చిలగడదుంపలు - 3(పెద్దవి)
నూనె - 5 టీ స్పూన్లు
పచ్చిమిర్చి - 5
ఉప్పు - తగినంత
నానబెట్టిన చింతపండు - కొద్దిగా
కొత్తిమీర - కొద్దిగా
ఆవాలు - ఒక టీ స్పూన్
జీలకర్ర - ఒక టీ స్పూన్
మినపప్పు - ఒక టీ స్పూన్
శనగపప్పు - ఒక టీ స్పూన్
ఎండుమిర్చి - 6
పసుపు - చిటికెడు
కరివేపాకు - రెండు రెమ్మలు
తయారుచేసే పద్ధతి :
మొదట చిలగడదుంపలను స్టవ్ మీద కాల్చి, చల్లారాక పొట్టు తీసి ముక్కలుగా చేసుకోవాలి. బాణలిలో నూనె పోసి కాగాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి బాగా దోరగా వేగాక ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి మరో మారు వేయించి దించేయాలి. అది చల్లారాక మిక్సిలో వేసి మెత్తగా చేసుకోవాలి. మెత్తగా అయ్యాక ఉప్పు, చింతపండు, చిలగడదుంపలు వేసి తిప్పాలి. పచ్చడిని బౌల్ లోకి తీసుకొని, చివరగా కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్ చేసుకోవాలి.
మూలం : సాక్షి దినపత్రిక