ఉసిరికాయలు-పావుకిలో,
పచ్చిమిర్చి-ఆరు
పెరుగు-లీటరు,
ఇంగువ-చిటికెడు
పసుపు-పావు టీస్పూన్,
నూనె-సరిపడా
ఉప్పు-తగినంత,
కరివేపాకు-రెండు రెబ్బలు
ఆవాలు-ఒక టీస్పూన్,
మినపప్పు-ఒక టీస్పూన్
తయారుచేసే విధానం
- ఉసిరికాయల్ని గింజలు తీసేసి నిలువు ముక్కలుగా కోయాలి. మరీ ముక్కలుగా నమలడం ఇష్టంలేనివాళ్లు కాస్త కచ్చాపచ్చాగా ఉండేలా ఓసారి దంచి తీయవచ్చు.
- పాన్లో కొద్దిగా నూనెవేసి ఆవాలు, ఇంగువ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఉసిరికాయ తొక్కు కూడా వేసి వేగనివ్వాలి. తొక్కు నుంచి బయటకు వచ్చిన నీళ్లన్నీ ఆవిరయ్యే వరకూ వేయించాలి తరువాత పసుపు, ఉప్పు, పెరుగు వేసి బాగా కలపాలి.