బోన్ లెస్ చికెన్ : అరకిలో
వెల్లుల్లి : ఒక గడ్డ (రుబ్బుకోవాలి)
కారం : అరకప్పు
ఉప్పు : ఒక టేబుల్ స్పూన్
లవంగాలు : 2
యాలకులు : 1
దాల్చిన చెక్క : ఒక చిన్న ముక్క
నూనె : అరకిలో
నిమ్మకాయ : 1
తయారుచేసే పద్ధతి :
ముందుగా లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క పొడి కొట్టి మసాలా తయారుచేసుకోవాలి. తర్వాత చికెన్ ముక్కలు కడిగి ఒక బట్ట మీద వేసి కాసేపు ఆరనివ్వాలి. మూకుడులో నూనె(డీప్ ఫ్రైకి సరిపడా) వేడి చేసుకొని చికెన్ ముక్కలు వేయించుకోవాలి. చికెన్ ముక్క నూనెలో ఉడికింది లేనిది చూసుకొని (మరి గట్టిపడకుండా) చిల్లుల గరిటెతో ఒక గిన్నెలోకి తీసుకోవాలి. స్టవ్ ఆర్పివేయాలి. మూకుడులో ఒక కప్పు లేదా కప్పున్నర నూనె మాత్రం ఉంచి మిగిలిన నూనె తీసేయాలి. ఇది వేడిగా ఉంటుంది కాబట్టి ఇందులో నూరిన వెల్లుల్లి ముద్ద, ఇష్టమైతే కరివేపాకు, మసాలా పొడి, కారం, ఉప్పు వేసి గిన్నెలోకి తీసుకున్న చికెన్ ముక్కలను కూడా ఇందులో వేయాలి. గరిటెతో బాగా కలిపి వేడి తగ్గిన తరువాత నిమ్మకాయరసం పిండాలి. ఇది బాటిల్ లోకి తీసుకొని పెడితే నెల రోజులు నిల్వ ఉంటుంది.
మూలం: ప్రజశక్తి ఆదివారం