బంగాళాదుంపని మెత్తగా ఉడకబెట్టి పొట్టు తీయకుండా మెదుపుకోవాలి. దీంట్లో పాలు, కొబ్బరి నూనె జత చేసి పేస్ట్ లా కలపాలి. మెడపై ఈ మిశ్రమాన్ని అప్లై చేసి, 20 నిమిషాల తరవాత కడిగేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే మెడ మీద నలుపు తగ్గి చర్మం కాంతివంతం అవుతుంది.
0 Comments
మూడు టీస్పూన్ల దోసరసం, రెండు టీస్పూన్ల అలొవెరా జెల్, టీస్పూన్ పెరుగు కలిపి ముఖానికి, మెడకి పట్టించి, పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఎండ వల్ల కందిపోయిన, రసాయనాల వల్ల ర్యాష్ ఏర్పడిన చర్మానికి ఈ ప్యాక్ సహజమైన సౌందర్యలేపనంలా పనిచేస్తుంది.
టేబుల్ స్పూన్ తేనె, గుడ్డులోని తెల్లసొన కలిపి ముఖానికి ప్యాక్ లా వేయాలి. పది నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. జిడ్డును తొలగించి, ముఖాన్ని కాంతివంతముగా మారుస్తుంది ఈ ప్యాక్..
గుప్పెడు వేపాకులను ఎండబెట్టి పొడి చేసుకోవాలి. అందులో చిటికెడు పసుపు, తగినన్ని రోజ్ వాటర్ కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. దానిని ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. అప్పుడప్పుడు ఇలా చేస్తుంటే ముఖచర్మం అందంగా, ఆరోగ్యంగా తయారవుతుంది.
పుచ్చకాయ గుజ్జు ముఖానికి రాసి, పది నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. నిస్సేజంగా మారిన చర్మానికి పోషణ లభించి కాంతివంతమవుతుంది.
టీస్పూన్ బాదం పప్పుపొడి, అర టీస్పూన్ గంధం పొడి, అర టీస్పూన్ బంగాళాదుంప తరుగు, పది చుక్కల నిమ్మరసం కలిపి కళ్ళ కింద వలయాలున్న చోటే రాయాలి. పది నిముషాలు విశ్రాంతి తీసుకొని శుభ్రపరుచుకోవాలి. రోజు విడిచి రోజు ఇలా చేయడం వల్ల నల్లని వలయాలు తగ్గుతాయి.
రెండు టేబుల్ స్పూన్ల గంధం పొడిలో టేబుల్ స్పూన్ ఓట్స్, కొన్ని పాలు, రోజ్ వాటర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి స్క్రబ్ చేసుకోవాలి. ఆరిన తర్వాత శుభ్రపరచుకోవాలి. మచ్చలు తగ్గి, చర్మం కాంతివంతముగా అవుతుంది.
రెండు టేబుల్ స్పూన్ల టొమాటో జ్యూస్, 50 గ్రా. ల ఓట్స్, 25 గ్రా. ల పెరుగులో కప్పుడు నీళ్ళు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రపరచుకోవాలి. బ్లాక్ హెడ్స్, మొటిమలు తగ్గి చర్మం మృదువుగా కాంతివంతముగా కనిపిస్తుంది.
రెండు టీస్పూన్ల క్యారెట్ తురుము, టీస్పూన్ తేనె కలపాలి. ఈ మిశ్రమానికి రెండు చుక్కల ఎసేన్షియల్ ఆయిల్ చేర్చి దీనితో ముఖాన్ని మృదువుగా రబ్ చేసి, పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. లా చేయడం వల్ల చర్మానికి జీవకాంతి లభిస్తుంది.
పాలకూర, బచ్చలి, తోటకూర వంటి ఆకుకూరలు, చిక్కుళ్ళు, జీడిపప్పు, బాదం, అవిసె వంటి గింజ ధాన్యాలు , పాలు, పెరుగు, తక్కువ కొవ్వు కలిగిన ఇతర పాల ఉత్పత్తులు తరచు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల కురులు ఏపుగా పెరిగి, ఆరోగ్యంగా నిగనిగలాడతాయి.
|