నలుగు పిండి తయారుచేసే విధానం:
పసుపు, ఆవపిండి, ఉలవ పిండి, మంచి గంధం, మారేడు పత్రాల పొడులను ఉపయోగించవచ్చు. వీటితో పాటు బియ్యపు పిండి, శనగపిండి గరుకుగా పొడి చేసి కలపాలి. ఈ పొడిలో నువ్వులనూనె కలపాలి. నలుగు పిండి మరీ తడిగా ఉండకూడదు. ఒంటికి పట్టించి, వ్యతిరేక దిశలో మర్ధనా చేయాలి. దీని వల్ల ఒంటికి అంటుకున్న మురికి, అవాంఛిత రోమాలు, మృతకణాలు తొలగిపోతాయి. చివర్లో కొంచెం నువ్వుల నూనె అద్దుకొని మేనికి రాసుకోవాలి. లేదంటే ఆవుపాల మీద మీగడ వాడుకోవచ్చు. వారానికి ఒకసారైనా ఒంటికి నలుగు పెట్టుకుంటే చర్మం మృదువుగా, కాంతిమంతంగా తయారవుతుంది.