నువ్వులపప్పు-కప్పు,
తాజాపెరుగు-మూడు కప్పులు
నిమ్మకాయ-ఒకటి
ఉప్పు-తగినంత
పసుపు-పావు టీస్పూను
పచ్చిమిర్చి-నాలుగు
ఎండుమిర్చి-రెండు,
ఆవాలు-ఒక టీస్పూను
మెంతులు-ఒక టీస్పూను
కరివేపాకు-రెండు రెబ్బలు
నూనె-రెండు టేబుల్‌స్పూను
తయారుచేసే విధానం
- నువ్వులపప్పు కొద్దిగా వేయించి తీయాలి.
- కాస్త నూనెలో పచ్చిమిర్చి వేయించి తీయాలి.
- ఇప్పుడు పచ్చిమిర్చి, నువ్వులు కలిపి మెత్తగా రుబ్బాలి.
- తరువాత ఈ మిశ్రమాన్ని పెరుగులో వేసి కలపాలి. ఉప్పు కూడా వేసి నిమ్మరసం పిండి పక్కన ఉంచాలి.
- స్టవ్‌మీద బాణలి పెట్టి నూనె వేసి ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేగాక పెరుగుపచ్చడిలో వేసి కలపాలి. ఈ పచ్చడి అన్నంలోకీ, టిఫెన్లలోకీ కూడా బాగుంటుంది.