ఉడికించిన అన్నం : రెండు కప్పులు
ములగ ఆకులు : రెండు కప్పులు
వెల్లుల్లి రెబ్బలు : పది
ఎండు మిరపకాయలు : మూడు
పచ్చిమిరపకాయలు : రెండు
చింతపండు : కొద్దిగా
ఆవాలు : అరటీస్పూన్
మినపప్పు : అరటీస్పూన్
ఉప్పు : తగినంత
నూనె : తగినంత
తయారుచేసే పద్ధతి :
ప్యాన్ లో నూనె వేడి చేసి వెల్లుల్లి, ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ వేసి వేయించాలి. అందులో ములగ ఆకులు కలపాలి. కొంచెం సేపు ఉడికిన తర్వాత చింతపండు వేసి కొద్దిసేపటి తర్వాత స్టవ్ కట్టివేయాలి. చల్లారిన తర్వాత వేయించిన పదార్థాలన్నీ కలిపి ఉప్పు, తగినంత నీరు పోసి మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి.
ప్యాన్ లో నూనె వేడి చేసి ఆవాలు, మినపప్పు వేసి చిటపటలాడాక అన్నంలో తాలింపు వేసి కలియబెట్టాలి. రుబ్బిన ములగ చట్నీ అన్నంలో వేసి బాగా కలియబెట్టాలి. అన్నానికి గ్రీన్ చట్నీ బాగా పట్టాలి. ఏ సైడ్ డిష్ తోనైనా దీన్ని తింటే రుచిగా ఉంటుంది.
మూలం: స్వాతి సపరివార పత్రిక