బీట్‌రూట్ ముక్కలు-రెండు కప్పులు
పెరుగు-ఒక కప్పు
పచ్చిమిర్చి-మూడు, ఉడికించిన టమాట గుజ్జు-మూడు చెంచాలు
నిమ్మకాయ -ఒకటి, పలుచని మజ్జిగ-అరకప్పు
కొబ్బరితురుము-మూడు కప్పులు
ఉల్లిపాయముక్కలు-మూడు చెంచాలు
కొత్తిమీర, కరివేపాకు -కొద్దిగా
తయారుచేసే విధానం
బీట్‌రూట్ ముక్కల్ని సన్నగా తరిగి పచ్చిమిర్చి, మజ్జిగ చేర్చి కుక్కర్‌లో ఒకటి రెండు కూతలు వచ్చేదాకా ఉడికించాలి. ఆ ముక్కలు చల్లారాక కొబ్బరి తురుము, ఉడికించిన టమాటగుజ్జు, నిమ్మరసం, ఉల్లిపాయముక్కలు, బీట్‌రూట్‌లో కలిపి చివరగా పెరుగు వేయాలి. పైన కొత్తిమీర, కరివేపాకు తరుగు చల్లితే సరిపోతుంది. బీట్‌రూట్‌ను మజ్జిగలో ఉడికించడం వల్ల ముక్కల్లో ఉండే చప్పదనం తగ్గుతుంది. బీట్‌రూట్‌లో సహజమైన ఉప్పు ఉంటుంది. ఇది పాలకూర అన్నంలోకి చాలా బాగుంటుంది.