telugutaruni.weebly.com
  • Home
  • వంటకాలు (Cookeries)
    • ఫలహారాలు (Tiffins)
    • శాకాహారం (Veg)
    • బియ్యపు వంటలు (Rice items)
    • మాంసాహారం (Non-Veg)
    • పచ్చళ్ళు (chutneys)
    • వడియాలు
    • పండ్ల రసాలు (Juices)
    • స్వీట్స్ (Sweets)
    • చిరుతిళ్ళు (Snacks)
    • గ్రేవీ ఐటమ్స్
    • సూప్స్ (Soops)
    • కొత్త కొత్తగా
  • చిట్కాలు (Tips)
    • వంటింటి చిట్కాలు ( Kitchen Tips)
    • ఆరోగ్య చిట్కాలు (Health Tips)
    • సౌందర్య చిట్కాలు (Beauty Tips)
  • మహిళా లోకం
    • ఆదర్శ మహిళలు
    • శభాష్ మహిళా..
  • విహారయాత్ర

రొయ్యల పచ్చడి 

5/24/2013

0 Comments

 
కావలసిన పదార్థాలు :

రొయ్యలు                 :           అర కిలో 
వెల్లుల్లి పేస్ట్              :           ఒక టేబుల్ స్పూన్ 
కారం                      :            అరకప్పు 
ఉప్పు                     :            ఒక టేబుల్ స్పూన్ 
లవంగాల పొడి          :             అర చెంచ 
నూనె                     :            అరకిలో 
నిమ్మకాయ             :            1

తయారుచేసే పద్ధతి :
 రొయ్యలు వాసనా పోవాలంటే ముందుగా రెండు నిముషాలు వేడినీటిలో వేసి రెండు పొంగులు వచ్చాక తీసి  ఒక బట్ట మీద వేసి కాసేపు ఆరనివ్వాలి. మూకుడులో నూనె(డీప్ ఫ్రైకి సరిపడా) వేడి చేసుకొని రొయ్యలను వేయించుకోవాలి. రొయ్యలు త్వరగా వేగిపోతాయి కనుక తొందరగా నూనెలో నుంచి  చిల్లుల గరిటెతో ఒక గిన్నెలోకి తీసుకోవాలి.  రొయ్యల పచ్చడిలో లవంగాల పొడి కాస్త ఎక్కువగా, కారం కాస్త తక్కువగా వేస్తే బాగుంటుంది. మూకుడులో ఒక కప్పు లేదా కప్పున్నర నూనె మాత్రం ఉంచి మిగిలిన నూనె తీసేయాలి. స్టవ్ తక్కువ మంట మీద పెట్టుకొని ఆ మూకుడు పెట్టి, అందులో నూరిన వెల్లుల్లి ముద్ద,లవంగాల పొడి, కారం, ఉప్పు వేసుకోవాలి. స్టవ్ ఆర్పీవెసి, గిన్నెలోకి తీసుకున్నరొయ్యలను వేసి బాగా కారం పట్టేలా కలపాలి.  వేడి తగ్గిన తరువాత నిమ్మకాయరసం పిండాలి. 

మూలం: ప్రజశక్తి ఆదివారం 
0 Comments

మటన్ పచ్చడి 

5/24/2013

0 Comments

 
కావలసిన పదార్థాలు :

బోన్ లెస్ మటన్       :           కిలో 
అల్లం,వెల్లుల్లి పేస్ట్      :           ఒక టేబుల్ స్పూన్ 
కారం                      :            అరకప్పు 
ఉప్పు                     :            ఒక టేబుల్ స్పూన్ 
లవంగాల పొడి          :             అర చెంచ 
నూనె                     :            అరకిలో 
నిమ్మకాయ             :            1

తయారుచేసే పద్ధతి :

                   మటన్ ముక్కలు కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బట్ట మీద వేసి కాసేపు ఆరనివ్వాలి. మూకుడులో నూనె(డీప్ ఫ్రైకి సరిపడా) వేడి చేసుకొని మటన్ ముక్కలు వేయించుకోవాలి. మటన్ ముక్క ఉడకడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ముక్క ఉడికింది లేనిది చూసుకొని, నూనెలో నుంచి  చిల్లుల గరిటెతో ఒక గిన్నెలోకి తీసుకోవాలి.  స్టవ్ ఆర్పివేయాలి.  మూకుడులో ఒక కప్పు లేదా కప్పున్నర నూనె మాత్రం ఉంచి మిగిలిన నూనె తీసేయాలి. స్టవ్ తక్కువ మంట మీద పెట్టుకొని ఆ మూకుడు పెట్టి, అందులో నూరిన అల్లం, వెల్లుల్లి ముద్ద,లవంగాల పొడి, కారం, ఉప్పు వేసుకోవాలి. స్టవ్ ఆర్పివేసి , గిన్నెలోకి తీసుకున్న మటన్ ముక్కలను వేసి అన్ని ముక్కలకు కారం పట్టేలా కలపాలి.  వేడి తగ్గిన తరువాత నిమ్మకాయరసం పిండాలి. 

మూలం: ప్రజశక్తి ఆదివారం 
0 Comments

చేపల పచ్చడి 

5/24/2013

1 Comment

 
కావలసిన పదార్థాలు :

చేపముక్కలు            :           అరకిలో 
వెల్లుల్లి                     :           ఒక గడ్డ (రుబ్బుకోవాలి)
కారం                      :            అరకప్పు 
ఉప్పు                     :            ఒక టేబుల్ స్పూన్ 
లవంగాలు               :             2
యాలకులు             :             1
దాల్చిన చెక్క           :             ఒక చిన్న ముక్క 
నూనె                     :            అరకిలో 
నిమ్మకాయ             :            1

తయారుచేసే పద్ధతి :

         ముందుగా లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క పొడి కొట్టి మసాలా తయారుచేసుకోవాలి. తర్వాత చేప  ముక్కలు కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బట్ట మీద వేసి నీరు కాస్త ఇంకిపోయేలా ఆరనివ్వాలి. మూకుడులో నూనె(డీప్ ఫ్రైకి సరిపడా) వేడి చేసుకొని చేప ముక్కలు వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేగితే ముక్కలు పొడిపొడిగా తునిగిపోతాయి కనుక ముక్క ఉడికితే సరిపోతుంది. చిల్లుల గరిటెతో ఒక గిన్నెలోకి తీసుకోవాలి.  స్టవ్ ఆర్పివేయాలి.  మూకుడులో ఒక కప్పు లేదా కప్పున్నర నూనె మాత్రం ఉంచి మిగిలిన నూనె తీసేయాలి. ఇది వేడిగా ఉంటుంది కాబట్టి ఇందులో నూరిన వెల్లుల్లి ముద్ద, ఇష్టమైతే కరివేపాకు, మసాలా పొడి, కారం, ఉప్పు వేసి గిన్నెలోకి తీసుకున్న చేప ముక్కలను కూడా ఇందులో వేయాలి. గరిటెతో బాగా కలిపి వేడి తగ్గిన తరువాత నిమ్మకాయరసం పిండాలి. 

మూలం: ప్రజశక్తి ఆదివారం 
1 Comment

చికెన్ పచ్చడి 

5/24/2013

1 Comment

 
కావలసిన పదార్థాలు :

బోన్ లెస్  చికెన్        :           అరకిలో 
వెల్లుల్లి                     :           ఒక గడ్డ (రుబ్బుకోవాలి)
కారం                      :            అరకప్పు 
ఉప్పు                     :            ఒక టేబుల్ స్పూన్ 
లవంగాలు               :             2
యాలకులు             :             1
దాల్చిన చెక్క           :             ఒక చిన్న ముక్క 
నూనె                     :            అరకిలో 
నిమ్మకాయ             :            1

తయారుచేసే పద్ధతి :

ముందుగా లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క పొడి కొట్టి మసాలా తయారుచేసుకోవాలి. తర్వాత చికెన్ ముక్కలు కడిగి ఒక బట్ట మీద వేసి కాసేపు ఆరనివ్వాలి. మూకుడులో నూనె(డీప్ ఫ్రైకి సరిపడా) వేడి చేసుకొని చికెన్ ముక్కలు వేయించుకోవాలి. చికెన్ ముక్క నూనెలో ఉడికింది లేనిది చూసుకొని (మరి గట్టిపడకుండా) చిల్లుల గరిటెతో ఒక గిన్నెలోకి తీసుకోవాలి.  స్టవ్ ఆర్పివేయాలి.  మూకుడులో ఒక కప్పు లేదా కప్పున్నర నూనె మాత్రం ఉంచి మిగిలిన నూనె తీసేయాలి. ఇది వేడిగా ఉంటుంది కాబట్టి ఇందులో నూరిన వెల్లుల్లి ముద్ద, ఇష్టమైతే కరివేపాకు, మసాలా పొడి, కారం, ఉప్పు వేసి గిన్నెలోకి తీసుకున్న చికెన్ ముక్కలను కూడా ఇందులో వేయాలి. గరిటెతో బాగా కలిపి వేడి తగ్గిన తరువాత నిమ్మకాయరసం పిండాలి. ఇది బాటిల్ లోకి తీసుకొని పెడితే నెల రోజులు నిల్వ ఉంటుంది.

మూలం: ప్రజశక్తి ఆదివారం 
1 Comment

ములగ ఆకులతో చట్నీ రైస్ 

5/24/2013

0 Comments

 
కావలసిన పదార్థాలు :

ఉడికించిన అన్నం              :         రెండు కప్పులు 
ములగ ఆకులు                 :          రెండు కప్పులు 
వెల్లుల్లి రెబ్బలు                  :          పది 
ఎండు మిరపకాయలు        :           మూడు 
పచ్చిమిరపకాయలు          :           రెండు 
చింతపండు                       :            కొద్దిగా 
ఆవాలు                            :            అరటీస్పూన్
మినపప్పు                       :            అరటీస్పూన్ 
ఉప్పు                              :              తగినంత 
నూనె                              :              తగినంత 

తయారుచేసే పద్ధతి :

ప్యాన్ లో నూనె వేడి చేసి వెల్లుల్లి, ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ వేసి వేయించాలి. అందులో ములగ ఆకులు కలపాలి. కొంచెం సేపు ఉడికిన తర్వాత చింతపండు వేసి కొద్దిసేపటి తర్వాత స్టవ్ కట్టివేయాలి. చల్లారిన తర్వాత వేయించిన పదార్థాలన్నీ కలిపి ఉప్పు, తగినంత నీరు పోసి మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. 
ప్యాన్ లో నూనె వేడి చేసి ఆవాలు, మినపప్పు వేసి చిటపటలాడాక అన్నంలో తాలింపు వేసి కలియబెట్టాలి. రుబ్బిన ములగ చట్నీ అన్నంలో వేసి బాగా కలియబెట్టాలి. అన్నానికి గ్రీన్ చట్నీ బాగా పట్టాలి. ఏ సైడ్ డిష్ తోనైనా దీన్ని తింటే రుచిగా ఉంటుంది.

మూలం: స్వాతి సపరివార పత్రిక 
0 Comments

నువ్వుల చట్నీ  

5/17/2013

0 Comments

 
కావలసిన పదార్థాలు :

నువ్వులు              :           పావుకిలో 
పచ్చిమిర్చి            :            తగినన్ని 
బెల్లం                     :            50 గ్రా.
వంకాయలు           :             2(ఉడికించినవి)
ఉల్లిగడ్డ                  :             1
నీళ్ళు                    :             ఒక కప్పు 
పోపు గింజలు        :             చెంచాడు 
నూనె                    :             సరిపడా
ఉప్పు                   :              తగినంత 

తయారుచేసే పద్ధతి :

          నువ్వులను శుభ్రంగా కడిగి ఆరబెట్టి దోరగా వేయించాలి. పచ్చిమిర్చిని నూనెలో వేయించుకోవాలి. నువ్వులు, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, బెల్లం కలిపి నీళ్ళు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత పోపు పెట్టుకొని మన ఇష్టాన్ని బట్టి ఉడికించిన వంకాయ లేదా ఉల్లిగడ్డను దీనిలో కలుపుకోవాలి. ఎంతో ప్రత్యేకమైన రుచితో ఉండే ఈ నువ్వుల చట్నీ నువ్వుల రొట్టెతో కానీ, నువ్వుల పులగంతో కానీ తింటే ఆ మజానే వేరు.

మూలం : నమస్తే తెలంగాణ ఆదివారం పుస్తకం  
0 Comments

ఆవకాయ 

5/16/2013

1 Comment

 
కావలసిన పదార్థాలు :

మామిడికాయ ముక్కలు  :         1 కేజీ 
నువ్వుల నూనె                :          1/4 కేజీ 
కారం పొడి                       :           125 గ్రా.
ఉప్పు                             :           250 గ్రా.
మెంతి పొడి                     :           10 గ్రా.
పసుపు                          :            10 గ్రా.
ఆవాలు                          :             1 టీస్పూన్ 
జీలకర్ర                           :              1 టీస్పూన్ 

తయారుచేసే పద్ధతి :

               మామిడికాయలను ముక్కలుగా కొట్టుకోవాలి. ఓ గిన్నెలో కారం పొడి, ఉప్పు, జీలకర్ర, మెంతిపొడి, పసుపు వేసి ఉండలు లేకుండా బాగా కలియబెట్టాలి. మరోగిన్నెలో నువ్వుల నూనె వేడి చేసుకోవాలి. ఈ నూనె బాగా కాగిన తరువాత ఆవాలు, జీలకర్ర కూడా వేసి పోపు పెట్టాలి. నూనె చల్లారిన తర్వాత మామిడి ముక్కలు వేసి ముక్కలకు పట్టేటట్టుగా కలపాలి. మొత్తం కలిపి శుభ్రం అయిన జాడీలో ఆవకాయ వేసి జాగ్రత్తగా మూత పెట్టాలి. 3 రోజుల తర్వాత ఆవకాయంత కలియబెట్టాలి. అంతే నోరూరించే కమ్మని ఆవకాయ తినడానికి రెడీ. 

1 Comment

ఉసిరికాయ పచ్చడి 

5/13/2013

0 Comments

 
కావలసిన పదార్థాలు :

పెద్ద ఉసిరికాయలు    -         పావుకిలో 
నూనె                      -          6 టీ స్పూన్లు 
పచ్చిమిర్చి              -          6
ఉప్పు                     -           తగినంత 
నిమ్మరసం              -           ఒక టీ స్పూన్               
కొత్తిమీర                 -           ఒక కట్ట  
ఆవాలు                  -           రెండు  టీ స్పూన్లు 
జీలకర్ర                   -            రెండు  టీ స్పూన్లు  
మినపప్పు             -            రెండు  టీ స్పూన్లు 
శనగపప్పు            -             రెండు  టీ స్పూన్లు 
ఎండుమిర్చి           -             10
పసుపు                -             చిటికెడు 

తయారుచేసే పద్ధతి :

           ముందుగా ఉసిరికాయలను జాగ్రత్తగా స్టవ్ మీద కాల్చి, చల్లారాక పల్చని పొట్టు, లోపల గింజలను తీసి ముక్కలుగా చేసుకోవాలి. బాణలిలో నూనె పోసి కాగాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి బాగా దోరగా వేగాక ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి మరో మారు వేయించి దించేయాలి. అది చల్లారాక మిక్సిలో వేసి మెత్తగా చేసుకోవాలి. మెత్తగా అయ్యాక ఉప్పు, చింతపండు, ఉసిరికముక్కలు , కొద్దిగా కొత్తిమీర వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. పచ్చడిని బౌల్ లోకి తీసుకొని, కొద్దిగా నిమ్మరసం వేసి బాగా కలిపి   చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి.


మూలం : సాక్షి దినపత్రిక 
0 Comments

చిలగడదుంప పచ్చడి 

5/13/2013

0 Comments

 
కావలసిన పదార్థాలు :

చిలగడదుంపలు      -         3(పెద్దవి)
నూనె                     -          5 టీ స్పూన్లు 
పచ్చిమిర్చి             -          5
ఉప్పు                    -           తగినంత 
నానబెట్టిన చింతపండు -        కొద్దిగా 
కొత్తిమీర                -           కొద్దిగా 
ఆవాలు                 -           ఒక టీ స్పూన్
జీలకర్ర                 -            ఒక టీ స్పూన్ 
మినపప్పు            -            ఒక టీ స్పూన్ 
శనగపప్పు           -             ఒక టీ స్పూన్ 
ఎండుమిర్చి          -             6
పసుపు               -             చిటికెడు 
కరివేపాకు            -            రెండు రెమ్మలు 

తయారుచేసే పద్ధతి :

మొదట చిలగడదుంపలను స్టవ్ మీద కాల్చి, చల్లారాక పొట్టు తీసి ముక్కలుగా చేసుకోవాలి. బాణలిలో నూనె పోసి కాగాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి బాగా దోరగా వేగాక ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి మరో మారు వేయించి దించేయాలి. అది చల్లారాక మిక్సిలో వేసి మెత్తగా చేసుకోవాలి. మెత్తగా అయ్యాక ఉప్పు, చింతపండు, చిలగడదుంపలు వేసి తిప్పాలి. పచ్చడిని బౌల్ లోకి తీసుకొని,  చివరగా కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్ చేసుకోవాలి.

మూలం : సాక్షి దినపత్రిక 
0 Comments

అరటికాయ పచ్చడి 

5/13/2013

 
కావలసిన పదార్థాలు :

అరటికాయలు         -         2(పచ్చివి)
నూనె                     -          6 టీ స్పూన్లు 
పచ్చిమిర్చి             -          4
ఉప్పు                    -           తగినంత 
పసుపు                  -           చిటికెడు
నానబెట్టిన చింతపండు -        కొద్దిగా 
కొత్తిమీర                -           కొద్దిగా 
ఆవాలు                 -           రెండు  టీ స్పూన్లు 
జీలకర్ర                  -            రెండు  టీ స్పూన్లు 
మినపప్పు            -            రెండు టీ స్పూన్లు 
శనగపప్పు           -             రెండు టీ స్పూన్లు 
ఎండుమిర్చి          -             6
కరివేపాకు            -             రెండు రెమ్మలు 
ఇంగువ               -             కొద్దిగా 
పల్లీల పొడి           -             మూడు టీ స్పూన్లు

తయారుచేసే పద్ధతి :

              మొదట అరటికాయలను స్టవ్ మీద కాల్చి, చల్లారాక పొట్టు తీసి ముక్కలుగా చేసుకోవాలి. బాణలిలో నూనె పోసి కాగాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి బాగా దోరగా వేగాక ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి మరో మారు వేయించి దించేయాలి. అది చల్లారాక మిక్సిలో వేసి మెత్తగా చేసుకోవాలి. మెత్తగా అయ్యాక ఉప్పు, చింతపండు, అరటికాయ ముక్కలు వేసి తిప్పాలి. పచ్చడిని బౌల్ లోకి తీసుకొని, పల్లీలపొడి వేసి కలిపి, చివరగా కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్ చేసుకోవాలి.

మూలం : సాక్షి దినపత్రిక 
<<Previous

    Author

    నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ  మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో  ఒక  తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం. 

    Categories

    All
    ములగ ఆకులు
    చేపల పచ్చడి
    మటన్ పచ్చడి
    వంకాయ
    టమాటా
    నిమ్మ - టొమాటో పచ్చడి
    దోసకాయ
    టొమాటో - పండుమిర్చి పచ్చడి
    పల్లీల చట్నీ
    చికెన్ పచ్చడి
    సొరకాయ పచ్చడి
    అరటికాయ
    రొయ్యలు
    నువ్వుల పచ్చడి
    కొబ్బరి పచ్చడి
    నువ్వులు
    ఉసిరికాయ
    చిక్కుడు ఆవకాయ
    క్యారెట్ పచ్చడి
    ఉల్లిపాయ పచ్చడి
    ఉసిరికాయ పచ్చడి
    మామిడికాయ
    చిలగడదుంప
    కందపచ్చడి
    క్యారెట్‌-కాప్సికమ్‌ పచ్చడి
    చింతచిగురు పొడి
    బీట్‌రూట్‌ పచ్చడి
    క్యాప్సికం పచ్చడి
    ఉసిరిపచ్చడి

    Archives

    January 2014
    December 2013
    November 2013
    October 2013
    September 2013
    August 2013
    July 2013
    June 2013
    May 2013

    RSS Feed

    Enter your email address:

    Delivered by FeedBurner


Powered by Create your own unique website with customizable templates.