ఇంకా చదవండి .............
భవిష్యత్తును తీర్చిదిద్దుకొనే వయసు ఆమెది. సరదా సరదాగా గడిపేయాల్సిన రోజులవి. సరదాకు మాత్రమే కాదు సామాజికస్పృహకు కూడా ప్రాధాన్యత ఇస్తుంది ఇషిక. సోనాగచికి వెళ్లి అక్కడి పిల్లలతో గడపనిదే ఇషికాకు వారం గడవదు. అక్కడికి వెళ్లి పిల్లలకు చదువు చెబుతూ అక్షరాస్యులుగా చేయడానికి, ప్రపంచం గురించి అవగాహన కలిగించడానికి ప్రయత్నిస్తోంది...
ఇంకా చదవండి .............
0 Comments
క్యారెట్ తురుమునకు రెండు టేబుల్ స్పూన్ల గ్లిజరిన్ చేర్చి ప్యాక్‌లా వేసుకుంటే పాదాలు మృదువుగా తయారవుతాయి. అలాగే అర టీస్పూన్ పసుపు, తాజా కొబ్బరి తురుము అరకప్పు తీసుకోవాలి. ఈ రెండింటినీ బాగా కలిపి పాదాలకు పట్టించి మర్దనా చేయాలి.తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి.ఇంకా చదవండి .......
ఇరుకైన విద్యావిధానంలో మూసపోసిన చదువులు, ర్యాంకుల పరుగులు, ఇవేనా పరిధులు అని ప్రశ్నించుకుని అతి పిన్న వయసులోనే, ఆసక్తి, నైపుణ్యాన్ని సృజనతో ముడిపెట్టి విజయపథంలో సాగుతోన్న యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్ హర్షిత వెన్నెల. ఆ విజయప్రస్థానం ఆమె మాటల్లోనే...
'' నేను హైదరాబాద్‌లో సైన్స్ సబ్జెక్ట్‌తో12వ తరగతి చదువుతున్నాను. స్కూల్లో చదువుతున్న రోజుల నుండి కూడా మొదటి ర్యాంకు విద్యార్థిని కాకపోయినా చేసే ప్రతి పనీ సంపూర్ణంగా చేయాలని అనుకుంటాను. ఎప్పుడూ చురుగ్గా ఉంటాను. పరీక్షలు మన జ్ఞాపకశక్తిని పరీక్షించేవే కానీ మన విజ్ఞానాన్ని కాదు అని నేను పూర్తిగా నమ్ముతాను. అలాగని చదువును నిర్లక్ష్యం చేయను. పదో తరగతిలో మంచి మార్కులతో పాస్ అయ్యాను. కళ పట్ల నా ఆసక్తి నా ఏడు సంవత్సరాల వయసు నుండే మొదలైంది. మా అమ్మకు కూడా డ్రాయింగ్‌లో నైపుణ్యం ఉండటంతో ఆమె నా తొలి గురువు. నాకు స్కూల్లో సైన్స్ సబ్జెక్ట్ అంటే తగని పిచ్చి. సైన్స్‌లో రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉండేదాన్ని. నా స్నేహితుడు దుర్గేష్. అతనికీ సైన్స్, ఆర్ట్స్ అంటే ఆసక్తి. ఇద్దరం ఒకళ్ళ సందేహాలు ఒకళ్ళు తీర్చుకుంటూ ఉండేవాళ్ళం. " ఇంకా చదవండి................... పానీపూరీ మసాలా మురుకులు చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సహజంగా సమాజంలో తండ్రులందరికీ కూతుళ్లపట్ల అంతులేని మమకారం ఉంటే.. కూతుళ్లందరికీ తండ్రి పట్ల అపారమైన అనురాగం ఉంటుంది. అయితే జీవన గమనంలో అమ్మాయిలు టీనేజ్ వచ్చేసరికి తండ్రితో కొంత దూరం కావడం సహజం. కానీ నేడు ఒక్కరిద్దరు సంతానం కావడం. ఆ ఒక్కరిద్దరూ ఆడపిల్లలే అయితే తండ్రితో కూడా అరమరికలు లేకుండా ఉండడం నేటి సమాజంలో వచ్చిన ఆహ్వానించదగ్గ పరిణామం. ప్రధానంగా అమ్మాయిల జీవితంపై అత్యంత ప్రభావం చూపేవారిలో మొట్టమొదటి వ్యక్తి - తండ్రే. తండ్రులు కూడా తమ కూతుళ్ళను మానసిక స్థైర్యం, ఆత్మవిశ్వాసం నిండిన రేపటి మహిళగా అభివృద్ధి చేయాలని తపన పడతారు. అమ్మాయిల జీవితంలో తండ్రి ప్రభావం వారి ఆత్మగౌరవాన్నీ, ఆత్మ విశ్వాసాన్నీ, పురుషులపై అభిప్రాయాలనూ తెలియజేస్తుంది. ఇన్ని ఉన్నా తండ్రీ కూతుళ్ల బంధం పట్టిష్ఠంగా ఉండాలంటే కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిందే! Read more...
ఏళ్ల తరబడి రాత్రి షిఫ్టుల్లో పనిచేయడం ఆడవారి ఆరోగ్యానికి ముప్పేనంటున్నారు పరిశోధకులు. ఎక్కువకాలం రాత్రి పూట పని చెయ్యడం వల్ల టైప్ 2 డయాబెటిస్, అధిక బరువు వంటివి రావొచ్చని హెచ్చరిస్తున్నారు వారు. అలాగే పొగతాగడం వంటి వ్యసనాల బారిన పడే అవకాశమూ హెచ్చేన ట. నిరంతరంగా నిశివేళల్లో ఉద్యోగాలు చెయ్యడం వల్ల మన శరీరంలో ఉండే గడియారం (సర్కాడియన్ రిథమ్) పనితీరులో తీవ్రమైన మార్పులొచ్చేస్తాయట. దాంతో నిద్ర, శక్తి, శరీర ఉష్ణోగ్రత, హార్మోన్ల పనితీరు - అన్నిటిలోనూ మార్పులొచ్చి, ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయని తాజా పరిశోధనలు చెబుతున్నాయి.
|