- - అర టీస్పూన్ కీరారసంలో కొద్దిగా రోజ్‌వాటర్ కలిపి ఈ మిశ్రమాన్ని కళ్లకు రాసుకుని అరగంటసేపు ఉంచి ఆ తర్వాత కడుక్కుంటే కళ్లు ఆకర్షణీయంగా ఉంటాయి.
- - కళ్లు చాలా సున్నితమైనవి కాబట్టి బజారున దొరికే ఏ క్రీం పడితే ఆ క్రీం రాసెయ్యకూడదు. ఇలా చెయ్యడం వల్ల మీ కళ్లు ఇన్‌ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఉంది.
- - తగినంత ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల కళ్లకు రెస్ట్ దొరికి తాజాగా కనపడతాయి.
- - గ్లాస్ నీటిలో ఉసిరిపొడి నానబెట్టి ఉదయాన్నే ఈ మిశ్రమంతో ఉదయాన్నే కళ్లను కడుక్కుంటే కళ్లు తాజాగా మెరుస్తాయి.
- - కళ్ల చుట్టూ ఉండే ముడతలు పోవాలంటే పాలమీగడతో అక్కడ మసాజ్ చేసుకుంటే ముడతలు నుండి విముక్తి పొందవచ్చు.
- - కీరదోసకాయను చక్రాల్లా కట్ చేసుకుని ఆ చక్రాలను కంటిమీద ఉంచుకుంటే కళ్లు తాజాగా ఉంటాయి. ఆల్మండ్ ఆయిల్‌లో కొంచెం ఆలివ్ ఆయిల్ కలిపి కంటిచుట్టూ ఉండే నలుపు ప్రాంతంపై రాస్తే ఆ నలుపును నివారించవచ్చు.
- - రోజూ పావుగంటపాటు రెండు చేతులను రెండు కళ్లపై ఉంచుకుని ప్రశాంతంగా కూర్చుంటే మీ కళ్లకు రిలీఫ్ లభిస్తుంది.
- - కళ్లకు మేకప్ చేసుకునే బ్రష్‌ల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. వీటిపై ఉండే దుమ్ము, ధూళి వల్ల మీ కళ్లకు ఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. ఉప్పునీటితో కళ్లను కడుక్కోవడం వల్ల కళ్లు మెరుస్తాయి.
- - కళ్లకు కాటుక పెట్టుకోవడం వల్ల కళ్లు చాలా అందంగా కనబడతాయి. ఐబ్రోస్ వెంట్రుకలు రాలుతుంటే వీటికి ఆలివ్ ఆయిల్ రాయడం ద్వారా నివారించవచ్చు. కళ్లకు ఇన్‌ఫెక్షన్ వచ్చినపుడు మేకప్ వేసుకోకూడదు.