం కలిపి రాసుకుంటే నిర్జీవంగా ఉన్న చర్మం కాంతివంతమవుతుంది. సున్నితమైన చర్మం గలవాళ్లు నిమ్మరసంలో కొన్ని నీళ్లు కలిపి గాఢతను తగ్గించి వాడాలి.
- శెనగపిండి, పసుపు, పెరుగు ఈ మూడింటినీ కలిపి రాసుకుంటే చర్మంపై ఉండే టాన్ పోతుంది. పసుపు నల్లటి మచ్చల్ని, మచ్చల్ని పోగొడుతుంది.
- ఎక్కువ టాన్ ఉంటే పెరుగు బాగా పనిచేస్తుంది. దీనివల్ల చర్మానికి ఎటువంటి హాని కలగదు.
0 Comments
|