2. బీట్‌రూట్ రసాన్ని ముఖానికి రాసుకుని అరగంట తర్వాత ముఖాన్ని కడుక్కుంటే ముఖవర్చస్సు పెరుగుతుంది.
3. సెనగపిండిలో కీరా దోసకాయ రసాన్ని కానీ, కారెట్ రసాన్ని కానీ కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి పట్టించి ఓ గంట తర్వాత ముఖాన్ని పరిశుభ్రమయిన నీటితో కడిగితే ముఖ చర్మపు కాంతి పెరుగుతుంది.
4. గులాబీ రెక్కల పేస్టును ముఖానికి పట్టించి, అరగంట తర్వాత ముఖాన్ని కడిగితే ముఖం ఎంతో మృదువు గానూ, ఆకర్షణీయంగానూ కనిపిస్తుంది.
5. గ్లిజరిన్‌లో నిమ్మరసం, టమాటోరసం కలిపి ముఖానికి రాసుకుంటే ముఖ సౌందర్యం పెరుగుతుంది.
6. పాలల్లో దూదిని తడిపి, దూదిలో తేమ ఆరిపోయేంత వరకు ఆ దూదిని కళ్ళమీద
ఉంచుకుంటే కళ్ళు కాంతితో మెరుస్తూంటాయి.
7. తాజా పండ్లు, పాలు ముఖచర్మపు సోయగాన్ని, ఆకర్షణనూ పెంచుతాయి.
8. ఎండిన కమలాఫలం తొక్కలను మెత్తని పొడిచేసి,
ఆ పొడిలో పసుపు, సెనగపిండి కలిపి అందులో రోజ్‌వాటర్ పోసి మెత్తని పేస్ట్‌చేసి ముఖానికి ఆ పేస్ట్‌ను పట్టించాలి. కొంతసేపయిన తర్వాత ముఖం కడుక్కుంటే ముఖం లేతగానూ, అందంగానూ, మృదువుగానూ, కాంతిగానూ, ఆకర్షణీయంగానూ కనిపిస్తుంది.
9. జిడ్డు చర్మం ఉన్నవారు ముఖ సౌందర్యం విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ముఖానికి జిడ్డు లేకుండా ఉండటా నికి గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరచాలి. సబ్బుకు బదులు మెత్తని సున్నిపిండిని వాడాలి. బయట నుంచి రాగానే గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరచాలి.
10. కళ్ళు చికిలిస్తూ చూడటం, ముఖం చిట్లించడం, కోపంతో పళ్ళు కొరకడం లాంటివి ముఖ సౌందర్యానికి అవరోధం కలిగిస్తాయి. ముఖ చర్మానికి ముడతలు ఏర్పడుతాయి. అటువంటి చర్యలవల్ల, అటువంటి అలవాట్లను మానుకోవాలి.అందంగా ఆకర్షణీయంగా కనిపించ టానికి ముఖ సౌందర్యం ఎంతగానో తోడ్పడు తుందని తెలుసుకోవాలి.
11. బాదం నూనెలో శనగపిండి, నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేసి, ఆరిన తరువాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు మచ్చలు పోవడమే కాదు, ముఖం మృదువుగా కనిపిస్తుంది.