పెద్ద ఉసిరికాయలు - పావుకిలో
నూనె - 6 టీ స్పూన్లు
పచ్చిమిర్చి - 6
ఉప్పు - తగినంత
నిమ్మరసం - ఒక టీ స్పూన్
కొత్తిమీర - ఒక కట్ట
ఆవాలు - రెండు టీ స్పూన్లు
జీలకర్ర - రెండు టీ స్పూన్లు
మినపప్పు - రెండు టీ స్పూన్లు
శనగపప్పు - రెండు టీ స్పూన్లు
ఎండుమిర్చి - 10
పసుపు - చిటికెడు
తయారుచేసే పద్ధతి :
ముందుగా ఉసిరికాయలను జాగ్రత్తగా స్టవ్ మీద కాల్చి, చల్లారాక పల్చని పొట్టు, లోపల గింజలను తీసి ముక్కలుగా చేసుకోవాలి. బాణలిలో నూనె పోసి కాగాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి బాగా దోరగా వేగాక ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి మరో మారు వేయించి దించేయాలి. అది చల్లారాక మిక్సిలో వేసి మెత్తగా చేసుకోవాలి. మెత్తగా అయ్యాక ఉప్పు, చింతపండు, ఉసిరికముక్కలు , కొద్దిగా కొత్తిమీర వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. పచ్చడిని బౌల్ లోకి తీసుకొని, కొద్దిగా నిమ్మరసం వేసి బాగా కలిపి చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి.
మూలం : సాక్షి దినపత్రిక