ఉసిరికాయలు - ఒక కేజీ,
జీలకర్ర - ఒక టీ స్పూన్,
ఆవాలు - 2 టీ స్పూన్స్,
మెంతులు - 2 టీ స్పూన్స్,
వెల్లుల్లిపాయలు - 3(పెద్దవి),
ఎండు మిరపకాయలు - 10,
కారం - 25(గా. ,
చింతపండు - 24(గా.
ఉప్పు - 26(గా.
నూనె - 25(గా.
తయారు చేసే విధానం :
- కడాయిలో నూనె వెయ్యకుండా మెంతులను వేయించి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి.
- చింతపండును అరగంట పాటు నానబెట్టాలి. ఆ తర్వాత దాన్ని సన్నని మంట మీద ఉడికించాలి. చింతపండు రసం చిక్కగా అయ్యేవరకు వేడిచేసి పక్కన పెట్టుకోవాలి.
- ఉసిరికాయలను కడిగి మంచిగా తుడవాలి. ఇప్పుడు కడాయిలో నూనె పోసి ఉసిరికాయలను గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించి తీయాలి. వీటిని ఒక పెద్ద గిన్నెలో వేసి కాసేపు చల్లారనివ్వాలి.
- దీంట్లో చింతపండు పేస్ట్, ఉప్పు, కారం, మెంతిపిండి, వెల్లుల్లిపాయలు వేసి బాగా కలపాలి.
- మరోసారి కడాయి పెట్టి జీలకర్ర, ఆవాలు, మెంతులు వేగాక ఎండుమిరపకాయలు వేసి వేగనివ్వాలి. ఇందులో అన్నీ కలిపి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలను వేసి దించేయాలి. చ
- ల్లారాక జాడీలో భద్రపరచాలి. నోరూరించే.. కమ్మని ఉసిరికాయ పచ్చడి తయారైనట్లే!