
![]() సహజంగా సమాజంలో తండ్రులందరికీ కూతుళ్లపట్ల అంతులేని మమకారం ఉంటే.. కూతుళ్లందరికీ తండ్రి పట్ల అపారమైన అనురాగం ఉంటుంది. అయితే జీవన గమనంలో అమ్మాయిలు టీనేజ్ వచ్చేసరికి తండ్రితో కొంత దూరం కావడం సహజం. కానీ నేడు ఒక్కరిద్దరు సంతానం కావడం. ఆ ఒక్కరిద్దరూ ఆడపిల్లలే అయితే తండ్రితో కూడా అరమరికలు లేకుండా ఉండడం నేటి సమాజంలో వచ్చిన ఆహ్వానించదగ్గ పరిణామం. ప్రధానంగా అమ్మాయిల జీవితంపై అత్యంత ప్రభావం చూపేవారిలో మొట్టమొదటి వ్యక్తి - తండ్రే. తండ్రులు కూడా తమ కూతుళ్ళను మానసిక స్థైర్యం, ఆత్మవిశ్వాసం నిండిన రేపటి మహిళగా అభివృద్ధి చేయాలని తపన పడతారు. అమ్మాయిల జీవితంలో తండ్రి ప్రభావం వారి ఆత్మగౌరవాన్నీ, ఆత్మ విశ్వాసాన్నీ, పురుషులపై అభిప్రాయాలనూ తెలియజేస్తుంది. ఇన్ని ఉన్నా తండ్రీ కూతుళ్ల బంధం పట్టిష్ఠంగా ఉండాలంటే కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిందే! Read more...
0 Comments
Leave a Reply. |