అనగనగా ఒక బాలుడు, ఆ బాలుడు ఏడుసముద్రాల ఆవల ఉండే భీకరారణ్యంలోకి చొచ్చుకునివెళ్లి, అక్కడ ఓ చీకటి గుహలో దాక్కుని, తన మంత్రాలు, తంత్రాలతో ప్రపంచాన్ని తన గుప్పెట్లో ఉంచుకునేందుకు ప్రయత్నించే ఓ మాంత్రికుడితో పోరాడి గెలిచే సాహస కథలంటే పిల్లలకే కాదు పెద్దలకు ఇష్టమే. ఇలాంటి కథలకే రౌలింగ్ అనే ఓ మహిళారచయిత శ్రీకారం చుట్టారు. ఆమె రాసిన నవలే 'హ్యారీపొట్టర్'. అదే ఆమెకు ఇంతటి ఖ్యాతి తెచ్చిపెడుతుందని ఊహించలేదు. పిల్లలు సాహసాలకు మారుపేరుగా చెప్పుకోవచ్చు. మాంత్రికుడి కుతంత్రాలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ, ఆసాంతం భయంకర పోరాటం చేస్తూ, జాతిని, దేశాన్ని, విశ్వాన్ని కాపాడే సాహసబాలుడి చుట్టూ తిరిగే కథనే హ్యారీపొట్టర్. ఇలాంటి సినిమాలు 60,70 దశాబ్దంలో మన తెలుగులో పాతాళభైరవి, మాయాద్వీపం, జ్వాలాద్వీపరహస్యం వంటి సినిమాలు పిల్లలతోపాటు పెద్దల్ని అలరించి, నేటికీ ఆదరణపొందుతున్న ఇలాంటి కథలనే రౌలింగ్ కాస్త వెరైటీగా రాసి, ప్రేక్షకులకు అందించారు. ఇంకా చదవండి
1 Comment
Leave a Reply. |