- - చెయ్యి తెగి లేదా దెబ్బ తగిలి రక్తం వస్తున్నప్పుడు చల్లని ఫ్రిజ్ వాటర్‌తో ఆ భాగాన్ని నెమ్మదిగా కడగండి. రక్తం ఆగిపోతుంది.
- - తలుపు సందులోనో లేదా మూతవేసేటప్పుడో చేతివేలు పడి నలిగి, నల్లగా రక్తం పేరుకుని చాలా బాధ కలుగుతుంది. ఆ ప్రదేశంలో ధారగా ఐస్‌వాటర్ పోయండి. ఇంకా బాధ తగ్గకుంటే వేలును రెండు నిమిషాలు డీప్‌ఫ్రిజ్‌లో పెట్టి ఉంచండి. బాధ తగ్గుతుంది. నల్లమచ్చపోతుంది.
- - ఒంటి నొప్పులకు, బెణుకులకు వేడినీటి కాపడం పెట్టినట్లుగానే ఐసుముక్కలను ఒక గుడ్డలో వేసి కాపడం పెట్టండి. బాధలు త్వరగా తగ్గుతాయి. రోగికి ఇష్టంగా కూడా ఉంటుంది.
0 Comments
ఇస్నోఫీలియాతో బాధపడేవారు..
రోజూ పడుకోబోయే ముందు రెండు చుక్కల లావెండర్ ఆయిల్ ను దిండుపై వేసుకొని పడుకోవాలి. చెవిపోటుగా ఉన్నప్పుడు హెయిర్ డ్రయర్ తీసుకొని ఫ్యాన్ ను తక్కువ స్థాయిలో పెట్టుకొని చెవి చుట్టూ ఆ గాలిని పట్టిస్తుంటే చెవిపోటు నుండి రిలీఫ్ వస్తుంది.
మలబద్దకంతో బాధపడేవారు..
రొజూ పడుకోబోయే ముందు రెండు పైనాపిల్ స్లైసులను తింటే ఉదయానే మలబద్దకం సమస్య ఉండదు. దగ్గుతో బాధపడేవారు..
గార్లిక్ లెమన్ టీ త్రాగితే త్వరగా ఉపశమనం వస్తుంది. ఒక వెల్లుల్లి రెబ్బను చితగ్గొట్టి నిమ్మరసం పిండి ఈ మిశ్రమాన్ని ఒక గంట తర్వాత ఒక కప్పు నీటిలో వేసి మరిగించి చల్లార్చి ఒక టీస్పూన్ తేనె కలుపుకొని త్రాగాలి. అజీర్ణంతో బాధపడేవారు.. జింజర్ తీ త్రాగితే చాలా మంచిది. ఒక కప్పు నీటిలో 1 టీస్పూన్ చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కల్ని వేసి మరగించిన తర్వాత వేడివేడిగా పరగడుపున త్రాగితే అజీర్ణం సమస్య ఉండదు.
పావుకప్పు ఆవపిండిలో ఆరు టేబుల్ స్పూన్లు ఏదైనా పిండి కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. ఒక పలుచని వస్త్రాన్ని తీసుకొని వేడినీటిలో నానబెట్టి ఈ పేస్ట్ ను వస్త్రంపై పరిచి మిగతా క్లాత్ ను కవర్ చేసి ఈ క్లాత్ ను ఛాతిపై పెట్టుకొని ఒక టవల్ ను దానిపై కవర్ చేసి పడుకోవాలి. ఇది నిమోనియా పేషెంట్స్ కి మంచి చిట్కా.
పొత్తి కడుపులో విపరీతమైన నొప్పిగా ఉంటే..
ఒక టవల్ తీసుకొని దానిపై ఆముదం రాసి ఆ టవల్ ను పొత్తి కడుపుపై వేసుకొని దానిపై హీటింగ్ ప్యాడ్ పెట్టుకుంటే ఎంతో ఉపశమనం వస్తుంది. ఈ టవల్ ను రిఫ్రిజిలేటర్ లో దాచిపెట్టి మరలా ఎప్పుడైనా నొప్పి వచ్చినపుడు వాడుకోవచ్చు. గోళ్ళు బీటలు వారుతుంటే..
ప్రతి రొజూ పడుకోబోయే ముందు గోళ్ళకు నువ్వుల నూనె రాసుకొని పడుకోవాలి. |