ఆదివాసి ఆడపడుచు తీజన్ బాయి ఆమె జీవితపు ప్రతి కోణం ఒక పాఠం నేర్పే రీతిలో ఉంటుంది. ఒక ఆదివాసీ సమాజపు నేపథ్యం నుండి దేశ అత్యున్నత పురస్కారాలకు ఎదగడం మధ్య జరిగిన జీవిత అనుభవాలు ఎలాంటివో అవి తెలిస్తే నేటి యువతరానికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది.చేతిమీద పచ్చబొట్టుగా పొడిపించుకున్న తన అయిదు అక్షరాల పేరును రాయడానికి పది నిమిషాలు తీసుకుంటానని కించిత్తు అభిమానంగా చెప్పే తీజన్బాయి- పద్మశ్రీ, పద్మభూషణ్, డి.లిట్, మూడు డాక్టరేట్లు పోటీపడి వరించాయి. ఆమె పారిస్ ఫెస్టివల్- సంగీత నాటక అకా డమీ అవార్డు- వీటితోపాటుగా మరిన్ని రివార్డులు అందుకున్నారు...... Read more | ఆకాశమంత ఆత్మవిశ్వాసంతో ముందడుగు ఆమె ఆత్మవిశ్వాసం ఆకాశమంత ఎత్తైనది, పట్టుదల భూలోకమంత విశాలమైనది. కొండలు, గుట్టల్లాంటి అవాంతరాలు ఎన్నెన్నో ఎదురౌతున్నా వాటన్నింటిని గడ్డిపరకల్లా భావించింది. ఒక లక్ష్యం కోసం సాగిపోతున్నప్పుడు వెనక్కినెట్టే దుష్టశక్తులు నిత్యం ప్రయత్నిస్తుంటాయి. అర్హతలు, సామర్థ్యం ఎన్ని ఉన్నా మహిళ అనే భావం లింగబేధాల అంతరాలను సృష్టించి, నిరాశపరచే సన్నివేశాలకు కొదవ వుండదు..... Read more |