telugutaruni.weebly.com
  • Home
  • వంటకాలు (Cookeries)
    • ఫలహారాలు (Tiffins)
    • శాకాహారం (Veg)
    • బియ్యపు వంటలు (Rice items)
    • మాంసాహారం (Non-Veg)
    • పచ్చళ్ళు (chutneys)
    • వడియాలు
    • పండ్ల రసాలు (Juices)
    • స్వీట్స్ (Sweets)
    • చిరుతిళ్ళు (Snacks)
    • గ్రేవీ ఐటమ్స్
    • సూప్స్ (Soops)
    • కొత్త కొత్తగా
  • చిట్కాలు (Tips)
    • వంటింటి చిట్కాలు ( Kitchen Tips)
    • ఆరోగ్య చిట్కాలు (Health Tips)
    • సౌందర్య చిట్కాలు (Beauty Tips)
  • మహిళా లోకం
    • ఆదర్శ మహిళలు
    • శభాష్ మహిళా..
  • విహారయాత్ర

ముఖంపై మచ్చలు పోవాలంటే .........

9/25/2013

0 Comments

 
                       అరటి, జామ పళ్ల ముక్కలను తీసుకుని మెత్తని పేస్టులాగా చేసుకోవాలి. దీన్ని ముఖంపై పిగ్మెం ఉన్న చోట అప్లై చేయాలి. 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచి తరువాత నీటితో కడిగేయాలి. ప్రతిరోజూ ఇలా చేయడం వల్ల జామలో లైకోపిన్, అరటిలోని శుద్ధి చేసే గుణాలు కలిసి ఆ మచ్చలను పోగొట్టి చర్మాన్ని కాంతివంతం చేస్తాయి.

0 Comments

మీ జుట్టు సంరక్షణ కోసం

9/20/2013

0 Comments

 
  • తలస్నానం చేసిన తర్వాత ఒక కప్పు వెనిగర్‌ను ఒక మగ్గు నీళ్ళలో వేసి తల మీద నుంచి పోసుకోవాలి. ఇలా చేస్తే జుట్టు మృదువుగా తయారవుతుంది.
  • కొంచెం ఆలివ్ ఆయిల్‌కి కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి జుట్టు కుదుళ్లకు మర్దనా చేసి ఒక గంటాగి తల స్నానం చేస్తే చుండ్రు మటుమాయమవుతుంది.
0 Comments

ఉఫ్ డాండ్రఫ్

9/15/2013

0 Comments

 
  • నిమ్మరసాన్ని మాడుకి పట్టించి పావుగంట తరువాత తలస్నానం చేస్తే చుండ్రు పోయి జుట్టు మెరుస్తుంది.
  • * ఒక గిన్నెలో బీట్‌రూట్ ముక్కలు వేసి నీళ్లు చిక్కటి రంగులోకి మారే వరకు ఉడికించాలి. ఈ నీళ్లతో మాడుపై మర్దనా చేసి అరగంట తరువాత తలస్నానం చేస్తే చుండు పోతుంది (మర్దనా చేసేటప్పుడు చేతులకు గ్లౌజ్‌లు వేసుకోవాలి. నుదుటి మీదకి నీళ్లు కారకుండా చూసుకోవాలి.)
  • * మాడుపై ఉండే చర్మం పొడి బారడం వల్ల కూడా చుండ్రు వస్తుంది. ఇలాంటప్పుడు ఆయిల్ ట్రీట్‌మెంట్ బాగా పనిచేస్తుంది. కొబ్బరి, ఆలివ్, రోజ్‌మేరీ, లావెండర్ నూనెల్లో నచ్చిన నూనెని వేడిచేసి మాడుకి మర్దనా చేసి వేడి నీళ్లలో ముంచిన తుండుని తలకు చుట్టుకుని అరగంట తరువాత తలస్నానం చేయాలి.
  • * టీ ట్రీ ఆయిల్ సహజసిద్ధమైన యాంటీసెప్టిక్, యాంటీబాక్టీరియల్. అందుకని ఇది కూడా చుండ్రుని పోగొట్టడంలో బాగా పనిచేస్తుంది. టీట్రీఆయిల్‌ని మాడుకు పట్టించి పావుగంట తరువాత తలస్నానంచేయాలి. లేదా షాంపూలో కొన్ని చుక్కల టీట్రీఆయిల్‌ని కలుపుకున్నా ఫలితం ఉంటుంది.
  • * బీర్‌లో విటమిన్ బి, ఈస్ట్‌లు మెండుగా ఉంటాయి. ఈ రెండూ చుండ్రు కారకాలకు బద్ధశత్రువులు. అంతేకాదు ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా దీంతో మటుమాయమవుతుంది. ప్రతిరోజూ రాత్రి కొద్దిగా బీరుని తలకు పట్టిస్తే మాడుకి పట్టిన చుండ్రు వదులుతుంది.
  • * పైన చెప్పినవన్నీ చుండ్రు వచ్చాక దాన్ని పోగొట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. చుండ్రు అసలు రాకుండా ఉండాలంటే నీళ్లు సరిపడా తాగాలి. సమతులాహారాన్ని తినాలి. బి విటమిన్, జింక్‌లను ఆహారంలో ఎక్కువగా చేర్చాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే చుండ్రు పోవడంతో పాటు చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.
0 Comments

మెరిసే పెదవులకోసం...

9/14/2013

0 Comments

 
  • -పొడి బారిన పెదవులపై కొబ్బరి, బాదం నూనెల్ని సమపాళ్లలో కలిపి రాసుకోవాలి.
  • - కొంచెం పెరుగు తీసుకుని అందులో ఓ రెండు కుంకుమపువ్వు రెబ్బలు కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు మూడుసార్లు రాసుకుంటే పెదవులకి మంచి రంగు వస్తుంది.
  • -నల్లగా ఉన్న పెదాలకు నిమ్మరసం లేదా గ్లిజరిన్ రాస్తే పెదవులు ఎర్రగా తయారవుతాయి.
  • - టాల్కమ్ పౌడర్ రాసుకుని లిప్‌స్టిక్ వేసుకుంటే ఎక్కువ సేపు నిలుస్తుంది.
  • -వారానికి ఒకసారి టూత్ బ్రష్‌తో పెదవులపై రుద్దితే మృతచర్మం తొలగిపోతుంది.
  • - గులాబీరేకుల రసాన్ని రోజూ రాత్రిపూట పెదవులకి రాసుకుంటే నలుపురంగు విరుగుతుంది.
  • - ప్రతిరోజూ స్నానం చేసే ముందు మీగడ రాసుకుంటే పెదవులు మెరుస్తుంటాయి.
  • -బీట్‌రూట్ రసాన్ని రోజు విడిచి రోజు రాసుకుంటే కూడా మంచి ఫలితం ఉంటుంది.
0 Comments

పాదాల పగుళ్లుకు...

9/13/2013

0 Comments

 
  • గోరింటాకును బాగా రుబ్బుకుని పగుళ్లు ఉన్న చోట రాసుకుని ఎండిన తర్వాత కడిగితే పగుళ్లకు చెక్‌ పెట్టవచ్చు.
  • పాదాలు తట్టుకునేంత వేడినీటిలో కాస్త ఉప్పు, నిమ్మకాయ రసం చేర్చి పాదాలను ఆ నీటిలో ఉంచి, బ్రష్‌తో పాదాలను రుద్దినట్లైతే బ్యాడ్‌ సెల్స్‌కు చెక్‌ పెట్టవచ్చు.
  • వేపాకు, పసుపులో కాసింత సున్నం కలిపి పేస్‌‌టలా రుబ్బుకుని, ఆముదంలో చేర్చి పగుళ్లకు రాసినట్లైతే ఉపశమనం లభిస్తుంది.
  • బొప్పాయి గుజ్జును పగుళ్లపై రాస్తే మంచి ఫలితం ఉంటుంది.
  • ఇంకా నాణ్యత గల స్లిపర్స్‌, షూస్‌ వాడటం ద్వారా పగుళ్లు దరిచేరవు.
  • అలాగే ఆముదం, కొబ్బరి నూనె సమపాళ్ళలో తీసుకుని అందులో పసుపు పొడి చేర్చి రోజూ పాదాలకు రాస్తే పగుళ్లను దూరం చేసుకోవచ్చు.
  • రాత్ర నిద్రకు ఉపక్రమించే సమయంలో పాదాలను శుభ్రం చేసుకుని కొబ్బరి నూనె రాస్తే పగుళ్లు ఏర్పడవు.

0 Comments

శరీరం మృదువుగా ఉండాలంటే

9/11/2013

0 Comments

 
శరీరం మృదువుగా ఉండాలంటే మంచి బాడీలోషన్‌ రాసుకోవాల్సిందే. అలాగని ఎంతో ఖర్చుపెట్టి వాటిని కొనాల్సిన పనిలేదు. ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు.అదెలాగో తెలుసుకుందాం.   
  • - మూడు టేబుల్‌స్పూన్ల రోజ్‌వాటర్‌కి, ఒక స్పూన్‌ గ్లిజరిన్‌, రెండు టీస్పూన్ల నిమ్మరసం కలపండి. ఆ మిశ్రమాన్ని చిన్న సీసాలో పోసి ఫ్రిజ్‌లో పెట్టండి. అవసరమైనప్పుడు తీసి వాడుకుంటూ ఉంటే, చర్మం పొడిబారకుండా మృదువుగా ఉంటుంది.  
  • - కప్పు రోజ్‌వాటర్‌లో టీస్పూన్‌ బొరాక్స్‌ పొడిని, రెండు టీస్పూన్ల వేడిచేసిన ఆలివ్‌ ఆయిల్‌ని బాగా కలపండి. మార్కెట్లో లావెండర్‌ వాటర్‌ దొరుకుతుంది. దీనిని పై మిశ్రమంలో కలిపి బాగా గిలక్కొట్టండి. కాసేపయ్యాక వాడుకోవచ్చు.
  • - సబ్బుని చిన్నచిన్న ముక్కల్లా చెక్కుకుని మూడు టీస్పూన్ల నిండా దానిని తీసుకోవాలి. దానిని పావుకప్పు నీళ్లలో కలిపి వేడిచేసి, నాలుగు స్పూన్ల ఆలివ్‌ ఆయిల్‌ని, టీస్పూన్‌ గ్లిజరిన్‌నీ దాన్లో వేసి బాగా కలపాలి.

0 Comments

కలువకన్నుల కోసం....

9/6/2013

0 Comments

 
Picture
అందమైన కళ్లు మీ అందాన్నీ నిబిడీకృతం చేస్తాయి. చక్కటి కలువల్లాంటి కళ్లుకోసం ఈ చిట్కాలు పాటించండి.
  • - అర టీస్పూన్‌ కీరారసంలో కొద్దిగా రోజ్‌వాటర్‌ కలిపి ఈ మిశ్రమాన్ని కళ్లకు రాసుకుని అరగంటసేపు ఉంచి ఆ తర్వాత కడుక్కుంటే కళ్లు ఆకర్షణీయంగా ఉంటాయి.
  • - కళ్లు చాలా సున్నితమైనవి కాబట్టి బజారున దొరికే ఏ క్రీం పడితే ఆ క్రీం రాసెయ్యకూడదు. ఇలా చెయ్యడం వల్ల మీ కళ్లు ఇన్‌ఫెక్షన్‌ బారిన పడే ప్రమాదం ఉంది.
  • - తగినంత ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల కళ్లకు రెస్ట్‌ దొరికి తాజాగా కనపడతాయి.
  • - గ్లాస్‌ నీటిలో ఉసిరిపొడి నానబెట్టి ఉదయాన్నే ఈ మిశ్రమంతో ఉదయాన్నే కళ్లను కడుక్కుంటే కళ్లు తాజాగా మెరుస్తాయి.
  • - కళ్ల చుట్టూ ఉండే ముడతలు పోవాలంటే పాలమీగడతో అక్కడ మసాజ్‌ చేసుకుంటే ముడతలు నుండి విముక్తి పొందవచ్చు.
  • - కీరదోసకాయను చక్రాల్లా కట్‌ చేసుకుని ఆ చక్రాలను కంటిమీద ఉంచుకుంటే కళ్లు తాజాగా ఉంటాయి. ఆల్మండ్‌ ఆయిల్‌లో కొంచెం ఆలివ్‌ ఆయిల్‌ కలిపి కంటిచుట్టూ ఉండే నలుపు ప్రాంతంపై రాస్తే ఆ నలుపును నివారించవచ్చు.
  • - రోజూ పావుగంటపాటు రెండు చేతులను రెండు కళ్లపై ఉంచుకుని ప్రశాంతంగా కూర్చుంటే మీ కళ్లకు రిలీఫ్‌ లభిస్తుంది.
  • - కళ్లకు మేకప్‌ చేసుకునే బ్రష్‌ల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. వీటిపై ఉండే దుమ్ము, ధూళి వల్ల మీ కళ్లకు ఇన్‌ఫెక్షన్‌ వచ్చే ప్రమాదం ఉంది. ఉప్పునీటితో కళ్లను కడుక్కోవడం వల్ల కళ్లు మెరుస్తాయి.
  • - కళ్లకు కాటుక పెట్టుకోవడం వల్ల కళ్లు చాలా అందంగా కనబడతాయి. ఐబ్రోస్‌ వెంట్రుకలు రాలుతుంటే వీటికి ఆలివ్‌ ఆయిల్‌ రాయడం ద్వారా నివారించవచ్చు.  కళ్లకు ఇన్‌ఫెక్షన్‌ వచ్చినపుడు మేకప్‌ వేసుకోకూడదు.

0 Comments

మొటిమలు పోగొట్టేందుకు...

9/4/2013

0 Comments

 
  • -టమోటా గుజ్జు ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాల తరువాత చల్లటి నీళ్లతో ముఖం కడగాలి.
    -మూడు టీ స్పూన్ల తేనెలో దాల్చినచెక్క పొడి కొద్దిగా కలిపి రాత్రి పడుకోబోయేముందు మొటిమలపై రాయాలి. ఇలా రెండు వారాలపాటు చేస్తే ఫలితం ఉంటుంది.
  • బాదంపప్పును పాలతో కలిపి చిక్కటి పేస్టు చేసి మొటిమలపై రాయాలి. ఇలా చేస్తే మొటిమలు మెత్తబడి త్వరగా తగ్గడమే కాకుండా మచ్చలు కూడా పడవు. 
  • -నిమ్మరసం, వేరుశెనగ నూనెల్ని సమపాళ్లలో కలిపి రాసుకోవాలి. నిమ్మరసంలో గంధంపొడి లేదా దాల్చిన చెక్క పొడి కలిపి ఆ మిశ్రమాన్ని మొటిమలపై పూసినా ఫలితం ఉంటుంది.
  • -నిమ్మరసం, రోజ్ వాటర్‌లను సమపాళ్లలో కలిపి మొటిమలపై పూసి అరగంట తరువాత చల్లటి నీళ్లతో కడిగేయాలి. నాలుగు వారాలపాటు ఇలా చేస్తే మొటిమలు తగ్గిపోతాయి.
  • అరటి, జామ పళ్ల ముక్కలను తీసుకుని మెత్తని పేస్టులాగా చేసుకోవాలి. దీన్ని ముఖంపై పిగ్మెం ఉన్న చోట అప్లై చేయాలి. 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచి తరువాత నీటితో కడిగేయాలి. ప్రతిరోజూ ఇలా చేయడం వల్ల జామలో లైకోపిన్, అరటిలోని శుద్ధి చేసే గుణాలు కలిసి ఆ మచ్చలను పోగొట్టి చర్మాన్ని కాంతివంతం చేస్తాయి.
0 Comments

September 02nd, 2013

9/2/2013

0 Comments

 
  • ఆలివ్ ఆయిల్, నిమ్మరసం సమంగా మిక్స్ చేసి జుట్టుకు పట్టించాలి. గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు చిట్లడం తగ్గుతుంది.

0 Comments

    Author

    నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ  మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో  ఒక  తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం. 

    Archives

    January 2014
    December 2013
    November 2013
    October 2013
    September 2013
    August 2013
    July 2013
    June 2013
    May 2013

    Categories

    All
    మీ జుట్టు సంరక్షణ కోసం
    మెడ కోసం
    కేశ సంరక్షణ
    చలి చర్మానికి...
    ముఖం
    కళ్ళ కోసం
    చర్మం
    పాదాల కోసం
    చేతుల కోసం
    నలుగు వెలుగులు
    పెదవుల కోసం
    ముడతలు తగ్గడం కోసం
    జుట్టు నల్లగా ఉండాలంటే..
    చుండ్రు నివారణ కోసం
    పసుపుతో సౌందర్యము ఎలా వస్తుంది?
    కొవ్వును కరిగించే నువ్వులు
    అందానికి బీట్‌రూట్‌
    చుండ్రుకు ఇంటి వైద్యం
    కరివేపాకుతో కేశ సౌందర్యం
    వెంట్రుకలకు ట్రిమ్మింగ్ అవసరమే!

    RSS Feed

    Enter your email address:

    Delivered by FeedBurner


Powered by Create your own unique website with customizable templates.