
'' నేను హైదరాబాద్‌లో సైన్స్ సబ్జెక్ట్‌తో12వ తరగతి చదువుతున్నాను. స్కూల్లో చదువుతున్న రోజుల నుండి కూడా మొదటి ర్యాంకు విద్యార్థిని కాకపోయినా చేసే ప్రతి పనీ సంపూర్ణంగా చేయాలని అనుకుంటాను. ఎప్పుడూ చురుగ్గా ఉంటాను. పరీక్షలు మన జ్ఞాపకశక్తిని పరీక్షించేవే కానీ మన విజ్ఞానాన్ని కాదు అని నేను పూర్తిగా నమ్ముతాను. అలాగని చదువును నిర్లక్ష్యం చేయను. పదో తరగతిలో మంచి మార్కులతో పాస్ అయ్యాను. కళ పట్ల నా ఆసక్తి నా ఏడు సంవత్సరాల వయసు నుండే మొదలైంది. మా అమ్మకు కూడా డ్రాయింగ్‌లో నైపుణ్యం ఉండటంతో ఆమె నా తొలి గురువు. నాకు స్కూల్లో సైన్స్ సబ్జెక్ట్ అంటే తగని పిచ్చి. సైన్స్‌లో రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉండేదాన్ని. నా స్నేహితుడు దుర్గేష్. అతనికీ సైన్స్, ఆర్ట్స్ అంటే ఆసక్తి. ఇద్దరం ఒకళ్ళ సందేహాలు ఒకళ్ళు తీర్చుకుంటూ ఉండేవాళ్ళం. " ఇంకా చదవండి...................