- ఒక టీస్పూన్ ఆముదము తీసుకోండి. బీవ్యాక్స్ ఒక అరటీస్పూన్, ఆప్రికాట్ నూనె ఒక అరటీస్పూన్, సముద్రపు ఉప్పు ఒక టేబుల్ స్పూన్, ఆల్మండ్ పౌడర్ ఒక టీస్పూన్, బేబీషాంపూ రెండు టీస్పూన్లు తీసుకోండి. బీవ్యాక్స్ను బాగా కరిగించి ఆముదము ఆప్రికాట్ నూనెలను వేసి బాగా కలపండి. వేడిమీద తీసెయ్యండి. సముద్రపు ఉప్పును, ఆల్మండ్ పౌడర్ని కలిపి, షాంపూలో వేసి బాగా కలియబెట్టండి. ఆ తర్వాత ఉపయోగించండి.
- బొప్పాయి కాయ సగం తీసుకోండి. దానికి నాలుగు టేబుల్స్పూన్ల బియ్పప్పిండి మొత్తాన్ని కలిపి బాగా గుజ్జుగుజ్జుగా పిసకండి. అందులో కొన్ని చుక్కల ఆరెంజ్ నూనెను కలపండి. మొత్తం కలిసేలా కలియబెట్టండి. మిశ్రమమైన ఆ పదార్థాన్ని చేతివేళ్ల చర్మంతో ముఖానికి గుండ్రంగా పూస్తూ ముఖం మొత్తం కవర్ చేయండి. పావుగంట తర్వాత ఆయిల్ను మాయిశ్చరైజర్ను చేసుకోండి. ఆపై శుభ్రంగా వాష్చేసుకుంటే ముఖం అందంగా తయారవుతుంది.