Read more..............
ఆ పాప నాట్యం చేస్తే రంగస్థలమే పులకిస్తుంది. ఆ చిన్నారి అభినయానికి ప్రేక్షకలోకం పరవశిస్తుంది. బుడిబుడి అడుగుల ప్రాయంలోనే కాలికి గజ్జె కట్టి తన నాట్యకౌశలంతో అందరినీ అలరిస్తూ అద్భుతాలను సృష్టిస్తోంది చిన్నారి చందన(సంధ్య). ఈ చిన్నారి జీవితం విషాదంతో మొదలై ఇప్పుడిప్పుడే ఆనందమయంగా మారుతోంది. అందమైన భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. కష్టాలు, సుఖాలు తేడా తెలియని ఆరు సంవత్సరాల చిన్నారి చందన జీవితంలో ఎన్నో మలుపులు, ఒడిదుడుకులు.
Read more..............
0 Comments
చదువుకోకుండా పేదరికం అడ్డంకులు కల్పిస్తుందన్నది నిజమే. అలాగని దాన్నే తలుచుకుంటూ ఉండిపోతే అక్షరం ముక్క రాదు. అడుగు ముందుకు పడదు. చదువుకోవడం ఓ సవాలు అయినప్పుడు దాన్ని స్వీకరించాలి. కష్టాలను ఓర్చుకుంటూ చదువుల తీరం చేరుకోవాలి. ఉత్తరప్రదేశ్‌కి చెందిన రజియా సుల్తానా, కర్ణాటకకు చెందిన అశ్విని ఇలాగే చేశారు.రజియా సుల్తానాది మీరట్ జిల్లాలోని మారుమూల గ్రామం నాంగలకుంభ. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ పని చేస్తేనే ఇల్లు గడిచే పేద కుటుంబం వాళ్లది. అక్కడున్న చాలా కుటుంబాల మాదిరే... రజియా, ఆమె తల్లిదండ్రులకు ఫుట్‌బాల్‌లు కుట్టడమే జీవనోపాధి. ఐదేళ్ల వయసులో బడికి వెళ్లాల్సిన రజియా, అమ్మానాన్నలతో కలిసి పనికి వెళ్లడం మొదలుపెట్టింది...................... పేదరికమే పెద్ద కష్టమంటే, అశ్వినికి పుట్టుకతో చూపు లేకపోవడం మరో పెద్ద సమస్య. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుంటే కానీ పూట గడవని పరిస్థితి అశ్విని కుటుంబానిది. దాంతో అశ్వినికి వైద్యం చేయించడం, ఆలనాపాలనా ఆమె తల్లిదండ్రులకు తలకు మించిన భారమైంది. ఇటు చూపులేక, అటు కుటుంబ సభ్యుల ఆప్యాయత అందక అశ్విని మానసికంగా కుంగిపోయింది. 'ఎందుకీ జీవితం' అని బాధపడుతున్న అశ్వినికి చదువు ధైర్యాన్నిచ్చింది.......................
Read more............. ఎవరైనా అపాయంలో చిక్కుకుని ప్రాణాపాయ స్థితిలో ఉంటే- పెద్దవాళ్లు సైతం ‘మనకెందుకులే ఈ తలనొప్పి వ్యవహారం’-అని తప్పించుకుని పోవడం సర్వసాధారణం. అయతే, ఆ బాలిక అలా భావించక, ప్రాణాలకు సైతం తెగించి అయదుగురిని మృత్యుముఖం నుంచి కాపాడింది. నీట మునిగిన ఐదుగురు చిన్నారులను రక్షించి సాహసానికి ప్రతీకగా ఆ బాలిక నిలిచింది. బీహార్‌లోని కటియార్ జిల్లా మోర్సంద గ్రామంలో కొద్ది రోజుల క్రితం పనె్నండేళ్ల రోజీ ఆరా ఓ చెరువు వద్ద ఉన్నపుడు- ఆకస్మికంగా చిన్న పిల్లల కేకలు వినిపించగా అటు పరుగెత్తింది. అక్కడ కనిపించిన దృశ్యం చూశాక ఆమెకి ఒక్కక్షణం నోటమాట రాలేదు. వెంటనే ఏ మాత్రం ఆలోచించకుండా చెరువులోకి దూకేసింది. తనకన్నా వయసులో చిన్నవారైన ఆరుగురు పిల్లలు నీట మునిగిపోతున్నారని గమనించింది.
Read more...... రేవతిని ‘ఆమె’ అనలేం. ‘అతడు’ అనలేం.
అసలు ఏమీ అనుకోకుండానూ ఉండలేం. తను స్పెషల్. మనిషి మేల్, మనసు ఫిమేల్. అంతకన్నా స్పెషల్ ఏంటో తెలుసా? మళ్లీ ఇలాగే పుట్టాలని రేవతి కోరుకోవడం! తన జీవితంతో తనే ఫైట్ చేసి... తన జీవితంతో తనే ఇన్‌సై్పర్ అయ్యి... తనలాంటి వాళ్లకు ‘గ్రేట్ హ్యూమన్స్’గా గుర్తింపు తెస్తున్న రేవతి. Read more... వృత్తి, ప్రవృత్తి అందరిలోనూ వైవిద్య భరితంగానే ఉంటుంది. వృత్తిరంగాల్లో కూడా మహిళలు తమ శక్తిసామర్ధ్యాల్ని కనబరుస్తూ అందనంత ఎత్తుకి ఎదిగిపోతున్నారు. అందులో న్యాయ వృత్తి, వైద్య వృత్తి సమాజానికి ఎంతో అవసరమైనవి. వాటిలో కూడా ఊహించని శిఖరాలు అధిరోమస్తు న్నారు మహిళలు. ఏ శాస్ర్ర్తాన్ని అభ్యసించినా అందులో నిష్ణాతులై తమ కంటూ ఒక ప్రత్యేకతని, ప్రాధాన్య తని కనబరుస్తున్నారు. మగవారిని తోసిరాజని అన్ని రంగాల్లోనూ తమ ప్రతిభని చాటుకుంటున్నారు. వృత్తి పరంగా దేశవిదేశాల్లో కీర్తి శిఖరాలనందుకున్న జియా మోడీయే అందుకు ఉదాహరణ.
Read more... ముంబైలోని కామాటిపురా (Red light area) అంటేనే అందరూ ఉలిక్కిపడతారు. దేశంలోనే పెద్ద వేశ్యావాటిక అది. అక్కడ పుట్టిపెరిగిన అమ్మాయి పెద్దయ్యాక ఏమవుతుందని ఊహిస్తాం? అక్కడినుంచి వచ్చిన శ్వేతా కట్టి ఇప్పుడు అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో సీటు సంపాదించింది. శ్వేతకు పదిహేడే ళ్లు వచ్చేవరకూ ఆమె నివాసం ఒక వేశ్యాగృహం పైన. సవతి తండ్రి తాగొచ్చి బాగా కొట్టేవాడు. 'మా అమ్మ కర్ణాటకలోని బెల్గామ్ దగ్గర పల్లెటూళ్లో పెరిగింది. పేదరికం ఆమెను ఈ వృత్తిలోకి తీసుకొచ్చింది.
Read more.... ఆమె జీవితం ఆదివాసులతో పెనవేసుకునిపోయింది. వారి కన్నీళ్లు, వేదనలు, కటికదారిద్య్రం, దుర్భరజీవన విధానం ఆమెను కదిలించాయి. అందుకే వారినే తన జీవనంగా మలచుకుంది. ఆ స్పందనే ఆమెను వారికి 'మహామాత'గా చేసింది. ఒక బిడ్డకోసం తల్లడిల్లే తల్లి మనసు ఆదివాసుల ఆక్రందన విని కళ్లు చెమ్మగిల్లేవి. చీకటిలో జీవిస్తున్న ఆదివాసులకు వెలుగును నింపేందుకు ఓ అబలగా తన శక్తిసామర్థ్యాలతో ఏమీ చేయలేనని గ్రహించిన ఆ వనిత తనకున్న రచనాశక్తితో వారి వెట్టిచాకిరీని సభ్యసమాజానికి చాటిచెప్పింది. ఒక్క కలం చాలు ఈ సమాజాన్ని మార్చేందుకు అని నమ్మిన ఆమె ఆ కలమే తన ఆయుధంగా మలచుకుని అహర్నిశలు శ్రమించారు. ఆమె ఎవరో కాదు మహాశ్వేత సుగథకుమారి మృణాల్ పాండే. Read more...
తాలిబాన్‌లకు ఎదురు తిరిగిన మలాలాకు...
బతుకు చీకట్లతో పోరాడి గెలిచిన అశ్వనికి... తేడా ఏం లేదు. ఆడపిల్లల చదువు కోసం ఫైట్ చేస్తున్న మలాలాకు... తనలా అంధులైన పిల్లల చదువు కోసం సర్వీస్ చేస్తున్న అశ్వనికి... తేడా ఏం లేదు. ఇద్దరూ సమస్యలను సవాల్‌గా తీసుకున్నారు. ఇద్దరూ తమ ఈడు పిల్లలకు ఆదర్శంగా నిలిచారు. అమ్మాయిలు ఇంతింత సాహసాలు చేస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది, ఆనందం కలుగుతుంది! వారి తల్లిదండ్రులకు సెల్యూట్ చెయ్యాలనిపిస్తుంది. మలాలా గురించి ప్రపంచమంతటికీ తెలుసు. ‘మలాలా అవార్డు’ అందుకున్న అశ్వని గురించి తెలుసుకోవాలంటే... Read more... ఇంద్రజాల విద్యా ప్రదర్శనలో ఆమెకున్న పేరు అసమానమైనది. ఎక్కువగా పురుషులే కనిపించే మ్యాజిక్ కళలో ఆమె తన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకున్నారు. మరింత విశిష్టత ఏమిటంటే, ఆమె భారతదేశంలోని మొట్టమొదటి రంగస్థల మహిళా ఐంద్రజాలికురాలు. ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేయడంలో దిట్ట అయిన ప్రపంచ ప్రఖ్యాత మెజీషియన్ పి.సి. సర్కార్‌కు ఆమె స్వయానా మనుమరాలు. ఆమె పేరే - మనేకా సర్కార్.
Read more... మీకు మంచి తెలివితేటలున్నాయి. వ్యాపారంగా మలిస్తే నలుగురికి ఉద్యోగాలు సృష్టించే ఐడియాలున్నాయి. కానీ, ఐడియాను వ్యాపారంగా మలచుకునే మార్గాలు తెలియవు, వ్యాపారం నెలకొల్పేటందుకు అవసరమైన డబ్బు సమకూర్చుకునే అవకాశాలు కనిపించడం లేదు... ఇదే మీ ఆవేదన అయితే, మిమ్మల్ని ముందుకు నడిపించే ఓ వ్యక్తి ఉన్నారు. ఆవిడే లక్ష్మి వి.వెంకటేశన్.లక్ష్మి... సామాన్యుల కోసం ఆలోచించే ఒక అసామాన్యుడి కూతురు. భారతదేశపు రాష్ట్రపతిగా ఆర్.వెంకట్రామన్ దేశానికి నాయకత్వం వహించి ముందుకు నడిపితే, ఆయన కూతురు యువతకు నాయకత్వ లక్షణాలు నేర్పుతున్నారు. అందుకోసం భారతీయ యువశక్తి సంస్థను నడిపిస్తున్నారు.
Read more..... |