ఆశయాల దారిలో అడ్డంకులు, అవాంతరాలుంటాయి... ఒంటరిని చేసి ఓడించేందుకు ప్రయత్నిస్తాయి... ఎవరోఒకరు.. ఎపుడోఅపుడు.. అడుగుముందుకే వేస్తారు... దాచపల్లి రజనీ అదేపనిచేస్తోంది... గాజుదీపాలను కాపాడుకుంటూ చీకటిని చీల్చుతోంది... పాతుకుపోయిన పాతకాలపు ఇనుపగోడను బద్దలు కొడ్తోంది.. వరంగల్ నుంచి నర్సంపేట దార్లో చిన్నగ్రామం గొర్రెకుంట. ‘ప్రారంభంలోనే ట్రాన్స్ఫార్మర్ నుంచి మలుపుతిరిగితే మా సంస్థ వస్తుంది. అక్కడ బోర్డేమీ ఉండదు.. అలాగని స్థానికులను అడిగే ప్రయత్నమూ చేయకండి ప్లీజ్.. దయచేసి అర్థంచేసుకోండి.. నేను ఫోన్లోనే అడ్రస్ చెప్పేందుకు ప్రయత్నిస్తాను. పోనీ, మీకోసం మనిషినైనా పంపుతాను..’ అని చెప్పిందావిడ ఫోన్లో. తీరా అక్కడికి చేరుకున్నాక.. గోడమీద ఎన్నేళ్లనాటిదో రంగు కనబడీకనబడనట్లుగా చిన్న పెయింటింగ్- ‘న్యూలైఫ్ హెల్పింగ్ సొసైటీ’ పేరుతో!‘ఇది అనాథపిల్లల సంస్థగానే ఈ ఏరియాలో తెలుసు. హెచ్ఐవీ బాధిత పిల్లల సంస్థ అని తెలిస్తే నేనిక్కడినుంచి ఖాళీ చేయకతప్పదు. స్థానికులను అడ్రస్ అడగవద్దన్నది అందుకే’ అని సంజాయిషీ చెబుతున్నట్టుగానే మా సందేహాలకు సమాధానం ఇచ్చింది. ‘ఈ ఆరేళ్లలో తొమ్మిదిళ్లు మార్చానిలా..’ అంటూ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లిపోయింది దాచపల్లి రజని. Read more