telugutaruni.weebly.com
  • Home
  • వంటకాలు (Cookeries)
    • ఫలహారాలు (Tiffins)
    • శాకాహారం (Veg)
    • బియ్యపు వంటలు (Rice items)
    • మాంసాహారం (Non-Veg)
    • పచ్చళ్ళు (chutneys)
    • వడియాలు
    • పండ్ల రసాలు (Juices)
    • స్వీట్స్ (Sweets)
    • చిరుతిళ్ళు (Snacks)
    • గ్రేవీ ఐటమ్స్
    • సూప్స్ (Soops)
    • కొత్త కొత్తగా
  • చిట్కాలు (Tips)
    • వంటింటి చిట్కాలు ( Kitchen Tips)
    • ఆరోగ్య చిట్కాలు (Health Tips)
    • సౌందర్య చిట్కాలు (Beauty Tips)
  • మహిళా లోకం
    • ఆదర్శ మహిళలు
    • శభాష్ మహిళా..
  • విహారయాత్ర

జంక్ ఫుడ్డా ........ జంకాల్సిందే!

10/23/2013

1 Comment

 
Picture
            మతుల ఆహారం అందరికీ అవసరమేకానీ, ఎదుగుతున్న టీనేజర్లకు ఇంకా అవసరం. ఆకలేస్తే మెక్డికో, పిజ్జా కార్నర్‌కో వెళ్ళడం, టైమ్‌పాస్‌కి ఆలూ చిప్స్‌, కూల్‌డ్రింక్స్‌ వంటి జంక్‌ఫుడ్స్‌ తీసుకోవడం టీనేజర్లు అలవాటు చేసుకుంటున్నారు. జంక్‌ఫుడ్‌కు అలవాటు పడటం చాలా తీవ్ర పరిణామాలకు దారితీస్తోందని డాక్టర్లు, పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ప్రయత్నిస్తే ఈ అలవాటు నుండి బయట పడటం అంత కష్టమేమీ కాదు.




 జంక్‌ ఫుడ్‌లో ఏముంటాయో చూడండి
ఇంట్లో వండిన ఆహారంతో పోలిస్తే ,
అధికంగా కొవ్వు
ఎక్కువ ఉప్పు శాతం
ఎక్కువ చక్కెర శాతం
తక్కువ పీచు పదార్థం
చాలా తక్కువ స్థాయిలో కాల్షియం, ఐరన్‌ లాటి పోషకాలు


ఇలా అలవాటు చేసుకోండి
  • కూల్‌డ్రింక్స్‌కు బదులు మంచినీరు ఎక్కువ తీసుకోండి. చక్కెర శాతం ఉన్న నానారకాలైన పానీయాల కంటే నిమ్మకాయ నీళ్ళు, మజ్జిగ, కొబ్బరినీళ్లు తీసుకోవడం మంచిది.
  • ఇంట్లో ఉన్నప్పుడు, టీవీ చూస్తూనో, కంప్యూటర్‌ ముందు కూర్చునో చిప్స్‌ వంటి స్నాక్స్‌ తినడం కన్నా ఇంట్లో రక రకాల పండ్లను నిలువ పెట్టుకుని, జంక్‌ఫుడ్‌ బదులు పండ్లు తినడం అలవాటు చేసుకోవాలి.
  • ఉదయంపూట ఎట్టి పరిస్థితులలో బ్రేక్‌ఫాస్ట్‌ తినకుండా ఉండకూడదు.విటమిన్లు, మినరల్స్‌, ఫైబర్‌తో కూడిన బ్రేక్‌ఫాస్ట్‌ తింటే జంక్‌ఫుడ్‌ తినాలన్న కోరిక తగ్గుతుంది.
  • ఇంట్లో వండే సాంప్రదాయ వంటలే కాక పోషక విలువలు కలిగిన మీకు నచ్చిన వంటకాలు తయారుచేసుకుని తినడం వలన కూడా జంక్‌ జోలికి వెళ్ళకుండా ఆపవచ్చు.
  • ఎప్పుడూ తినే జంక్‌ఫుడ్‌ ఔట్‌లెట్స్‌ మార్చి, ఆరోగ్యకరమైన ఆహారం దొరికేచోటును ఎంచుకోవడానికి స్నేహితులను ఒప్పించండి.
  • ఫ్రెండ్స్‌తో టైమ్‌పాస్‌ చేయడానికి ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు కాకుండా వేరే అనువైన ప్రదేశాలు ఎంచుకోవడం వల్ల అనవసరంగా జంక్‌ఫుడ్‌ను తీసుకోకుండా ఆపచ్చు.
  • స్కూల్‌, లేదా క్యాంటీన్‌ నిర్వాహకులతో మాట్లాడి, జంక్‌ ఆహారం బదులు హెల్దీ స్నాక్స్‌ అమ్మేలా చూడాలి,
  • సూపర్‌మార్కెట్‌ నుండి కొనే సరుకుల్లో ప్రాసెస్డ్‌ఫుడ్‌ ఇంటికి తేకుండా ఉండేలా నియమం పెట్టుకోవాలి.

ఆలోచనా తీరు మారాలి
  • ఆరోగ్యకరమైన ఆహారం చాలా ఖరీదు ఎక్కువై ఉంటుందనుకుంటాం. అది నిజం కాదు. జంక్‌ ఆహారపు ధరను ఇతర ఆరోగ్యకరమైన ఆహారంతో పోల్చి చూస్తే ఆ విషయం తెలిసిపోతుంది.
  • ఆరోగ్యకరమైన ఆహారం రుచి లేకుండా ఉంటుందనుకుంటాం. కానీ పోషక విలువలు కలిగిన ఆహారం కూడా రుచికరంగా తయారుచేసుకోవచ్చు.
  • ఆరోగ్యకరమైన ఆహారం అంటే కేవలం పండ్లు, ఎక్కువ ధర కలిగిన కూరగాయలు మాత్రమే కాదు, తృణధాన్యాలు, ఆకుకూరలు, జామ, ఉసిరి, నేరేడు వంటి ఎన్నో తక్కువధరకే దొరికే ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలు ఉన్నాయి.

తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి

  • జంక్‌ఫుడ్‌ తీసుకునే టీనేజర్లు, జంక్‌ఫుడ్‌ తీసుకోని వారికంటే అధిక బరువు కలిగి ఉండే అవకాశం ఉంది.
  • జంక్‌ఫుడ్‌ తినడం అలవాటు మొదలైతే ఒక వ్యసనం లాగా పట్టి పీడిస్తుంది. చురుకుదనం తగ్గిపోయి మందకొడితనం ఏర్పడుతుంది.
  • ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్ల వలన ఎదుగుతున్న వయస్సులో శరీరానికి కావలసిన కాల్షియం, ఐరన్‌ వంటి పోషక పదార్ధాలు అందడంతో జ్ఞాపకశక్తి పెంపొంది, అన్నింటా ముందు నిలుస్తారు.

1 Comment

నిత్యావసర వస్తువులతో తేలికైన ఆరోగ్యం 

10/9/2013

0 Comments

 
ఏమాత్రం అనారోగ్యంగా అనిపించినా కొందరు మందులు వాడుతుంటారు. అలాంటి వారికి ఇది అలవాటుగా మారి పోతుంది. ఇలా ఎక్కువకాలం వాడితే ఇతర రకాల ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ పరిస్థితిని నివారించడానికి మనకు ఎల్ల ప్పుడూ అందుబాటులోఉండే నిత్యావసరాలు ఉపయోగపడతాయి. వీటిని ఉపయోగిస్తే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

వెల్లుల్లి : మనం సాధారణంగా చిన్నచిన్న గాయాలకు ఆయింట్‌మెంట్లు వాడుతుంటాం. వెల్లుల్లి రెబ్బను చితక్కొట్టి గాయంపై రుద్దితే బాక్టీరియా దరిచేరకుండా నిరోధించవచ్చు. ఇన్‌ఫెక్షన్లు కూడా సోకవు. మన శరీర తత్వానికి వెల్లుల్లి సరిపడుతుందో లేదో ముందుగా పరీక్షించుకోవాల్సిన అవసరం  ఉంది. డయేరియా, అధిక రక్తపోటు వంటి సమస్యలను వెల్లుల్లి వినియోగంతో అదు పులో ఉంచుకోవచ్చు.

అల్లం : కొందరు బస్సుల్లో ప్రయాణి స్తున్నప్పుడు వాంతులు చేసుకోవడం, కళ్ళు తిరిగినట్లు అనిపించడం వంటి సమస్య లతో బాధపడుతుంటారు. అందువల్ల ప్రయా ణాలంటేనే వారు భయపడిపోతుంటారు. ఇలాంటివారు ప్రయాణానికి అరగంటలోపు టేబుల్‌ స్పూన్‌ అల్లం మిశ్రమాన్ని తీసు కోవాలి. వేడివల్ల వచ్చే అనారోగ్యాలను దూరం చేయడంలో ఇది ఉపయోగపడు తుంది. కడుపులో మంట ఉన్నా, దురదతో బాధపడుతున్నా, ఉదయంపూట వికారంగా ఉన్నా ఈ చిట్కాను పాటిస్తే ఫలితం  ఉంటుంది.

ధనియాలు : బిజీగా ఉండే జీవన విధానం కారణంగా సరైన సమయంలో సరైన ఆహారం తీసుకునే వీలు చాలా మందిలో ఉండటం లేదు. ఇందువల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు దెబ్బతింటుంది. ఇందువల్ల ఆహారం జీర్ణం కాకపోవడంతో పాటు ఇతర రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ సమస్యతో బాధపడుతున్నవారు దీనిని అధిగమించడానికి ధనియాలతో చేసిన కషాయం త్రాగాలి. నెలసరి సమస్యలకు, రక్తహీనత నివారణకు, కాలేయం పనితీరు సక్రమంగా ఉండేలా చూడటంలో ధని యాలు కీలక పాత్ర పోషిస్తాయి.

0 Comments

విటమిన్ 'డి' తక్కువైతే..

10/4/2013

0 Comments

 
Picture
                  శరీరంలో విటమిన్ 'డి' తక్కువైతే వచ్చే నష్టాలు అన్నీఇన్నీ కావు. దీన్ని పెంచుకోవడానికి.. పాలు తాగడం, సప్లిమెంట్లు తీసుకోవడం, ఉదయపు ఎండ పడేలా చూసుకోవడం అందరూ చేసే పనే!

              ఇవే కాకుండా మరికొన్ని రకాల తిండి వల్ల కూడా 'డి' విటమిన్‌ను పెంచుకోవచ్చు.
  • రెండ్రోజులకు ఒకసారి చేప తింటే మంచిది. సాల్మన్, టునా వంటి చేపల్లో డి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. అయితే ఈ చేపలు మనకు దొరక్కపోయినా ఫర్వాలేదు. సాధారణ చేపల్ని తిన్నా ఈ ఫలితం లభిస్తుంది.
  • పుట్టగొడుగులతో కూడా 'డి'ని పొందవచ్చు.
  • ఆరంజ్‌జ్యూస్‌లోనూ ఈ రకమైన విటమిన్ దొరుకుతుంది అంటున్నారు పోషకాహార నిపుణులు.
  • అందరికీ అందుబాటులో ఉండే గుడ్డు కూడా ఇందుకు ఉపకరిస్తుంది.
  • మాంసం తీసుకునేవాళ్లయితే.. లివర్ తింటే మంచిది.

0 Comments

త్వరగా నిద్రపోండి...

10/3/2013

0 Comments

 
Picture
                 ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలనుకుంటున్నారా? రూపాయి ఖర్చవకుండా ఇంట్లోనే పాటించే పద్ధతి ఒకటుంది చెప్పమంటారా? అదేంటంటే - ఉదయాన్నే నిద్ర లేవడం. ఈ ఒక్క అలవాటుతో జీవితం మారిపోతుందంటే నమ్మండి. దీనివెనక ఉన్న కెమిస్ట్రీ ఏమిటో తెలిస్తే ఈ అలవాటును పాటించడం తప్పనిసరి చేసుకుంటారు.

                    మన మెదడులో ఉండే వినాళ గ్రంధి (పీనియల్ గ్లాండ్) విడుదల చేసే మెలటోనిన్ నిద్రను నియంత్రిస్తుంది. సూర్యరశ్మి ఉంటేనే వినాళ గ్రంధి బాగా పనిచేస్తుంది. ఉదయాన్నే లేవడం వల్ల వినాళ గ్రంధి శక్తిమంతమవుతుంది, దాంతో శరీర గడియారం చురుగ్గా మారి జీవక్రియలన్నీ సరిగ్గా పనిచేస్తాయి. మెలటోనిన్ మన శరీర వయసును కూడా నియంత్రిస్తుంది. అందువల్ల అది బాగా పనిచేస్తేనే వయసుకు తగినట్టు అందంగా ఉంటాం. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఇంకోటుంది. వ్యర్థపదార్థాలను ఉదయం పదింటి లోపల శరీరం బయటకు పంపేస్తుంది. అలా జరిగినప్పుడే శరీరం తేలిగ్గా, హాయిగా ఉంటుంది. ఉదయాన్నే లేవకపోతే, వ్యర్థపదార్థాలు పెద్ద పేగుల్లో ఎక్కువసేపు నిలవ ఉండిపోతాయి.

                  వాటితో కలిసిన నీటిని శరీరం మళ్లీ పీల్చుకునే ప్రయత్నం చేస్తుంది. మొత్తమ్మీద పొద్దెక్కి లేవడం అంటే మన శరీరాన్ని మనమే విషతుల్యం చేసేస్తున్నట్టు, తద్వారా రోగాల పుట్టగా మార్చేస్తున్నట్టు. త్వరగా పడుకోవడం కూడా శరీరానికి మేలు చేసే అలవాటే. దీనివల్ల శరీరంలోని భాగాలన్నిటికీ విశ్రాంతి లభిస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. రాత్రి 8 నుంచి 11 గంటల మధ్యలో శరీరం నీటిని త్వరగా పీల్చుకుంటుంది. దానివల్ల చర్మం తేమగా ఉండి, మనం వయసుకు తగినట్టు కనిపిస్తాం. ఇంకెందుకు ఆలస్యం, త్వరగా పడుకుని, త్వరగా నిద్రలేస్తే వచ్చే లాభాలను అందుకోండి.

0 Comments

బరువు తగ్గించే మసాలా!

10/2/2013

0 Comments

 
Picture
                           ఏం తింటే బరువు తొందరగా తగ్గుతుంది, మందులేమైనా ఉన్నాయా, యోగా చేస్తే మంచిదేమో... ప్రపంచంలో ఎక్కువమంది ప్రజల ఆలోచనలు ఇలా బరువు చుట్టూనే తిరుగుతున్నాయి. కాని అంతగా ఆలోచించాల్సిన పనిలేకుండా వంటగదిలో ఉండే మసాలాదినుసుల్లోని ఔషధగుణాలతో బరువు తగ్గించుకోవచ్చు తెలుసా. అవేంటంటే...

* నల్లమిరియాల్ని కొన్ని శతాబ్దాలుగా గ్యాస్ట్రో ఇంటస్టయినల్ సమస్యల్ని తగ్గించుకునేందుకు ఉపయోగిస్తున్నారు. వీటిలో ఉండే పెపరీన్ కొవ్వుతో ఫైట్ చేస్తుంది. కొత్తగా కొవ్వు కణాలు ఏర్పడకుండా అడ్డుపడుతుంది.

* కొవ్వు కరిగించి, బరువు తగ్గించే మరో మసాలా దినుసు దాల్చిన చెక్క. బరువు తగ్గించడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది ఇది.


* జీలకర్ర రుచి గురించి కంటే ఇందులో ఉండే ఔషధగుణాల గురించి మాట్లాడుకోవాలి. ఇది రక్తహీనత, మొలలు, మతిమరుపు, నిద్రలేమి వంటి సమస్యలతో పాటు జీర్ణ సంబంధిత సమస్యల్ని కూడా దూరం చేస్తుంది. భోజనంలో లేదా భోజనం తరువాత దీన్ని తింటే రక్తం శుభ్రపడుతుంది. జీర్ణక్రియ సరిగా జరుగుతుంది. బరువు తగ్గుతారు.

* కొవ్వు త్వచాలు కొత్త రక్తనాళాల పెరుగుదలను అడ్డుకోకుండా అల్లం అడ్డుపడుతుంది. అంటే ఊబకాయాన్ని అరికట్టడంలో బాగా పనిచేస్తుందన్నమాట. దీంతోపాటు కొవ్వు కరిగించే గుణం, జీవక్రియలను వేగవంతం చేసే గుణాలు ఇందులో ఉన్నాయి.

* పసుపులో ఉండే కర్‌క్యుమిన్ అనేది యాంటీ ఇన్‌ఫ్లెమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉంటుంది. ఈ గుణాలు రక్తనాళాల పెరుగుదలకు అడ్డుపడే కొవ్వు త్వచాలు విస్తరించకుండా అరికడతాయి. అచ్చం అల్లంలాగానే ఇది కూడా పనిచేస్తుంది. బరువు పెరగకుండా అరికడుతుంది.

0 Comments

తాగండి నిమ్మరసం

10/1/2013

0 Comments

 
Picture
  • - నిమ్మ రసానికున్న సుగుణాలను లెక్కపెడితే రెండు చేతులకున్న వేళ్లు సరిపోవు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం గ్లాసుడు గోరువెచ్చని నీళ్లలోకి కాస్త నిమ్మరసం కలుపుకుని తాగితే అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది.
    -మానసిక ఒత్తిళ్లను తగ్గించి, కొత్త ఉత్సాహాన్నిచ్చే శక్తి నిమ్మకు పుష్కలం.
  • - కాలేయంలో పేరుకున్న విషతుల్యాలను తొలగిస్తుంది. కాలేయ జీవితకాలాన్ని పెంచుతుంది.
  • - నిమ్మలో దొరికినంత 'సి' విటమిన్ మరే పండులోను లభించదు. వయసుపెరుగుతున్నా చర్మాన్ని ముడుతలు పడనీయదు. మేనిఛాయ మెరుగవుతుంది. ఇది యాంటీసెప్టిక్‌గా పనిచేయడం వల్ల చర్మ సమస్యలూ దరిచేరవు.
  • - ఎప్పుడైనా కలుషిత నీటిని తాగినప్పుడు గొంతువాపు వస్తుంది. దీనికి సరైన విరుగుడు నిమ్మరసం. వెంటనే ఉపశమనాన్ని ఇస్తుంది.
  • - పంటినొప్పిని తగ్గించే శక్తీ నిమ్మకు ఉంది. పళ్ల నుంచి వెలువడే రక్తస్రావాన్ని అడ్డుకుంటుంది. లెమన్ వాటర్ గమ్ నమిలినా ఈ ఫలితం కనిపిస్తుంది.
  • -నిమ్మలో యాంటీ ఆక్సిడెంట్స్ దండిగా ఉంటాయి. చౌకధరలో దొరికే నిమ్మ ద్వారా విలువైన వీటిని పొందవచ్చు.


0 Comments

ఆరోగ్య చిట్కాలు 

9/28/2013

0 Comments

 
  • పనసతొనలు తేనెలో నానబెట్టి తింటూ ఉంటే నరాలబలహీనత, దోషాలు   తొలగిపోయి బలం,శక్తి పొందుతాయి.
  • - జాజికాయ గంధం అరగతీసి పిల్లల ముఖంపై వచ్చే తెల్లమచ్చలపై రాస్తే మచ్చలు మాయమవుతాయి.
  • - వాము బాగా నూరి బెల్లంలో కలిపి చిన్న చిన్న గోళీలుగా చేసి ఒకటి, రెండు ఉండలు తింటే కడుపులో వాయువుని నివారించవచ్చు.
  • - తేలుకుట్టిన వెంటనే శుభ్రపరిచిన తులసి ఆకులు కుట్టినచోట రాసి, కొద్దిగా నమిలిమింగితే బాధ నుండి ఉపశమనం పొందవచ్చు.
  • - నీటిలో అల్లం వేసి మరిగించి కషాయం చేసి ఉదయాన్నే తీసుకొంటూ ఉంటే పళ్లు జివు్వనలాగడంవంటి పంటిసమస్యలు తగ్గిపోతాయి.
0 Comments

నల్లమిరియాలు

9/27/2013

0 Comments

 
Picture
                   ఇది ఎక్కువగా మలబార్‌, మైసూర్‌, కొచ్చిన్‌ ప్రాంతాల్లో పండుతుంది. గ్యాస్‌ట్రబుల్‌, వాతం, కీళ్లనొప్పులు మొదలైనవి తగ్గిస్తుంది.
  • దగ్గు, చెవిలోపోటు, కామెర్లు మలేరియా జ్వరం, అజీర్తి, విరేచనాలు, పక్షవాతానికి ఔషధంగా ఉపయోగపడుతుంది. 
  • మిరియాల నూనెతో వేడినీరు కలుపుకుని స్నానం చేయడం వలన చెవుడు, దురదలు, పక్షవాతం, కీళ్లనొప్పులు, ఆస్తమా కలవారికి ఉపశమనం లభిస్తుంది.
  • నల్లమిరియాలు మరుగుతున్న నీటిలో వేసుకుని కషాయంగా చేసుకుని తాగితే గొంతులో గరగర, గొంతులో ఏదో రాసుకున్నట్లుండటం, గొంతుపూత తగ్గుతుంది.
  • అదేవిధంగా మలేరియా జ్వరానికి మిరియాలు, శొంఠి, తులసి, పంచదార కలిపి తీసుకుంటే తగ్గిపోతుంది.
  • నల్లమిరియాలు, ఉప్పు, ఉల్లిపాయ సమపాళ్లుగా తీసుకుని బాగా నూరి చుండ్రు, పేలు, వెంట్రుకలు రాలుతున్న ప్రదేశంలో రాసుకుంటే పేలు, చుండ్రు తగ్గిపోతాయి. వెంట్రుకలు కూడా బాగా పెరుగుతాయి.
  • మిరియాలు, శొంఠి, ఉప్పు, మిరపకాయలు సమభాగాలుగా తీసుకుని పొడిచేసి పూటకు ఒక స్పూన్‌ చొప్పున సేవిస్తే అజీర్తి విరేచనాలు, కడుపునొప్పి తగ్గిపోయి ఆకలిని పెంచుతుంది.

0 Comments

ఆలు తినేందుకు ఐదు కారణాలు...

9/24/2013

0 Comments

 
Picture
                        'డైటింగ్‌లో ఉన్న వాళ్లు ఆలూని ఆమడ దూరంలో ఉంచాలి', 'డయాబెటిక్ ఉన్న వాళ్లు దాని పేరే ఎత్తకూడదు' అని చాలాసార్లు చదివే ఉంటారు. అయితే ఆ అభిప్రాయాన్ని మెదడులో పూడ్చి పెట్టేసి ఈ విషయాన్ని ఒకసారి చదవండి. "పలు కారణాల వల్ల 'సే నో టు పొటాటో' అనే వాళ్లందరూ పోషక విలువల్ని చేతులారా దూరం చేసుకుంటున్నట్టే. సరైన పద్ధతిలో తింటే ఆలు వల్ల జరిగే మేలే ఎక్కువ'' అంటున్నారు క్లినికల్ న్యూట్రిషనిస్ట్ ఇషి ఖోస్లా.

                      "రోజుకి 40 గ్రాముల ఆలూని రెండో ఆలోచన లేకుండా తినొచ్చు. కాకపోతే తీసుకునే డైట్‌ని బట్టి ఈ కొలతలో కాస్త తేడా ఉంటుంది. బరువు పెరుగుతామని, డయాబెటిస్ ఉందని ఆలు తినకూడదనుకోవడం అపోహ మాత్రమే. ఆలుని ఎందుకు తినాలో చెప్పేందుకు నా దగ్గర ఐదు కారణాలున్నాయి. వాటిని చెప్పేముందు వంద గ్రాముల ఆలులో ఏమేమి ఉంటాయో తెలుసుకోవడం ముఖ్యం. 97 కిలో కాలరీల శక్తి, 1.6 గ్రాముల ప్రొటీన్స్ ఉంటాయి. కొవ్వు 0.1, కార్బొహైడ్రేట్‌లు - 22.6, ఐరన్ 0.48 మిల్లీగ్రాములు, విటమిన్ సి 17 మిల్లీగ్రాములు, పీచు 0.4 గ్రాములు ఉంటుంది.

ఆలు తినేందుకు ఐదు కారణాలు...
  •  - ఆలు అధిక పోషకాల్ని కలిగి ఉండడమే కాకుండా. సహజ శక్తిని అందిస్తుంది. సంక్లిష్ట కార్బొహైడ్రేట్‌ల (స్టార్చ్)ని అధికంగా కలిగి ఉంటుంది. ఆలులో తేలికగా శోషణమయ్యే కార్బొహైడ్రేట్‌లు ఉంటాయి. ఒకే బరువు ఉన్న బ్రెడ్‌తో పోలిస్తే ఆలూలో కార్బొహైడ్రేట్ రెండింతలు తక్కువగా ఉంటుంది. మినరల్స్, బి గ్రూప్ విటమిన్లు, బీటాకెరోటిన్, విటమిన్-సిలతో పాటు నాణ్యమైన ప్రొటీన్లతో నిండి ఉంటుంది ఆలు. ఇందులో ప్రొటీన్ ఏడు శాతం ఉండడమే కాకుండా ప్రొటీన్ల నిర్మాణానికి అవసరమైన అమినో ఆమ్లాలు కూడా ఉంటాయి. ఇవి శరీరం తనంతట తానుగా తయారుచేసుకోలేనివి.
  • - ఆలూని ఉడికించిన పద్ధతి బట్టే కొవ్వు తయారవుతుంది. ఆలూని నూనెలో వేగించినపుడు, గ్రేవీల్లో వేసి ఉడికించినపుడు లేదా వెన్న, మీగడ వంటి వాటితో కలిపినప్పుడు మాత్రమే కొవ్వు పదార్థాల్ని ఉత్పత్తి చేస్తుంది. అదే ఆలూని విడిగా ఉడికించుకుని తింటే కొవ్వు ఊసే ఉండదు.
  • - ఆలూ తినడం వల్ల హైపర్‌టెన్షన్ (అధిక రక్త పీడన సమస్యల్ని) తగ్గుతుంది. అరటిపండ్లతో పోలిస్తే ఆలూలో పొటాషియం మెండుగా ఉంటుంది. సోడియం చాలా తక్కువ ఉంటుంది. బ్రెడ్, అన్నంలతో పోలిస్తే ఆలూలో రక్తంలో చక్కెర శాతాన్ని పెంచే గుణం చాలా తక్కువ. అందుకని మధుమేహులు కూడా ఆలూని చక్కగా లాగించేయొచ్చు. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆలూని తినాలనుకున్నప్పుడు మీరు తీసుకునే ఆహారంలో తక్కువ కాలరీలు ఉండే ఇతర పదార్థాలు చూసుకోవాలి.
  • - పచ్చి బంగాళాదుంప రసంలో ఔషధ విలువలు మెండుగా ఉన్నాయి. ఈ రసం తాగితే జీర్ణసంబంధిత సమస్యలు తలెత్తవు. అజీర్ణం, అల్సర్లు, కాలేయ సంబంధిత వ్యాధులు, మూత్రాశయంలో రాళ్లు, మల బద్ధకం వంటి సమస్యలు దరిచేరవు. ఆలు మంచి యాంటాసిడ్‌గా పనిచేస్తుంది.
  • - విటమిన్ సి, బి6, ఐరన్, విటమిన్ల ప్యాకేజి ఆలు. ఇందులో యాంటాక్సిడెంట్‌లు కూడా బాగానే ఉంటాయి. ఇవి శరీరంలోని కణాలను మరమ్మత్తు చేయడమే కాకుండా నాశనం కాకుండా కాపాడతాయి కూడా'' అని చెప్పారు ఇషి.

ఆరోగ్యంగా తినేందుకు

ఆరోగ్యకరమైన పద్ధతిలో ఆలుని ఎలా తినాలి... అని ఆలోచిస్తున్నారా. అందుకు కొన్ని సూచ నలు చేశారు న్యూట్రిషనిస్ట్ రాఖీ.
  • -ఆలుని నూనె, వెన్నల్లో వేసి లేదా వేరే కూరలతో కలిపి వండుకుని తినడాన్ని మానేయండి. నీళ్లలో లేదా ఆవిరికి ఉడికించో లేదా గ్రిల్, రోస్ట్, బేక్ చేసి తినండి.
  • - కారంకారంగా తినడాన్ని ఇష్టపడే వాళ్లు ఆలుని మొదట మసాలా దినుసులతో కలిపి నూనె వేయకుండా వేగించి తరువాత కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకుని తినొచ్చు.
  • - ఆలూని తొక్క తీయకుండా తినాలి. ఎందుకంటే తొక్కలో పీచు, ఫ్లేవనాయిడ్స్, ఇతర పోషకాలు ఉంటాయి. ఆలూ పైన టాపింగ్‌కి వాడే పదార్థాల్లో కొవ్వు, ఉప్పు, కాలరీలు తక్కువగా ఉండాలి. చిప్స్, ఫింగర్స్ వెంట పడడం ఆపేసి ఆమె చెప్పిన పద్ధతిలో ఆలు తిని ఆరోగ్యంగా ఉండండి.

0 Comments

ఆరోగ్యానికి యాలకులు

9/19/2013

0 Comments

 
Picture
                         తీపి పదార్థాలకు రుచినీ, సువాసననూ ఇచ్చే యాలకులు ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయి. జీర్ణ సంబంధ సమస్యలున్నప్పుడు యాలకుల్ని ఏదో ఒక రూపంలో తీసుకునేలా చూడాలి. ఇవి అల్లంలా పని చేసి, ఆ సవుస్యల్ని తగ్గిస్తాయి. వికారం, కడుపుబ్బరం, ఆకలి మందగించడం లాంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడూ వీటి వాడకం మేలు చేస్తుంది అంటున్నారు నిపుణులు. శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో దీన్ని మించిన సుగంధ దినుసు లేదని అధ్యయనాలు చెబుతున్నాయి. నోటి దుర్వాసనను తగ్గించడమే కాదు... నోట్లో అల్సర్లూ, ఇన్‌ఫెక్షన్ల లాంటివి ఉన్నప్పుడు రెండు యాలకుల్ని నోట్లో వేసుకుంటే... ఆ సమస్యలు తగ్గిపోతాయి.
యాలకుల్లో పీచు పదార్థం ఉంటుంది. దీన్ని తరచూ తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది.
జలుబూ, దగ్గు లాంటివి ఇబ్బంది పెడుతున్నప్పుడూ యాలకులను ఏదో ఒక రూపంలో తీసుకుంటే అవి తగ్గుతాయి.

0 Comments
<<Previous

    Author

    నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ  మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో  ఒక  తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం. 

    Archives

    October 2013
    September 2013
    May 2013

    Categories

    All
    ఆలు తినేందుకు ఐదు కారణాలు...
    జంక్ ఫుడ్డా ........ జంకాల్సిందే!
    మీకు తెలుసా...
    హైబి.పి తగ్గాలంటే
    మెదడు
    కడుపు
    కడుపు
    కాలిన గాయాలకు
    బరువు తగ్గించే మసాలా!
    జలుబు తగ్గడంకోసం
    గోళ్ళు బీటలు వారుతుంటే..
    తాగండి నిమ్మరసం
    ఆరోగ్య చిట్కాలు
    గడ్డలు తగ్గడానికి
    త్వరగా నిద్రపోండి...
    ఆరోగ్యం - మంచు ముక్కల ఉపయోగం
    విటమిన్ 'డి' తక్కువైతే..
    దగ్గుతో బాధపడేవారు..
    చెవిపోటు తగ్గాలంటే
    నిమోనియా పేషెంట్స్ కి
    మలబద్దకం తగ్గాలంటే..
    ఎక్కిళ్ళు తగ్గాలంటే
    నిత్యావసర వస్తువులతో తేలికైన ఆరోగ్యం
    అజీర్ణంతో బాధపడేవారు..
    తలనొప్పికి
    పులిపుర్లు తొలగిపోవాలంటే
    ఆరోగ్యానికి యాలకులు
    నల్లమిరియాలు
    కొలెస్ట్రాల్ ని అదుపు చేయడానికి
    ఆర్థ్రయుటిక్ నొప్పుల నుండి ఉపశమనం కోసం
    ఇస్నోఫీలియాతో బాధపడేవారు..

    RSS Feed

    Enter your email address:

    Delivered by FeedBurner


Powered by Create your own unique website with customizable templates.