అలాగే స్నానానికి ముందు నిమ్మరసంలో కాసింత పసుపును కలిపి ముఖానికి రాసుకుంటే మొటిమలు, నల్లటి మచ్చలకు చెక్ పెట్టవచ్చునని బ్యూటీషన్లు అంటున్నారు. అలాగే రోజా పువ్వులు చందనాన్ని పేస్ట్ చేసి ముఖానికి రాసుకుని అరగంట తర్వాత కడిగేస్తే కొన్ని వారాల్లో ముఖంలో నల్లని మచ్చలు, కంటి కిందటి వలయాలు కనుమరుగమైపోతాయి.అలాగే కేశ సంరక్షణకు సెంబరుత్తి పువ్వు రసం, నువ్వుల నూనెను సమపాళ్లలో వేడిచేసి ఆ నూనెను రాసుకోవాలి. ఇంకా టెంకాయ నూనెలో వేప పువ్వు వేసి వేడి చేసి ఆ నూనెను జుట్టుకు పట్టిస్తే చుండ్రుకు చెక్ పెట్టవచ్చు. జుట్టు ఇంకా దట్టంగా పెరుగుతాయి
మీ చర్మం మృదువుగా ఉండాలంటే ఏం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటిస్తే సరి. రోజు రాత్ర నిద్రకు ఉపక్రమించేందుకు ముందు పాల మీగడను ముఖానికి రాసుకుని తెల్లవారుజామున చల్లని నీటితో కడిగిస్తే మీ చర్మం మిలమిల మెరిసిపోతుంది.
అలాగే స్నానానికి ముందు నిమ్మరసంలో కాసింత పసుపును కలిపి ముఖానికి రాసుకుంటే మొటిమలు, నల్లటి మచ్చలకు చెక్ పెట్టవచ్చునని బ్యూటీషన్లు అంటున్నారు. అలాగే రోజా పువ్వులు చందనాన్ని పేస్ట్ చేసి ముఖానికి రాసుకుని అరగంట తర్వాత కడిగేస్తే కొన్ని వారాల్లో ముఖంలో నల్లని మచ్చలు, కంటి కిందటి వలయాలు కనుమరుగమైపోతాయి.అలాగే కేశ సంరక్షణకు సెంబరుత్తి పువ్వు రసం, నువ్వుల నూనెను సమపాళ్లలో వేడిచేసి ఆ నూనెను రాసుకోవాలి. ఇంకా టెంకాయ నూనెలో వేప పువ్వు వేసి వేడి చేసి ఆ నూనెను జుట్టుకు పట్టిస్తే చుండ్రుకు చెక్ పెట్టవచ్చు. జుట్టు ఇంకా దట్టంగా పెరుగుతాయి
0 Comments
శరీరం మృదువుగా ఉండాలంటే మంచి బాడీలోషన్ రాసుకోవాల్సిందే. అలాగని ఎంతో ఖర్చుపెట్టి వాటిని కొనాల్సిన పనిలేదు. ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు.అదెలాగో తెలుసుకుందాం.
1. ముఖాన్ని రసాయనకాలు తయారుచేసిన సబ్బుతో రుద్దుకునేకంటే మెత్తని సెనగ పిండితో రుద్దుకోవడం వల్ల ముఖ చర్మం మృదువుగాను, కాంతిగానూ ఉంటుంది.
2. బీట్‌రూట్ రసాన్ని ముఖానికి రాసుకుని అరగంట తర్వాత ముఖాన్ని కడుక్కుంటే ముఖవర్చస్సు పెరుగుతుంది. 3. సెనగపిండిలో కీరా దోసకాయ రసాన్ని కానీ, కారెట్ రసాన్ని కానీ కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి పట్టించి ఓ గంట తర్వాత ముఖాన్ని పరిశుభ్రమయిన నీటితో కడిగితే ముఖ చర్మపు కాంతి పెరుగుతుంది. 4. గులాబీ రెక్కల పేస్టును ముఖానికి పట్టించి, అరగంట తర్వాత ముఖాన్ని కడిగితే ముఖం ఎంతో మృదువు గానూ, ఆకర్షణీయంగానూ కనిపిస్తుంది. 5. గ్లిజరిన్‌లో నిమ్మరసం, టమాటోరసం కలిపి ముఖానికి రాసుకుంటే ముఖ సౌందర్యం పెరుగుతుంది. 6. పాలల్లో దూదిని తడిపి, దూదిలో తేమ ఆరిపోయేంత వరకు ఆ దూదిని కళ్ళమీద ఉంచుకుంటే కళ్ళు కాంతితో మెరుస్తూంటాయి. 7. తాజా పండ్లు, పాలు ముఖచర్మపు సోయగాన్ని, ఆకర్షణనూ పెంచుతాయి. 8. ఎండిన కమలాఫలం తొక్కలను మెత్తని పొడిచేసి, ఆ పొడిలో పసుపు, సెనగపిండి కలిపి అందులో రోజ్‌వాటర్ పోసి మెత్తని పేస్ట్‌చేసి ముఖానికి ఆ పేస్ట్‌ను పట్టించాలి. కొంతసేపయిన తర్వాత ముఖం కడుక్కుంటే ముఖం లేతగానూ, అందంగానూ, మృదువుగానూ, కాంతిగానూ, ఆకర్షణీయంగానూ కనిపిస్తుంది. 9. జిడ్డు చర్మం ఉన్నవారు ముఖ సౌందర్యం విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ముఖానికి జిడ్డు లేకుండా ఉండటా నికి గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరచాలి. సబ్బుకు బదులు మెత్తని సున్నిపిండిని వాడాలి. బయట నుంచి రాగానే గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరచాలి. 10. కళ్ళు చికిలిస్తూ చూడటం, ముఖం చిట్లించడం, కోపంతో పళ్ళు కొరకడం లాంటివి ముఖ సౌందర్యానికి అవరోధం కలిగిస్తాయి. ముఖ చర్మానికి ముడతలు ఏర్పడుతాయి. అటువంటి చర్యలవల్ల, అటువంటి అలవాట్లను మానుకోవాలి.అందంగా ఆకర్షణీయంగా కనిపించ టానికి ముఖ సౌందర్యం ఎంతగానో తోడ్పడు తుందని తెలుసుకోవాలి. 11. బాదం నూనెలో శనగపిండి, నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేసి, ఆరిన తరువాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు మచ్చలు పోవడమే కాదు, ముఖం మృదువుగా కనిపిస్తుంది. - నిమ్మపండు తొనలు, కమలా తొనలు, తులసి మొగ్గలు, సీమచామంతి, ఇలా ఏదైనా సరే వాటిరసంతో మసాజ్ చేసుకోవచ్చు. అదే తొనలతోనయితే సరిపోయే నీటిని కలుపుకుని రాసుకుని మసాజ్ చేసుకుని కడిగేసుకోవచ్చు.
- ఒక టీస్పూన్ ఆముదము తీసుకోండి. బీవ్యాక్స్ ఒక అరటీస్పూన్, ఆప్రికాట్ నూనె ఒక అరటీస్పూన్, సముద్రపు ఉప్పు ఒక టేబుల్ స్పూన్, ఆల్మండ్ పౌడర్ ఒక టీస్పూన్, బేబీషాంపూ రెండు టీస్పూన్లు తీసుకోండి. బీవ్యాక్స్ను బాగా కరిగించి ఆముదము ఆప్రికాట్ నూనెలను వేసి బాగా కలపండి. వేడిమీద తీసెయ్యండి. సముద్రపు ఉప్పును, ఆల్మండ్ పౌడర్ని కలిపి, షాంపూలో వేసి బాగా కలియబెట్టండి. ఆ తర్వాత ఉపయోగించండి. - బొప్పాయి కాయ సగం తీసుకోండి. దానికి నాలుగు టేబుల్స్పూన్ల బియ్పప్పిండి మొత్తాన్ని కలిపి బాగా గుజ్జుగుజ్జుగా పిసకండి. అందులో కొన్ని చుక్కల ఆరెంజ్ నూనెను కలపండి. మొత్తం కలిసేలా కలియబెట్టండి. మిశ్రమమైన ఆ పదార్థాన్ని చేతివేళ్ల చర్మంతో ముఖానికి గుండ్రంగా పూస్తూ ముఖం మొత్తం కవర్ చేయండి. పావుగంట తర్వాత ఆయిల్ను మాయిశ్చరైజర్ను చేసుకోండి. ఆపై శుభ్రంగా వాష్చేసుకుంటే ముఖం అందంగా తయారవుతుంది.
కొంతమందికి శరీరంపై వివిధ భాగాల్లో చర్మం నల్లబడుతుంటుంది. మరీ ముఖ్యం గా ఎండ వేడి తాకే ప్రాంతాల్లో ఇది మరింత స్పష్టం గా కనిపిస్తుంది. ఎండలోకి వెళ్తే చాలు...చర్మం పై మంట పుడుతుంది. ఎండ తాకిన ప్రాంతం నల్లబడు తుంది. కొంతమందికి చర్మంపై మచ్చలు ఏర్పడుతా యి. ఈ విధమైన సమస్యలను పిగ్మెంటేషన్ సమస్య లుగా చెబుతుంటారు.
హార్మోన్ల అసమతుల్యత, థైరాయిడ్ సంబంధిత సమ స్యలు, దీర్ఘకాలంగా వాడుతున్న కొన్ని రకాల మం దుల కారణంగా, శిరోజాలకు క్రమం తప్పకుండా రంగు వేసుకునే వారికి ఈ విధమైన పిగ్మంటేషన్ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఇవి సూర్యుడి అతి నీల లోహిత కిరణాల వల్ల ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఈ సమస్యలు వచ్చిన తరువాత తగు చర్యలు తీసుకోవడం కంటే కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడమే మేలు. ఆరంభదశలోనే ఈ సమస్యలను గుర్తిస్తే పరిష్కారం కూడా సులువే అవుతుంది. కొన్ని చిట్కాలు... 1. మంచినీళ్ళు ఎక్కువగా తాగాలి. తాజా పండ్ల రసాలు, మజ్జిగ ఎక్కువగా తాగాలి. 2. నల్ల ద్రాక్ష, పుచ్చకాయ, దానిమ్మ పండ్లు ఎక్కువగా తినాలి. 3. బయటకు వెళ్ళడానికి 30 నిమిషాల ముందే సన్‌క్రీమ్ లోషన్ ముఖానికి రాసుకోవాలి. 4. నల్ల ద్రాక్ష గుజ్జుకి కొంచెం తేనె కలిపి ప్రతి రోజూ స్నానానికి 20 నిమిషాల ముందు ముఖానికి రాసుకుని ఆ తరువాత చన్నీళ్ళతో స్నానం చేయాలి. 5. కొంచెం క్యారెట్, కొంచెం క్యాబేజీ, కొంచెం ఓట్స్ కలిపి మిక్సర్‌లో వేసి పేస్ట్‌గా తయారు చేసి, దానిలో సగం చెంచా పాల మీగడ, సగం చెంచా తేనె, 3 చెంచాల నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత కొంచెం గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే ముఖంపై నల్లమచ్చలు క్రమంగా తగ్గుముఖం పడుతాయి. 6. పిగ్మెంటేషన్ సమస్య ఉన్న వాళ్ళు ఎండలో బయటకు వెళ్లి వస్తే, ముఖం కడుక్కొని కీరాను గుండ్రటి ముక్కలుగా కోసి ముఖం పై 20 నిమిషాల పాటు ఉంచుకొని రిలాక్స్ కావాలి. దీని వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. బాదం గింజలను బాగా నానబెట్టి పేస్టు చేసుకోవాలి. దీంట్లో కొంచెం పాలపొడి, కొద్దిగా తేనె, కొన్ని చుక్కల నిమ్మరసం, కొంత ఆలివ్ ఆయిల్‌ను చేర్చాలి. ఈ మిశ్రమాన్ని మెడచుట్టూ పట్టించాలి. 30 నిమిషాలు ఆగి కడిగేయాలి. దీనివల్ల మెడచుట్టూ ఉన్న నల్ల వలయాలు పోయి అందంగా ఉంటుంది. మూలం : సూర్య దినపత్రిక మనం చేసుకునే సౌందర్య చిట్కాలన్నీ దాదాపుగా చర్మానికి నునుపు, తెలుపు తెచ్చేవే. తెల్లగా రావాలని ప్రతి ఒక్కరు ఆశించడంలో తప్పులేదు. ఉన్న రంగు కంటే కాస్త ఎక్కువ రంగు మెరుగుపడాలన్న చాలా ప్రయత్నాలు చేస్తారు. ఇందుకోసం బ్యూటీపార్లర్‌లకు వెళ్లే తీరిక లేకుంటే ఇంట్లోనే అంతకంటే మెరుగైన ఫలితాలు పొందడానికి ఈ ట్రీట్‌మెంట్లు.
బంగాళాదుంపని మెత్తగా ఉడకబెట్టి పొట్టు తీయకుండా మెదుపుకోవాలి. దీంట్లో పాలు, కొబ్బరి నూనె జత చేసి పేస్ట్ లా కలపాలి. మెడపై ఈ మిశ్రమాన్ని అప్లై చేసి, 20 నిమిషాల తరవాత కడిగేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే మెడ మీద నలుపు తగ్గి చర్మం కాంతివంతం అవుతుంది.
మూడు టీస్పూన్ల దోసరసం, రెండు టీస్పూన్ల అలొవెరా జెల్, టీస్పూన్ పెరుగు కలిపి ముఖానికి, మెడకి పట్టించి, పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఎండ వల్ల కందిపోయిన, రసాయనాల వల్ల ర్యాష్ ఏర్పడిన చర్మానికి ఈ ప్యాక్ సహజమైన సౌందర్యలేపనంలా పనిచేస్తుంది.
పుచ్చకాయ గుజ్జు ముఖానికి రాసి, పది నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. నిస్సేజంగా మారిన చర్మానికి పోషణ లభించి కాంతివంతమవుతుంది.
|