పట్టుదల, ఆశయం ముందు మూఢాచారాలు ఏవైనా అవన్నీ తల ఒగ్గాల్సిందే. సంప్రదాయాలు ఏవైనా కానివ్వండి అవి మానవ ఔన్నత్యానికి దోహదం చేసేందుకు మనం ఏర్పాటు చేసుకున్న ఓ సదుపాయం. కాలచక్రంలో ఆ సదుపాయాలే ఉరితాళ్లుగా మారి స్త్రీ మనుగడకే ముప్పువాటిల్లే దుస్థితి ఏర్పడింది. ఆచారాల మాటున మానవీయ విలువల్ని కాలరాసే విషసంస్కృతి, ఆ నీచసంస్కృతికి బుగ్గిపాలవుతున్న ఆడబిడ్డ జీవనం నేటికి ఓ ప్రశ్నార్థకం. పుట్టిన బిడ్డ మగబిడ్డ కావాలి కాదుకాదు అయ్యితీరాల్సిందే. లేకపోతే ఆ మరుక్షణంలోనే ఆడశిశువు గొంతులో ఒడ్లగింజల్ని వేయడమో లేదా గొంతునులిమి చంపడం గిరిజనుల అజ్ఞానానికి నిదర్శనం. చంపడానికి మనసొప్పనివారు ఆ బిడ్డను రెండు,మూడు వేలకు అమ్మివేస్తారు. వంశాంకురం కోసం డజనుమంది ఆడపిల్లల్ని కనేందుకైనా వెనుతిరుగరు. మగపిల్లవాడు పుట్టేవరకు అంతే. Read more
0 Comments
Leave a Reply. |