telugutaruni.weebly.com
  • Home
  • వంటకాలు (Cookeries)
    • ఫలహారాలు (Tiffins)
    • శాకాహారం (Veg)
    • బియ్యపు వంటలు (Rice items)
    • మాంసాహారం (Non-Veg)
    • పచ్చళ్ళు (chutneys)
    • వడియాలు
    • పండ్ల రసాలు (Juices)
    • స్వీట్స్ (Sweets)
    • చిరుతిళ్ళు (Snacks)
    • గ్రేవీ ఐటమ్స్
    • సూప్స్ (Soops)
    • కొత్త కొత్తగా
  • చిట్కాలు (Tips)
    • వంటింటి చిట్కాలు ( Kitchen Tips)
    • ఆరోగ్య చిట్కాలు (Health Tips)
    • సౌందర్య చిట్కాలు (Beauty Tips)
  • మహిళా లోకం
    • ఆదర్శ మహిళలు
    • శభాష్ మహిళా..
  • విహారయాత్ర

తలస్నానానికి ముందు తర్వాత..

11/12/2013

0 Comments

 
Picture
                      స్ర్తీలు వారి శరీర భాగాల్లో అన్నింటికంటే జుట్టుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. నిగనిగలాడే వారి శిరోజాలే వారికి అందం అని భావిస్తుంటారు. అటువంటి శిరోజాలకోసం తలస్నానానికి ముందు తర్వాత ఆరు చిట్కాలు పాటించండి.. మీ జుట్టును నిగనిగలాడేలా చేసుకోండి.

1. గోరువెచ్చని కొబ్బరినూనె లేదా ఆలివ్‌ ఆయిల్‌ను మాడుకు, కుదుళ్ళకు పట్టించి మర్దన చేయాలి.
2. టర్కీటవల్‌ను వెచ్చని నీటిలో ముంచి, పిండి, తలకు చుట్టండి. ఈ విధంగా నెలకు ఒకసారైనా జుట్టుకు ఆవిరిపట్టాలి.
3. శీకాయ లేదా షాంపూతో తలస్నానం చేసిన తర్వాత తడిజుట్టుకు కండిషనర్‌ని రాయండి. అయితే మాడుకు కండిషనర్‌ని తగలనివ్వద్దు.
4. జుట్టు తడిలేకుండా త్వరగా ఆరాలని డ్రయర్‌ని ఉపయోగించవద్దు. తలకు టవల్‌ చుట్టి కాసేపు వదిలేయాలి. జుట్టు తడిని టవల్‌ పీల్చుకుని, పొడిగా అవుతుంది.
5. పార్టీలకో, బయటకు వెళ్ళినప్పుడో జుట్టు మెరవాలని హెయిర్‌ స్ప్రేలు వాడకూడదు. వీటికి ఎంత దూరం ఉంటే అంత మంచిది.
6. ప్రయాణాలలో కిటికీ దగ్గర కూర్చుంటే తలకు స్కార్ఫ్‌ కట్టుకోవాలి. గాలికి జుట్టు పొడిబారకుండా ఉంటుంది. దుమ్ముకూడా అంటదు. ఈ జాగ్రత్తలు పాటిస్తే శిరోజాలు ఆరోగ్యంగా నిగనిగలాడుతూ ఉంటాయి.

0 Comments

ఉఫ్ డాండ్రఫ్

9/15/2013

0 Comments

 
  • నిమ్మరసాన్ని మాడుకి పట్టించి పావుగంట తరువాత తలస్నానం చేస్తే చుండ్రు పోయి జుట్టు మెరుస్తుంది.
  • * ఒక గిన్నెలో బీట్‌రూట్ ముక్కలు వేసి నీళ్లు చిక్కటి రంగులోకి మారే వరకు ఉడికించాలి. ఈ నీళ్లతో మాడుపై మర్దనా చేసి అరగంట తరువాత తలస్నానం చేస్తే చుండు పోతుంది (మర్దనా చేసేటప్పుడు చేతులకు గ్లౌజ్‌లు వేసుకోవాలి. నుదుటి మీదకి నీళ్లు కారకుండా చూసుకోవాలి.)
  • * మాడుపై ఉండే చర్మం పొడి బారడం వల్ల కూడా చుండ్రు వస్తుంది. ఇలాంటప్పుడు ఆయిల్ ట్రీట్‌మెంట్ బాగా పనిచేస్తుంది. కొబ్బరి, ఆలివ్, రోజ్‌మేరీ, లావెండర్ నూనెల్లో నచ్చిన నూనెని వేడిచేసి మాడుకి మర్దనా చేసి వేడి నీళ్లలో ముంచిన తుండుని తలకు చుట్టుకుని అరగంట తరువాత తలస్నానం చేయాలి.
  • * టీ ట్రీ ఆయిల్ సహజసిద్ధమైన యాంటీసెప్టిక్, యాంటీబాక్టీరియల్. అందుకని ఇది కూడా చుండ్రుని పోగొట్టడంలో బాగా పనిచేస్తుంది. టీట్రీఆయిల్‌ని మాడుకు పట్టించి పావుగంట తరువాత తలస్నానంచేయాలి. లేదా షాంపూలో కొన్ని చుక్కల టీట్రీఆయిల్‌ని కలుపుకున్నా ఫలితం ఉంటుంది.
  • * బీర్‌లో విటమిన్ బి, ఈస్ట్‌లు మెండుగా ఉంటాయి. ఈ రెండూ చుండ్రు కారకాలకు బద్ధశత్రువులు. అంతేకాదు ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా దీంతో మటుమాయమవుతుంది. ప్రతిరోజూ రాత్రి కొద్దిగా బీరుని తలకు పట్టిస్తే మాడుకి పట్టిన చుండ్రు వదులుతుంది.
  • * పైన చెప్పినవన్నీ చుండ్రు వచ్చాక దాన్ని పోగొట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. చుండ్రు అసలు రాకుండా ఉండాలంటే నీళ్లు సరిపడా తాగాలి. సమతులాహారాన్ని తినాలి. బి విటమిన్, జింక్‌లను ఆహారంలో ఎక్కువగా చేర్చాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే చుండ్రు పోవడంతో పాటు చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.
0 Comments

పదహారేళ్లకే జుట్టు తెల్లబడుతుంటే...?

8/31/2013

0 Comments

 
                   చిన్న వయస్సులో జుట్టు తెల్లబడటానికి ఎన్నో కారణాలుంటాయి. ఇక తెల్లబడిన జుట్టును దాచుకునే ఒకే ఒక్క మార్గం కలరింగ్‌. ఇకపై మరిన్ని వెంట్రుకలు తెల్లబడకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. ఉసిరి ఇందుకు బాగా ఉపకరిస్తుంది.

  • ప్రతిరోజూ ఓ ఉసిరికాయ రసం తాగండి.
  • హెన్నా పొడిలో కూడా ఉసిరిపొడిని కలుపుకోవాలి. అయితే హెన్నా తెల్లజుట్టును రెడ్డిష్‌ బ్రౌన్‌గా మార్చుతుంది.
  • రెండు మూడు కప్పుల నీటిలో గుప్పెడు ఎండు ఉసిరికాయలు నానబెట్టి మరునాటి ఉదయం వడకట్టి, కాయల గుజ్జు రుబ్బి హెన్నా పొడిలో కలుపుకోవాలి.
  • నిమ్మరసం, కాఫీ పొడి నాలుగేసి టీ స్పూన్లు, పచ్చి గుడ్డుసొన, రెం డు టీస్పూన్ల నూనె, వడగట్టిన ఉసిరి రసం కలిపి చక్కని పేస్ట్‌ తయారు చేసి రెండు మూడు గంటలు అలాగే నాననిచ్చి జుట్టుకు అప్లయ్‌ చేయాలి. కనీసం రెండు గంటలసేపుంచి కడిగేయాలి.

0 Comments

తెల్ల వెంట్రుకల నివారణకు...

8/15/2013

0 Comments

 
  • ప్రొటీను ఆహారము ఎక్కువ తీసుకోండి. ప్రొటీన్స్‌ ఎక్కువగా మొలకలు, ధాన్యసంబంధిత వాటిల్లో మాంసము, సోయాచిక్కుళ్లలోనూ ఉంటాయి.
  • విటమిన్‌ ఎ, విటమిన్‌ బి సమృద్ధిగా గల ఆహారం తీసుకోండి. ఈ విటమిన్లు ముదురు ఆకుపచ్చ కూరగాయల్లో, పసుపురంగు ఉండే పళ్లలో సమృద్ధిగా ఈ విటమిన్స్‌ ఉంటాయి. తాజా ఆకుపచ్చని ఆకుకూరల్లో, అరటికాయల్లో, టమాటా, కాలీఫ్లవర్‌, పప్పుధాన్యాలు, లివర్‌, కిడ్నీ, పెరుగు, గోధుమలలో విటమిన్‌ బి ఉంటుంది.
  • ఖనిజలవణాలు బాగా సమృద్ధిగా ఉండే ఐరన్‌ లాంటివి తీసుకోండి. ఎర్రగా ఉండే మాంసము లోనూ, ఆకుపచ్చని కూరగాయల్లోనూ జింక్‌ ఎక్కువగా ఉంటుంది. ఎండిన ఆప్రికాట్స్‌, కొత్తిమీర, గుడ్లు, గుడ్డులోని పచ్చసొన, ధాన్యములలో ఐరన్‌ ఉంటుంది. సన్‌ఫ్లవర్‌ గింజలలో, జీడిమామిడి ఆల్మండ్‌లలో కాపర్‌ ఎక్కువగా ఉంటుంది.
  • అరటికాయలు, చేపలు, క్యారెట్‌లలో అయొడిన్‌ ఉంటుంది.
  • కాఫీ, టీల కన్నా మజ్జిగ ఎక్కువ తీసుకోండి. మజ్జిగలో రెండు చుక్కల నిమ్మరసం కూడా కలిపి తీసుకోండి. మజ్జిగ తాగడం వల్ల శరీరానికి, జుట్టుకి కావలసిన విటమిన్లు లభిస్తాయి.
  • ఎర్లీ ఏజ్‌లో జుట్టుతెల్లబడినవారు, తాజాఅల్లాన్ని తీసుకుని అరగదీసి తేనెతో కలిపి తీసుకోవటం వల్ల ఆమ్లాలను తలపై రుద్దుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. జుట్టు నల్లబడుతుంది.
  • రోజూ రెగ్యులర్‌గా కొబ్బరినూనెని నిమ్మపండు రసంతో జతచేసి జుట్టుకు మసాజ్‌చేసుకోండి.
  • పాలు కలవని టీ డికాషన్‌లో ఒక టేబుల్‌స్పూన్‌ ఉప్పు కలపండి. ఈ మిశ్రమంలో తెల్లబడిన జుట్టు ప్రాంతంలో బాగా మెత్తగా మృదువుగా మసాజ్‌ చేసుకోండి. ఓ గంట పోయాక తలస్నానం చేయండి.
  • రెండు టీస్పూన్ల హెన్నా పౌడర్‌ తీసుకోండి. ఒక టీస్పూన్‌ పెరుగు ఒక టీస్పూన్‌ మెంతుల పొడి, మూడు టీస్పూన్లు పుదీనా రసంను కలపండి. మిశ్రమాన్నంతా పేస్ట్‌లా చేసి జుట్టుకు పట్టించండి. రెండు లేదా మూడు గంటలు తర్వాత షాంపూతో స్నానం చేయండి.
0 Comments

జుట్టు రాలకుండా...

8/14/2013

0 Comments

 
జుట్టుని ఆరోగ్యంగానే కాదు, అందంగానూ కనిపించేలా చేయడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని లేదు. కొన్ని వస్తువుల్ని ఇంట్లో అందుబాటులో ఉంచుకుని ఎప్పటికప్పుడు చికిత్స తీసుకుంటే సరిపోతుంది.

  • ఉసిరి జుట్టు రాలే సమస్యనే కాదు, చుండ్రుని కూడా నివారిస్తుంది. తలలో ఇన్‌ఫెక్షన్‌ ఉంటే తగ్గేలా చూస్తుంది. అలాంటి సమస్యలున్నప్పుడు పెరుగులో ఉసిరి పొడిని కలిపి తలకు పూతలా వేసుకొని కాసేపయ్యాక కడిగేసుకుంటే సరిపోతుంది.
  • జుట్టుని మెరిపించడంతో పాటూ ఒత్తుగా పెరిగేలా చేస్తుంది పెరుగు. దీన్ని నేరుగా తలకు రాసుకోవచ్చు. లేదంటే తేనె, నిమ్మరసం లాంటి ఇతర పదార్థాలతో కలిపీ తలకు పట్టించుకోవచ్చు. పెరుగును తలకు రాసుకుని అరగంట తరవాత తలస్నానం చేయాలి.
  • కొబ్బరి నూనెను గోరువెచ్చగా చేసి తలకు రాసి మర్దన చేయడం వల్లా ఫలితం ఉంటుంది. తలలో రక్త ప్రసరణ సాఫీగా జరిగి, జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. అలాగని రోజూ నూనె రాసుకోవాలని లేదు. తలస్నానానికి గంటా, రెండు గంటల ముందు నూనె రాసుకుంటే చాలు.
  • జుట్టు సంరక్షణకు సంబంధించి గోరింటాకు పొడి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వారం, పదిహేను రోజులకోసారి గోరింటాకు పొడిలో కొద్దిగా నిమ్మరసం, పెరుగూ కలిపి తలకు పూతలా వేసుకోవాలి. అరగంటయ్యాక తలస్నానం చేయాలి.
  • జుట్టు విపరీతంగా రాలుతుంటే ఉడికించిన మందాల పువ్వుల్ని వాడితే ఎంతో మార్పు ఉంటుంది. అయితే ఆ పూతను నేరుగా కాకుండా పెరుగు లేదా గుడ్డులో కలిపి రాసుకోవాలి.
  • కొన్నిసార్లు జుట్టు చిట్లిపోతుంది. పొడి బారడం, తలంతా దురదపెట్టడం వంటి సమస్యలూ తలెత్తుతాయి. వాటిని నివారించాలంటే తలకు కొబ్బరి పాలు రాసుకుని కాసేపయ్యాక కడిగేసుకోవాలి.
మీరు ప్రతిసారీ కొత్త కేశాలంకరణ కోసం బ్యూటీ పార్లర్‌కే వెళ్లాలా?

'వెళ్లకపోతే మనకు ఏది నప్పుతుందో తెలిసేదెలా' అంటారా! అయితే 'బ్యాంగ్‌స్త్టెల్‌' అప్లికేషన్‌ను మీ ఫోనులో డౌన్‌లోడ్‌ చేసుకొని, దాన్లో మీ ఫొటో ఒకటి అప్‌లోడ్‌ చేస్తే చాలు. అందులో ఉన్న హెయిర్‌ స్త్టెళ్లన్నీ మీరు ప్రయత్నిస్తే ఎలా ఉంటుందో చూపిస్తుంది. మీకు ఏది బాగుంటుందని అనిపిస్తే దాన్ని ప్రయత్నించొచ్చు. దీంతో డబ్బు ఆదా చేయడంతో పాటూ మిమ్మల్ని మీరు రకరకాల పద్ధతుల్లో చూసుకుంటూ ఆనందించొచ్చు కూడా.
0 Comments

సౌందర్య చిట్కా (Beauty tip)

7/12/2013

0 Comments

 
" నాలుగు టీ స్పూన్ల నిమ్మరసంలో రెండు టీ స్పూన్‌ల కొబ్బరిపాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించి అరగంట తరవాత తలస్నానం చేయాలి. పదిహేను రోజులకోసారి ఇలా చేస్తే శిరోజాలు ఆరోగ్యంగా నిగనిగలాడతాయి. "
0 Comments

May 21st, 2013

5/21/2013

0 Comments

 
             పాలకూర, బచ్చలి, తోటకూర వంటి ఆకుకూరలు, చిక్కుళ్ళు, జీడిపప్పు, బాదం, అవిసె వంటి గింజ ధాన్యాలు , పాలు, పెరుగు, తక్కువ కొవ్వు కలిగిన ఇతర పాల ఉత్పత్తులు తరచు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల కురులు ఏపుగా పెరిగి, ఆరోగ్యంగా నిగనిగలాడతాయి.
0 Comments

May 21st, 2013

5/21/2013

0 Comments

 
జుట్టు పెరగాలంటే రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని కొబ్బరినూనెతో మర్దన చేసి ఉదయం తలస్నానం చేయాలి.
0 Comments

కేశ సంరక్షణ  

5/21/2013

0 Comments

 
కప్పు ఆవనూనెలో గుప్పెడు గోరింటాకు వేసి బాగా మరిగించాలి. చల్లారాక ఆకును తీసి నూనె నిల్వ చేసుకొని రాత్రిపూట రాసుకోవాలి. మర్నాడు తలస్నానం చేయాలి. ఇలా రెండు మూడు రోజులకోసారి చేస్తుంటే జుట్టు రాలే సమస్య అదుపులోకి వస్తుంది.

0 Comments

    Author

    నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ  మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో  ఒక  తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం. 

    Archives

    January 2014
    December 2013
    November 2013
    October 2013
    September 2013
    August 2013
    July 2013
    June 2013
    May 2013

    Categories

    All
    మీ జుట్టు సంరక్షణ కోసం
    మెడ కోసం
    కేశ సంరక్షణ
    చలి చర్మానికి...
    ముఖం
    కళ్ళ కోసం
    చర్మం
    పాదాల కోసం
    చేతుల కోసం
    నలుగు వెలుగులు
    పెదవుల కోసం
    ముడతలు తగ్గడం కోసం
    జుట్టు నల్లగా ఉండాలంటే..
    చుండ్రు నివారణ కోసం
    పసుపుతో సౌందర్యము ఎలా వస్తుంది?
    కొవ్వును కరిగించే నువ్వులు
    అందానికి బీట్‌రూట్‌
    చుండ్రుకు ఇంటి వైద్యం
    కరివేపాకుతో కేశ సౌందర్యం
    వెంట్రుకలకు ట్రిమ్మింగ్ అవసరమే!

    RSS Feed

    Enter your email address:

    Delivered by FeedBurner


Powered by Create your own unique website with customizable templates.