విద్యుత్ సరఫరాలో ఏ చిన్న సమస్య ఉన్నా 'లైన్ మేన్'ను పిలిచేవాళ్లం ఇన్నాళ్లూ. ఇక మీదట 'లైన్ విమెన్'ను పిలిస్తే చాలు, కరెంటు స్తంభాలను ఎక్కి వెంటనే సరిచేసేస్తుంది. మహారాష్ట్రలోని విద్యుత్ సరఫరా సంస్థ మన దేశంలోనే మొట్టమొదటిసారిగా 2200 మంది మహిళలను 'లైన్ విమెన్'గా నియమించి చరిత్ర సృష్టించింది. ఇంకా చదవండి
0 Comments
విద్యార్థి దశలోనే సమాజ హితం కోసం కృషి చేస్తోంది మోనికా బాడ్. పుట్టింది, పెరిగింది అమెరికాలో. ప్రస్తుతం మోనిక 12వ తరగతి చదువుతోంది. స్వదేశంలో, విదేశాలలో అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.
విజయవాడకు చెందిన యాన్ ఫణి బాడ్, విజయ దంపతులు గత 27 ఏళ్లుగా ఐటీ రంగంలో పనిచేస్తున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా నగరంలోని శాన్‌హొజేలో నివాసం ఉంటున్నారు. వీరి కూతురే మోనికా బాడ్.ఇంకా చదవండి ఆత్మవిశ్వాసాన్నే ఆలంబనగా చేసుకొని సమాజంలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునేందుకు తహతహలాడారు. అంగవైకల్యం అడ్డుగా నిలిచినా తాము కన్న కలలను సాకారం చేసుకునేందుకు, ఐదువేళ్లు నోట్లోకి వెళితేనే ముద్ద నోట్లోకి వెళుతుందని ఆ ఐదుగురు మహిళలు నిరూపించారు. ఆసరా ఇచ్చే చేతులను అందిపుచ్చుకొని కేవలం 200 చదరపుటడుగుల దుకాణంతో వారు వేసిన అడుగు నేడు స్వావలంబన దిశగా పయనిస్తోంది. రెండు నెలల క్రితమే కేరళలోని వాజిచల్ సమీపంలో ఏర్పాటుచేసిన ఆ దుకాణంలో ప్రతి వస్తువు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ దుకాణంలోని ప్రతి వస్తువు వెనుక వారి శ్రమ, నైపుణ్యం, అంతకమించి వాటిని తయారుచేయటంలో చూపించే శ్రద్ధ కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. అందుకే అక్కడి వస్తువులన్నీ కష్టమర్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. నేడు ఈ దుకాణం రూపురేఖలే మారి పోయాయ. ఆ ఐదుగురు మహిళలు 40 నుంచి వంద శాతం వివిధ రకాల వైకల్యంతో బాధపడుతున్నవారే. ఈ ఐదుగురు ఓ టీమ్‌గా తయారై, కలిసికట్టుగా పనిచేస్తే ఈ సమాజమే తమను గుర్తిస్తుందని నిశ్చయించుకున్నారు. ఇంకా చదవండి.
స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్‌పర్సన్‌గా అరుంధతీ భట్టాచార్య బాధ్యతలు స్వీకరించడంతో - మన దేశంలో ప్రముఖ బ్యాంకులన్నిటికీ ముఖ్య అధికార స్థానాల్లో మహిళలే ఉన్నట్టయింది. 207 ఏళ్ల ఆ బ్యాంకు చరిత్రలో ఛైర్‌పర్సన్‌గా ఒక మహిళ నియమితమవడం ఇదే తొలిసారి. Read more....
చీకటి జీవితానికి స్వస్తి చెప్పాలనుకున్నారు. నలుగురిలో తలెత్తుకుని... గర్వంగా బతకాలనుకున్నారు. అందరి పిల్లల్లాగే తమ బిడ్డలకూ గౌరవమైన బతుకును ఇవ్వాలనుకున్నారు. అందుకు తమ జీవితాలను తామే మార్చుకున్నారు... ఒకప్పుడు వీళ్లని చూసి 'వీరిదీ ఒక బతుకేనా' అని ఈసడించుకున్నవారే... ఇప్పుడు ఈ మహిళల్ని చూసి మెచ్చుకుంటున్నారు. ఎవరు వీరు...? కొన్నేళ్ల పాటు వ్యభిచారకూపంలో మగ్గిన పదిమంది అభాగ్య మహిళలు. ఇప్పుడు గౌరవప్రదమైన వ్యాపారం ప్రారంభించి ఆకలి తీర్చే అన్నపూర్ణలుగా మారారు. వీరిని చూసి మరింత మంది తమ చీకటి జీవితాల్ని వదిలి వెలుగు దిశగా అడుగులు వేస్తున్నారు. Read more..
దేశంలో శాంతి భద్రతల్ని కాపాడడంలో కీలక పాత్ర వహించే కేంద్ర రిజర్వు పోలీస్ దళం (సిఆర్‌పిఎఫ్)లో మహిళల భాగస్వామ్యం మరింతగా పెరగబోతోంది. అసిస్టెంట్ కమాండంట్ హోదాలో నేరుగా యువతులను నియమించాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. యుపిఎస్‌సి జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణులైన యువతులను ఈ పోస్టుల్లో నియమిస్తారు. ఏటా కనీసం ఇరవై మందిని సిఆర్‌పిఎఫ్‌లో అసిస్టెంట్ కమాండంట్ పోస్టుల్లో నియమిస్తారు. భద్రతా దళాల్లో మహిళల భాగస్వామ్యం 40 శాతానికి పెంచాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు.
Read more.. ఫొటోగ్రఫీ... కంటికి కనిపించే దృశ్యాలను అందమైన వర్ణకావ్యంగా అచ్చువేసే కళ. ఫొటో... మురిపించే క్షణాల్ని సజీవంగా ఉంచే శిల్పం. ఒక ఫొటో చక్కగా రావాలంటే చేతిలో కెమెరా ఉంటే సరిపోదు. అందాన్నీ, అందులోని సున్నితత్వాన్నీ గమనించే గుణం ఫొటో తీసే వ్యక్తికి ఉండాలి. ఒకప్పుడు 'స్మైల్ ప్లీజ్' అంటూ ఒకే ఒక డైలాగ్‌తో ఫొటోగ్రాఫర్ పని పూర్తయ్యేది. నలుగురిని వరుసగా నిల్చోబెట్టి 'క్లిక్'మనిపించేస్తే సరిపోయేది. కానీ ఇప్పుడు అభిరుచులు మారాయి. టెక్నాలజీ మారింది. ఫొటోని కళాత్మకంగా తీసే వాళ్లూ పెరిగారు. నిన్న మొన్నటి వరకూ ఫొటోగ్రాఫర్లంటే మగవాళ్లే అందరి మదిలో మెదిలేవారు. ఇప్పుడు ఆ ట్రెండ్ కూడా మారింది. అమ్మాయిలకి టీచర్ ఉద్యోగాలైతే బాగుంటాయి... ఉదయం తొమ్మిదికి వెళ్లి సాయంత్రం ఆరింటికల్లా ఇంటికి వచ్చేయచ్చు. ఇలాంటి సంప్రదాయపు ఆలోచనల గోడలు కొన్నాళ్ల క్రితమే బద్దలై, అమ్మాయిలు అన్ని రంగాల్లోకి అడుగుపెట్టడం ప్రారంభించారు. ఇప్పుడు మరింత ముందుకు దూసుకెళుతూ కొత్త కెరీర్‌లను ఎంచుకుంటున్నారు. లక్షలు తెచ్చే జీతాల్ని వదులుకుని ఆసక్తి ఉన్న పనినే చేయడానికి ఇష్టపడుతున్నారు.
Read more......... గాలి వీచి పువ్వుల తీగ నేల వాలిపోతే అలాగే వదిలేస్తామా?
చేరదీసి నీరు పోసి చిగురించేలా చేస్తాం కదా? సరిగ్గా ఆ పనే చేస్తున్నారు ముంబైకి చెందిన ఆరుగురు యువతుల బృందం ఉత్తరాఖండ్‌లో. కొన్ని నెలల క్రితం అక్కడ ముంచెత్తిన జలవిలయంలో అయినవాళ్లందరినీ కోల్పోయి షాక్‌కు గురైన ఆడవారు మానసికంగా మరింత కుంగిపోకుండా ఆదుకుంటున్న ఈ అమ్మాయిల కృషి అందరి ప్రశంసలకూ పాత్రమవుతోంది. Read more... ఐదేళ్ల క్రితం... మహిళల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గుజరాత్ ప్రభుత్వం అటవీ శాఖలో పని చేసేందుకు అభ్యర్థులను ఆహ్వానించింది. రాత, దేహదార్డ´్య పరీక్షల అనంతరం నలభై మంది మహిళల్ని ఎంపిక చేసింది. జంతు సంపదను కాపాడటం, కలప అక్రమ రవాణాను అడ్డుకోవడం, స్థానిక గిరిజనులు వంట చెరకు కోసం చెట్లను కొట్టకుండా చూడటం, అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు తక్షణం స్పందించడం వీరి బాధ్యత. ప్రభుత్వం వీళ్లందరికీ తుపాకులూ, బుల్లెట్ బైకులూ, వాకీటాకీలూ, సెల్‌పోన్లూ, కెమెరాలూ అందించింది. అడవిలో తప్పిపోకుండా జీపీఆర్‌ఎస్ వ్యవస్థ అనుసంధానమై ఉంటుంది. కంట్రోల్ రూమ్‌లో ఉండి పర్యవేక్షిస్తే, అడవిలో ఎవరు ఎక్కడ ఉన్నారనే సమాచారం ఎప్పటికప్పుడు తెలుస్తుంది.
Read more........ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని, ఆర్థిక ఇబ్బందుల్ని దాటుకుని పాలిటెక్నిక్ పూర్తిచేసిన అమ్మాయిలు అనువైన పని గంటల్నీ, అద్దాల గదుల్లో కూర్చుని చేసే ఉద్యోగాల్నీ కోరుకోలేదు. సవాళ్లతో కూడిన, సాహస విధుల్ని చేపట్టాలనుకున్నారు. వేల మందిని గమ్యస్థానాలకు చేర్చే రైల్వే ఉద్యోగం... అసిస్టెంట్ ఎలక్ట్రిక్ లోకో పైలట్లు కావాలనుకున్నారు. సాధారణంగా రైల్వేలోని ఈ ఉద్యోగం పేరు చెబితే వెంటనే గుర్తొచ్చేది పురుషులే. ఇప్పటిదాకా ఈ ఉద్యోగం పట్ల ఆసక్తి చూపించే అమ్మాయిల్ని వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. బ్యాచ్‌కి ఒకరో, ఇద్దరో ఉండేవారు. కానీ ఈ ఏడాది ఏప్రిల్‌లో శిక్షణకు ఎంపికైన బృందంలో పద్నాలుగు మంది అమ్మాయిలు ఉన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఎనిమిది మందిలో ఐదుగురు మన రాష్ట్రానికి చెందిన వాళ్లు. విజయవాడలోని ఈటీటీసీలో శిక్షణ పొందిన లావణ్య, జి.వి.ఎస్.నళినీ కుమారి, జి.శిరీష, సీహెచ్.శిరీష, జి.నళిని... 'కష్టపడటం మాకేం కొత్తకాదు. పాలిటెక్నిక్ చదివిన మేం చాలామందిలా ఏదో ఒక సంస్థలో చేరిపోవాలనుకోలేదు. పదిమందిలో ప్రత్యేకంగా కనిపించే ఉద్యోగం చేయాలనుకుని ఇటొచ్చాం. రోజూ లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చే భారతీయ రైల్వేలో ఉద్యోగం చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం' అన్నారు.Read more...
|