- - మూడు టేబుల్‌స్పూన్ల రోజ్‌వాటర్‌కి, ఒక స్పూన్ గ్లిజరిన్, రెండు టీస్పూన్ల నిమ్మరసం కలపండి. ఆ మిశ్రమాన్ని చిన్న సీసాలో పోసి ఫ్రిజ్‌లో పెట్టండి. అవసరమైనప్పుడు తీసి వాడుకుంటూ ఉంటే, చర్మం పొడిబారకుండా మృదువుగా ఉంటుంది.
- - కప్పు రోజ్‌వాటర్‌లో టీస్పూన్ బొరాక్స్ పొడిని, రెండు టీస్పూన్ల వేడిచేసిన ఆలివ్ ఆయిల్‌ని బాగా కలపండి. మార్కెట్లో లావెండర్ వాటర్ దొరుకుతుంది. దీనిని పై మిశ్రమంలో కలిపి బాగా గిలక్కొట్టండి. కాసేపయ్యాక వాడుకోవచ్చు.
- - సబ్బుని చిన్నచిన్న ముక్కల్లా చెక్కుకుని మూడు టీస్పూన్ల నిండా దానిని తీసుకోవాలి. దానిని పావుకప్పు నీళ్లలో కలిపి వేడిచేసి, నాలుగు స్పూన్ల ఆలివ్ ఆయిల్‌ని, టీస్పూన్ గ్లిజరిన్‌నీ దాన్లో వేసి బాగా కలపాలి.