మామిడికాయ ముక్కలు : 1 కేజీ
నువ్వుల నూనె : 1/4 కేజీ
కారం పొడి : 125 గ్రా.
ఉప్పు : 250 గ్రా.
మెంతి పొడి : 10 గ్రా.
పసుపు : 10 గ్రా.
ఆవాలు : 1 టీస్పూన్
జీలకర్ర : 1 టీస్పూన్
తయారుచేసే పద్ధతి :
మామిడికాయలను ముక్కలుగా కొట్టుకోవాలి. ఓ గిన్నెలో కారం పొడి, ఉప్పు, జీలకర్ర, మెంతిపొడి, పసుపు వేసి ఉండలు లేకుండా బాగా కలియబెట్టాలి. మరోగిన్నెలో నువ్వుల నూనె వేడి చేసుకోవాలి. ఈ నూనె బాగా కాగిన తరువాత ఆవాలు, జీలకర్ర కూడా వేసి పోపు పెట్టాలి. నూనె చల్లారిన తర్వాత మామిడి ముక్కలు వేసి ముక్కలకు పట్టేటట్టుగా కలపాలి. మొత్తం కలిపి శుభ్రం అయిన జాడీలో ఆవకాయ వేసి జాగ్రత్తగా మూత పెట్టాలి. 3 రోజుల తర్వాత ఆవకాయంత కలియబెట్టాలి. అంతే నోరూరించే కమ్మని ఆవకాయ తినడానికి రెడీ.