గర్భిణిగా ఉన్నప్పుడు ఇద్దరికి సరిపోయే ఆహారాన్ని తీసుకోవాలి కాబట్టి ఆకలి అధికంగానే ఉంటుంది. అయితే గర్భంలోని శిశువు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆహారపదార్థాలు తీసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. కొన్ని రకాల ఆహారపదార్థాల ప్రభావం తల్లిమీదకంటే గర్భస్థ శిశువు మీదనే అధికంగా ఉంటుందంటున్నారు గైనకాలజిస్టులు. ఈ సమయంలో ఎలాంటి ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలో కొన్ని వివరాలు చెబుతున్నారు. అవి...ఇంకా చదవండి
0 Comments
తమకు పుట్టబోయే పుత్రరత్నాలు సిక్స్‌ప్యాక్ బాడీని పెంచాలనుకొనే తల్లులకు ఒక సూచన... ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు తల్లులు విటమిన్ డి పుష్కలంగా తీసుకొంటే పుట్టబోయే పిల్లల కండరాలు శక్తిమంతంగా ఉంటాయట. వారి మజిల్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయని, నాలుగేళ్ల వయసు నుంచే వారి పట్టులో బిగువు ఉంటుందని యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ పరిశోధకులు తేల్చారు.ఇంకా చదవండి
మాతృత్వం ఒక వరం. కానీ వరం లాంటి ఆ పరిస్థితి తనకూ, పుట్టబోయే బిడ్డకూ శాపంగా పరిణమించకూడదు కదా. అమ్మ త్యాగానికి మారు పేరు కాబట్టి ఆ త్యాగానికీ సిద్ధపడుతుంది. కాబోయే అమ్మ... ఏయే పరిస్థితుల్లో ఎలాంటి మందులు వాడకూడదో తెలుసుకోవడం వాళ్లకు ఎంతో మేలు చేస్తుంది. కాబోయే మాతృమూర్తి ఏవైనా మందులు వాడితే కడుపులోని బిడ్డకు ఎలాంటి పరిణామాలు వస్తాయో వివరించేదే ఈ కథనం.
ఇంకా చదవండి పాప రజస్వల అయ్యింది. ఆ అమ్మాయికి ఇప్పుడు ఎలాంటి ఆహారం ఇవ్వాలో అంటూ అమ్మకు టెన్షన్. ఇకపై నెలనెలా రుతుస్రావం అవుతుంటుంది. అమ్మాయి రక్తం కోల్పోతూ ఉంటుంది. నెత్తురు భర్తీ అవ్వాలి కాబట్టి ఎప్పుడూ తినేదానికంటే ఎక్కువే తినిపించమంటారు పొరుగువారు. ఆ మాట నిజమేనా? మరి అమ్మాయి సరిగా తినడం లేదే? ఏం చేయాలి. ఎటూ పాలుపోని ఈ పరిస్థితిపై అయోమయాలు తొలగిపోవాలంటే ఈ కథనం చదవండి. అమ్మాయి ఆరోగ్యాన్ని పరిరక్షించండి. ఇంకా చదవండి
మతగ్రంథంలో ఉన్నట్లే... మహిళల కోసం కూడా పది ఆజ్ఞలు ఉన్నాయని తెలుసా? ఇవి వ్యక్తిత్వ వికాస నిపుణులు రూపొందించినవి. వీటిని అనుసరిస్తే ఈ సమాజంలో మీకో గొప్ప స్థానం లభిస్తుంది. అంతేకాదు, విజయశిఖరాలను అందుకోకుండా మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. ఇంకా చదవండి. ఆడవాళ్లు ఆరయ్యేసరికల్లా ఇంట్లో వాలిపోయే రోజులు కావివి. స్కూళ్లకు, కాలేజీలకు, ఆఫీసులకు వెళ్లేవాళ్లకు చీకటి పడకుండానే ఇల్లు చేరుకోవడం అంత సులభం కాదు. హైదరాబాద్‌లాంటి బిజీ నగరాల్లో అస్సలు సాధ్యం కాదు. పైగా కాల్ సెంటర్లలో పనిచేసేవాళ్లు ఏ అర్ధరాత్రో డ్యూటీ ముగించుకుని రావలసిన పరిస్థితి. అలాంటప్పుడు ఎవరు మనకు రక్షణ? ఎవరూ కాదు. మనకు మనమే రక్షణ కల్పించుకోవాలి. అందుకు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. ఇంకా చదవండి
కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు అత్తవారింట అడుగుపెట్టడానికి భయపడుతుంటారు. అంపకాల సమయంలో భర్త తరుపు వారికి ఇబ్బంది రాకుండా నడుచుకో అంటూ అమ్మ చెప్పే జాగ్రత్తలు మరింత కంగారును పుట్టిస్తాయి.ఎవరితో ఏ విధంగా మాట్లాడితే ఏమవుతుందో అనే ఆదుర్దా పెళ్ళికూతుర్ని ఇబ్బంది పెడతాయి. పోనీ భర్తను అడిగి తెలుసుకుందామంటే ఆయన తన పనులతో బిజీగా ఉంటారు. ఈ నేపథ్యంలో పెళ్ళికూతురికి ఉపకరించే కొన్ని చిట్కాలను మీ ముందు ఉంచుతున్నాము. ఇంకా చదవండి సహజంగా సమాజంలో తండ్రులందరికీ కూతుళ్లపట్ల అంతులేని మమకారం ఉంటే.. కూతుళ్లందరికీ తండ్రి పట్ల అపారమైన అనురాగం ఉంటుంది. అయితే జీవన గమనంలో అమ్మాయిలు టీనేజ్ వచ్చేసరికి తండ్రితో కొంత దూరం కావడం సహజం. కానీ నేడు ఒక్కరిద్దరు సంతానం కావడం. ఆ ఒక్కరిద్దరూ ఆడపిల్లలే అయితే తండ్రితో కూడా అరమరికలు లేకుండా ఉండడం నేటి సమాజంలో వచ్చిన ఆహ్వానించదగ్గ పరిణామం. ప్రధానంగా అమ్మాయిల జీవితంపై అత్యంత ప్రభావం చూపేవారిలో మొట్టమొదటి వ్యక్తి - తండ్రే. తండ్రులు కూడా తమ కూతుళ్ళను మానసిక స్థైర్యం, ఆత్మవిశ్వాసం నిండిన రేపటి మహిళగా అభివృద్ధి చేయాలని తపన పడతారు. అమ్మాయిల జీవితంలో తండ్రి ప్రభావం వారి ఆత్మగౌరవాన్నీ, ఆత్మ విశ్వాసాన్నీ, పురుషులపై అభిప్రాయాలనూ తెలియజేస్తుంది. ఇన్ని ఉన్నా తండ్రీ కూతుళ్ల బంధం పట్టిష్ఠంగా ఉండాలంటే కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిందే! Read more...
ఏళ్ల తరబడి రాత్రి షిఫ్టుల్లో పనిచేయడం ఆడవారి ఆరోగ్యానికి ముప్పేనంటున్నారు పరిశోధకులు. ఎక్కువకాలం రాత్రి పూట పని చెయ్యడం వల్ల టైప్ 2 డయాబెటిస్, అధిక బరువు వంటివి రావొచ్చని హెచ్చరిస్తున్నారు వారు. అలాగే పొగతాగడం వంటి వ్యసనాల బారిన పడే అవకాశమూ హెచ్చేన ట. నిరంతరంగా నిశివేళల్లో ఉద్యోగాలు చెయ్యడం వల్ల మన శరీరంలో ఉండే గడియారం (సర్కాడియన్ రిథమ్) పనితీరులో తీవ్రమైన మార్పులొచ్చేస్తాయట. దాంతో నిద్ర, శక్తి, శరీర ఉష్ణోగ్రత, హార్మోన్ల పనితీరు - అన్నిటిలోనూ మార్పులొచ్చి, ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయని తాజా పరిశోధనలు చెబుతున్నాయి.
ఈ రోజుల్లో చాలా మంది స్త్రీలలో బహిష్టు సమయంలో పొత్తి కడుపునొప్పి బాధిస్తుంది. ఇటువంటి నొప్పినే వైద్య పరిభాషలో డిస్మెనోరియా (పెయిన్‌ఫుల్ మెన్సెస్) అంటారు. బహిష్టు కనబడిన తర్వాత మొదటి, రెండు మూడు సంవత్సరముల వరకూ బహిష్టు సమయంలో పొత్తికడుపునొప్పి రావడం సాధారణంగా జరుగదు. సుమారు 50శాతం మంది స్త్రీలు బహిష్టు సమయంలో పొత్తి కడుపు నొప్పితో బాధపడుతుంటారు. యుక్తవయస్సు అంటే 18సంవత్సర ముల నుండి 24సంవత్సరముల వరకూ ఉన్న స్త్రీలలో బహిష్టు సమయంలో కడుపునొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ వివాహ అనంతరం నొప్పి తీవ్రత తగ్గుతుంది.
Read more... |