Read more....
మొన్న ఢిల్లీలో వైద్యవిద్యార్థిపై సామూహిక అత్యాచారం, ఆ తర్వాత ఆమె మరణపు విషాద జ్ఞాపకాలు మరువకముందే నిన్న ముంబయిలో యువ జర్నలిస్ట్ పై మరో గ్యాంగ్‌రేప్ ఉదంతం. రేపు, ఎల్లుండి ఇంకా ఎన్నెన్ని జరుగుతాయో ఊహకు అందని అమానుషపు, నీచకార్యాల్ని తలంచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. గుండెజారి అగాధంలో గల్లంతై, అదృశ్యమైపోతామేమో అనే చింత, కలవరం ఆధునిక వనితను వెంటాడుతూనే ఉంది. చదువులో, కెరీర్లో పురుషులతో పోటీపడుతూ, విజయవంతంగా ముందుకు దూసుకెళ్తున్న స్త్రీకి ఇలాంటి సంఘటనలు ఆమె పరుగులకు కళ్లెం వేసే చేదుసంఘటనలే.
Read more....
0 Comments
Leave a Reply. |