చింతచిగురు - 200 గ్రా.
వేరుసెనగ పప్పు - పావుకప్పు
ధనియాలు - టేబుల్ స్పూన్
సెనగ పప్పు - టేబుల్ స్పూన్
ఎండు మిర్చి - 20
వెల్లుల్లి రెబ్బలు - 4
నూనె - 4 టీస్పూన్లు
ఉప్పు - తగినంత
తయారుచేసే పద్ధతి :
- చింతచిగురును శుభ్రంగా కడిగి ఆరనివ్వాలి. బాణలిలో 2 టీస్పూన్ల నూనె వేసి కాగాక, వేరుసెనగ పప్పు, ధనియాలు, సెనగ పప్పు వేసి వేయించాలి. చివరగా ఎండు మిర్చి కూడా వేసి వేయించి దించాలి. చల్లారిన తర్వాత వీటిని మిక్సీలో వేసి రుబ్బాలి.
- అదే బాణలిలో మిగిలిన రెండు స్పూన్ల నూనె వేసి కాగాక, చింతచిగురు వేసి వేయించి దించి చల్లారనివ్వాలి.
- ముందుగా మిక్సీలో వేసిన పప్పుల్లో ఉప్పు, వెల్లుల్లి కూడా వేసి మరీ మెత్తగా కాకుండా పొడి చేయాలి. చివరగా ఆకులు కూడా వేసి పొడి చేయాలి.
మూలం : ఈనాడు ఆదివారం