సొరకాయ ముక్కలు - ఒకటిన్నర కప్పు (చెక్కుతో సహా తీసుకోవాలి)
సెనగ పప్పు, మినప్పప్పు - అర టేబుల్ స్పూన్ చొప్పున
జీలకర్ర - అరచెంచా
ధనియాలు - చెంచా
ఎండు మిర్చి - ఆరు
పచ్చిమిర్చి - పది
చింతపండు - కొద్దిగా
ఉప్పు - తగినంత
నూనె - 4 టేబుల్ స్పూన్లు
తాలింపు కోసం :
ఆవాలు - అరచెంచా
మినప్పప్పు - అరచెంచా
కరివేపాకు - రెండు రెబ్బలు
తయారుచేసే పద్ధతి :
- బాణలిలో ఒక చెంచా నూనె వేడి చేసి సెనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి వేయించుకొని తీసి పెట్టుకోవాలి.
- అదే బాణలిలో ఒకటిన్నర చెంచాల నూనె పోసి, కాగాక సోరక్కాయ ముక్కలు, పచ్చిమిర్చి, చింత పండు వేసి మూత పెట్టాలి. కూరముక్కల్ని మెత్తగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత వేడి చల్లారాక అన్నింటిని మిక్సీలో తీసుకొని, తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా రుబ్బుకుంటే సరిపోతుంది.
- బాణలిలో మిగతా నూనె వేసి, కాగాక తాలింపు కోసం తీసుకున్న పదార్థాలను వేయించి పచ్చడిపై వేస్తే చాలా రుచిగా ఉంటుంది.
మూలం : ఈనాడు వసుంధర