దోసకాయలు - 2(పెద్దవి)
నూనె - 6 టీ స్పూన్లు
పచ్చిమిర్చి - 6
ఉప్పు - తగినంత
పసుపు - చిటికెడు
నానబెట్టిన చింతపండు - కొద్దిగా
కొత్తిమీర - కొద్దిగా
ఆవాలు - రెండు టీ స్పూన్లు
జీలకర్ర - ఒక టీ స్పూన్
మినపప్పు - మూడు టీ స్పూన్లు
శనగపప్పు - రెండు టీ స్పూన్లు
ఎండుమిర్చి - 10
బెల్లం - కొద్దిగా (రుచిని బట్టి)
తయారుచేసే పద్ధతి :
మొదట దోసకాయలను స్టవ్ మీద కాల్చి, చల్లారాక పొట్టు తీయాలి. బాణలిలో నూనె పోసి కాగాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి బాగా దోరగా వేగాక ఎండుమిర్చి వేసి మరో మారు వేయించి దించేయాలి. అది చల్లారాక మిక్సిలో వేస్ మెత్తగా చేసుకోవాలి. దోసకాయ గుజ్జు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, చింతపండు గుజ్జు వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. చివరగా కొత్తిమీర తో గార్నిష్ చేసుకోవాలి.
మూలం : సాక్షి దినపత్రిక