
"రోజుకి 40 గ్రాముల ఆలూని రెండో ఆలోచన లేకుండా తినొచ్చు. కాకపోతే తీసుకునే డైట్‌ని బట్టి ఈ కొలతలో కాస్త తేడా ఉంటుంది. బరువు పెరుగుతామని, డయాబెటిస్ ఉందని ఆలు తినకూడదనుకోవడం అపోహ మాత్రమే. ఆలుని ఎందుకు తినాలో చెప్పేందుకు నా దగ్గర ఐదు కారణాలున్నాయి. వాటిని చెప్పేముందు వంద గ్రాముల ఆలులో ఏమేమి ఉంటాయో తెలుసుకోవడం ముఖ్యం. 97 కిలో కాలరీల శక్తి, 1.6 గ్రాముల ప్రొటీన్స్ ఉంటాయి. కొవ్వు 0.1, కార్బొహైడ్రేట్‌లు - 22.6, ఐరన్ 0.48 మిల్లీగ్రాములు, విటమిన్ సి 17 మిల్లీగ్రాములు, పీచు 0.4 గ్రాములు ఉంటుంది.
Read more.........