మాణిక్యమ్మ మాజీ సర్పంచ్. ఊరికి చాలా చేశారు. ఊరినే మార్చేశారు. ఊళ్లో వైన్‌షాప్ అన్నదే లేకుండా చేశారు. శుభ్రతకు ఒక అవార్డ్. అభివృద్ధికి ఒక అవార్డ్. ఊరికి ఆమె ఇచ్చిన ‘మనశ్శాంతి’ మరొక అవార్డ్. ఎవరైనా ఇంతక న్న ఏం సాధిస్తారు? ఐతే సాధించడం గొప్ప కాదంటారు మాణిక్యమ్మ! సాధించినదాన్ని నిలుపుకోవడం ముఖ్యం అంటారు. ఇప్పుడామె ఏకైక ధ్యేయం... మద్యం మహమ్మారి మళ్లీ కోరలు చాచకుండా చూడడం! పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి. ‘గెలిపిస్తే అవి చేస్తాం, ఇవి చేస్తాం’ అనేవాళ్లని చూశాం. మాణిక్యమ్మ మాత్రం... ‘ఎవరు గెలిచినా... ఊళ్ల్లోకి వైన్‌షాపుని మాత్రం రానివ్వం’ అంటున్నారు. ఇది ఆమె ఎన్నికల వాగ్దానం కాదు. ఊరును ఓడిపోనివ్వనని చేస్తున్న ప్రమాణం... Read more
అభివృద్ధికి ఒక అవార్డ్ : మాణిక్యమ్మ

0 Comments
ఈమె మరో మదర్ థెరిస్సా
‘సుమనహళ్లి మదర్ థెరిస్సా ’గా పేరు పొందిన ఈ విదేశీ మహిళ బ్రిటన్ నుంచి వచ్చింది. ఒక చిన్న మోపెడ్‌ను నడుపుకుంటూ వెళ్ళే ఈ క్రైస్తవ మఠ సహోదరి, న్యూకాస్టిల్ నుండి వచ్చి ఇక్కడే స్థిరపడి 29 సంవత్సరాలుగా కుష్ఠురోగులకు సేవలందిస్తోంది. అంతర్జాతీయంగా ఒక అనూహ్యమైన గుర్తింపును పొందింది మదర్ థెరిస్సా. చరిత్రలో ఈమే ఈ రంగంలో అత్యంత సేవలందించి జన్మ చరితార్థం చేసుకున్న తొలి మహిళ. ఈమె కూడా విదేశీయురాలే. ఇదే మార్గంలో మరికొందరు ప్రయాణిస్తూ, థెరిస్సా అడుగుజాడల్లో నడుస్తున్నారన్నది యథార్ధం. థెరిస్సా ప్రపంచదేశాల్లో ఎందరికో ఆదర్శంగా, చెరగని ముద్రవేసుకుంది. అదే మార్గంలో పయనిస్తూ రెండో మదర్ థెరిస్సాగా కొనియాడబడుతోంది జీన్.... Read more పడతుల పాలన.. పల్లెకు లాలన
ఆ గ్రామానికో ప్రత్యేకత వుంది. కేవలం ఏడు వార్డులే ఉన్న ఆ చిన్న పంచాయతీకి సర్పంచ్ నుంచి వార్డు సభ్యుల వరకూ అందరూ మహిళలే. సంకల్ప బలం తోడైతే అసాధ్యమంటూ లేదని నిరూపించిన ఆ మహిళా ప్రజాప్రతినిధులందరూ 40 ఏళ్ల వయసు లోపు వారే. పశ్చిమబెంగాల్‌లోని మిడ్నాపూర్ జిల్లాలో కుల్తిక్రి గ్రామం మహిళా సాధికారితకు నిదర్శనంగా నిలుస్తోంది. అక్షరాస్యతలోనూ, ఆర్థిక స్వావలంబనలోనూ అక్కడి మహిళలు ఎందరికో స్ఫూర్తిదాతలుగా నిలిచారు.......... Read more తాత గారి పేరు కోకా కోటయ్య. నాన్నమ్మ శ్రీమతి మహలక్ష్మీ. వారికి ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు. విజయలక్ష్మి తండ్రి రాధాకృష్ణ మూర్తి రెండవ సంతానం.విజయలక్ష్మి తండ్రి ప్రాథమిక విద్యాభ్యాసమంతా సొంతవూరు రావూరు లోను, డిగ్రీ బాపట్లలోను చేశారు. ఆ రోజుల్లో ఆమె తండ్రి గొప్ప కబాడ ఆటగాడిగా పేరు తెచ్చుకొన్నారు. అంతేకాదు... Read more
మామిడి వనం.. మహిళకు వరం!
కట్నం వేధింపులు, ఆడశిశువులపై నిరాదరణ లేని గ్రామం ఏదైనా ఉందంటే కొంచెం సేపు మనం తటపటాయించక తప్పదు. గత పదేళ్లలో మూడు మిలియన్ల ఆడపిల్లల ప్రాణాలు పురిట్లోనే తీసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయతే, బీహర్‌లోని కుగ్రామమైన ‘ధర్హార’లో వరకట్న హత్యలు, శిశు హత్యలు జరగడం లేదంటే నమ్మలేం. ఈ వాస్తవం ఉక్కు మహిళ కిరణ్‌బేడీనే కాదు, సాక్షాత్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ను సైతం ఆశ్చర్యపరచింది. ఆ గ్రామంలో ఆడపిల్లలు సురక్షితంగా ఉండటానికి ప్రత్యేకించి పదునైన చట్టాలేమీ లేవు. అక్కడి మామిడి చెట్లే మహిళలను కాపాడుతున్నాయి..... Read more వికలాంగులకు దారి చూపుతున్న జయశ్రీ
వికలాంగులంటే అందరిలా పనిచేయలేని వారు అనా? కాదు, అందరూ చేసే పనిని, అందరూ చేసే పద్ధతిలో కాకుండా మరో మార్గంలో చేసేవారు. అందుకే జయశ్రీ వారిని డిజేబుల్డ్ అనరు. డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటారు. భిన్న మార్గంలో పనిపూర్తి చేయగలిగిన వారంటారు. ఈ జయశ్రీ ఎవరు ? సమాజానికి ఒక ఆదర్శనీయ మార్గం చూపాలని ఎందుకు అనుకున్నారు?Read more
పాలు పోసి వండినా, టొమాటో ముక్కలు కలిపినా, పులుసు చేసినా, ఆవపెట్టినా, నువ్వుల పొడి వేసినా... సొరకాయ రుచే వేరు. తియ్యగా, కమ్మగా, నోరూరించే సోరకాయతో మరికొన్ని రుచులు వండుకోవడం ఎలాగో చూద్దాం... సొరకాయ కూటు , సొరకాయ పచ్చడి , కోఫ్తా కర్రీ , సొరకాయ వడియాలు , సొరకాయ బర్ఫీ , సొరకాయ పల్లీల కూర
|