వంకాయలు - 4(పెద్దవి)
నూనె - 6 టీ స్పూన్లు
పచ్చిమిర్చి - 10
ఉప్పు - తగినంత
పసుపు - చిటికెడు
నానబెట్టిన చింతపండు - కొద్దిగా
కొత్తిమీర - కొద్దిగా
ఆవాలు - ఒక టీ స్పూన్
జీలకర్ర - ఒక టీ స్పూన్
మినపప్పు - ఒక టీ స్పూన్
శనగపప్పు - ఒక టీ స్పూన్
ఎండుమిర్చి - 10
ఉల్లి తరుగు - అర కప్పు
కరివేపాకు - రెండు రెమ్మలు
నువ్వుల పొడి - రెండు టీ స్పూన్లు
తయారుచేసే పద్ధతి :
మొదటగా వంకాయలకు కొద్దిగా నూనె రాసి స్టవ్ మీద పెట్టి కాల్చుకోవాలి. చల్లారిన తర్వాత పొట్టు తీసి, (పురుగులు ఉన్నాయేమో చూసి) మెత్తగా చేతితో మెదపాలి. పచ్చిమిర్చి, ఉప్పు, చింతపండు కలిపి మిక్సీ పట్టాలి. వంకాయ గుజ్జును వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టి తీసేయాలి. బాణలి లో నూనె వేసి కాగాక పోపు దినుసులు ఒకొక్కటిగా వేస్తూ దోరగా వేయించి, చల్లారాక పచ్చడిలో కలపాలి. ఉల్లి తరుగు, నువ్వుల పొడి, కరివేపాకు వేసి కలపాలి. సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.
మూలం : సాక్షి దినపత్రిక