చల్లారిన ఒక కప్పు టీనీళ్లలో రెండు స్పూన్ల బియ్యప్పిండి, తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. బియ్యప్పిండి మంచి స్క్రబ్‌లా పనిచేస్తుంది. తేనె చర్మానికి తేమనిస్తుంది. ఈ రెండింటినీ కలిపి వాడడం వల్ల చర్మానికి కండిషనర్ దొరికినట్టే. ఇంకా చదవండి
కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు అత్తవారింట అడుగుపెట్టడానికి భయపడుతుంటారు. అంపకాల సమయంలో భర్త తరుపు వారికి ఇబ్బంది రాకుండా నడుచుకో అంటూ అమ్మ చెప్పే జాగ్రత్తలు మరింత కంగారును పుట్టిస్తాయి.ఎవరితో ఏ విధంగా మాట్లాడితే ఏమవుతుందో అనే ఆదుర్దా పెళ్ళికూతుర్ని ఇబ్బంది పెడతాయి. పోనీ భర్తను అడిగి తెలుసుకుందామంటే ఆయన తన పనులతో బిజీగా ఉంటారు. ఈ నేపథ్యంలో పెళ్ళికూతురికి ఉపకరించే కొన్ని చిట్కాలను మీ ముందు ఉంచుతున్నాము. ఇంకా చదవండి ఏ అమ్మాయీ తనకై తాను ఇల్లొదిలి వచ్చేయదు.
ఎవరో ప్రేమించి మోసం చేసి ఉంటారు. ఎవరో దయతలచి, దగా చేసి ఉంటారు. ఎవరో నమ్మించి ‘అమ్మక’ ద్రోహం చేసి ఉంటారు. ఎవరో తోడుగా వచ్చి, చెయ్యి వదిలేసి ఉంటారు. మీ ఊళ్లో... మా ఊళ్లో... ఏ ఊళ్లోనైనా.... తలదాచుకోడానికి చాలా ఇళ్లే ఉంటాయి. కానీ ఇలాంటి అమ్మాయికి... దుఃఖంలో తడిచి నిలబడిన అమ్మాయికి... తలుపు తెరిచే ఇల్లు ఒక్కటీ కనిపించదు. కనీసం ‘ఎవరమ్మా నువ్వు?’ అనేవారొక్కరూ కనిపించరు. ఇంకా చదవండి . |